హోమ్ / వార్తలు / ఫూట్ వేర్ డిజైన్ & డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్- ఎఫ్ డి డి ఐ హైదరాబాద్ కేంపస్ లో ప్రవేశాలు
పంచుకోండి

ఫూట్ వేర్ డిజైన్ & డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్- ఎఫ్ డి డి ఐ హైదరాబాద్ కేంపస్ లో ప్రవేశాలు

ఫూట్ వేర్ డిజైన్ & డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్- ఎఫ్ డి డి ఐ హైదరాబాద్ కేంపస్ లో ప్రవేశాలు

ఫూట్ వేర్ డిజైన్ & డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్- ఎఫ్ డి డి ఐ హైదరాబాద్ కేంపస్ లో బి.ఎస్ సి- ఫూట్ వేర్ డిజైన్ & ప్రొడక్షన్ మరియు బి.ఎస్ సి- రిటైల్ & ఫ్యాషన్ మర్చండైజ్ కోర్సులకు ప్రవేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయని ఎఫ్ డి డి ఐ ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8939324827, 040- 6574446/443/442 ఫోన్ నంబర్లలో గాని, లేదా ఎఫ్ డి డి ఐ, సర్వే నంబర్లు 6 & 8, లిడ్ క్యాప్- నైలెక్స్ కేంపస్, హెచ్.ఎస్. దర్గా, రాయదుర్గం, ఓల్డ్ ముంబయ్ హైవే రోడ్డు, హైదరాబాద్- 500014 అనే చిరునామాలో గాని సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం www.fddiindia.com ను సందర్శించవచ్చు. 2016-17 విద్యాసంవత్సరానికి హైదరాబాద్ కేంపస్ లో ఒకటో బ్యాచ్ 2016 ఆగస్టు 22 నుండి ఆరంభం కానుందని ఎఫ్ డి డి ఐ డిప్యూటీ మేనేజరు (సి & పి) శ్రీమతి వైశాలి తెలిపారు.
దేశంలో పాదరక్షల పరిశ్రమ కు అవసరమైన మానవ వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లో ఎఫ్ డి డి ఐ ప్రముఖ సంస్థ. దీనిని కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తోంది. ఎఫ్ డి డి ఐ కేంద్ర కార్యాలయం నోయిడా లో ఉంది. ఎఫ్ డి డి ఐ కి నోయిడా, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, రోహ్ తక్, అంక్లేశ్వర్, జోధ్ పూర్, ఫుర్సత్ గంజ్ (లక్నో కు సమీపంలో), పట్నా, చండీగఢ్, ఛింద్వారా మరియు గుణ లలో  కేంపస్ లు ఉన్నాయి. ఈ కేంపస్ లన్నీ గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, సభా భవనం, బాల బాలికల వసతిగృహాలు, ఐటి లేబొరేటరీల వంటి ఆధునిక సౌకర్యాలను కలిగివున్నాయి. ఇంకా ఎఫ్ డి డి ఐ వేరువేరు విభాగాలలో రక రకాల కోర్సులను బోధించడంతో పాటు భారతీయ ఫ్యాషన్ పరిశ్రమకు సంబంధించిన పరిశోధన, శిక్షణ మరియు వికాసం సంబంధిత రంగాలలో అవకాశాలను కల్పించగలిగిన స్థితిలో ఉన్నది.
ఎఫ్ డి డి ఐ కి ఐఎస్ఒ 9001, ఐఎస్ఒ 1401, ఐఎస్ఒ 17025 వంటి సర్టిఫికేషన్ లు ఉన్నాయి. అంతే కాకుండా, ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన ఎస్ఎటిఆర్ఎ- యుకెతో పాటు, ఎల్ డిటి నగోల్డ్ (జర్మనీ), ఎఆర్ఎస్ సుతోరియా (ఇటలీ), థామస్ బాటా యూనివర్సిటీ (టిబియు) వంటి సంస్థలతో కూడా అక్రెడిటేషన్/ టై-అప్స్ ఉన్నాయి. భారతీయ ఫ్యాషన్, రిటైల్ మరియు పాదరక్షలు/ తోలు పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎఫ్ డి డి ఐ పనిచేస్తున్నది.

 

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు