హోమ్ / వార్తలు / బ్రహ్మచారుల కోసం ఏపీ ప్రభుత్వ సరికొత్త పథకం
పంచుకోండి

బ్రహ్మచారుల కోసం ఏపీ ప్రభుత్వ సరికొత్త పథకం

బ్రహ్మచారుల కోసం ఏపీ ప్రభుత్వ సరికొత్త పథకం

దీపం పథకం కింద బ్రహ్మచారులకు కూడా గ్యాస్‌ కనెక్షన్లలు అందనున్నాయి. ఇప్పటి వరకు కుటుంబంలో ఒక్కరే పురుషుడు ఉంటే కనెక్షన్‌ ఇచ్చేందుకు నిబంధనలు అనుమతించవు. అయితే ప్రభుత్వం తాజాగా దీపం పథకం మార్గదర్శకాలకు కొంత సడలింపు ఇచ్చింది. మహిళకే కాదు ఒంటరిగా ఉండే పురుషులకు కూడా గ్యాస్‌ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.
జిల్లాలో ఒకే సభ్యుడు ఉన్న రేషన్‌ కార్డుల వివరాలను బట్టి వారందరికీ దీపం కింద గ్యాస్‌ కనెక్షన్లను అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల అమల్లో భాగంగా పురుషులకు కూడా దీపం కనెక్షన్లను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక సభ్యుడు కలిగిన రేషన్‌ కార్డుదారుల వివరాలను ఆయా ఏరియాలకు సంబంధించిన గ్యాస్‌ ఏజెన్సీలకు పంపించనున్నారు. వారు దీపం పథకం కింద వీరికి గ్యాస్‌ కనెక్షన్లను అందించనున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు