హోమ్ / వార్తలు / బీడీఎస్‌ కౌన్సెలింగ్‌ గడువు వారం పెంపు
పంచుకోండి

బీడీఎస్‌ కౌన్సెలింగ్‌ గడువు వారం పెంపు

డెంటల్‌ వైద్య కళాశాలల్లో బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును వారం పాటు (అక్టోబరు 7 వరకు)పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.

డెంటల్‌ వైద్య కళాశాలల్లో బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును వారం పాటు (అక్టోబరు 7 వరకు)పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు సెప్టెంబరు 30లోపు పూర్తికావాల్సి ఉంటుంది. ఆలోపే కౌన్సెలింగ్‌ను ముగించాలి. అయితే 3,4 దశల్లో జరిగే కౌన్సెలింగ్‌లో తొలివిడత కౌన్సెలింగ్‌ల్లో బీడీఎస్‌ సీట్లు పొందిన విద్యార్థులు మలి విడత కౌన్సెలింగ్‌ల్లో ఎంబీబీఎస్‌ సీట్లు వస్తే బీడీఎస్‌ సీట్లను వదులుకుని వెళ్లిపోతున్నారని భారతీయ దంతమండలి (డీసీఐ) తెలిపింది. ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ముగిశాక వారంపాటు తాము కౌన్సెలింగ్‌ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంను కోరింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు