హోమ్ / వార్తలు / భారతదేశంలో నిర్వహించిన అత్యుత్తమడిజి-ధన్ మేళాలలో నిజామాబాద్ డిజి-ధన్ మేళా ఒకటి
పంచుకోండి

భారతదేశంలో నిర్వహించిన అత్యుత్తమడిజి-ధన్ మేళాలలో నిజామాబాద్ డిజి-ధన్ మేళా ఒకటి

భారతదేశంలో నిర్వహించిన అత్యుత్తమడిజి-ధన్ మేళాలలో నిజామాబాద్ డిజి-ధన్ మేళా ఒకటి

భారతదేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగాపయనిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ అన్నారు.ఆయన ఈ రోజు తెలంగాణ లోని నిజామాబాద్ లో నిర్వహించిన డిజి-ధన్ మేళా లో పాల్గొనిప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి భారతదేశంలో నిర్వహించిన అత్యుత్తమ డిజి-ధన్మేళాలలో నిజామాబాద్ డిజి-ధన్ మేళా ఒకటి అని వివరించారు. 2016 డిసెంబర్ 25వ తేదీనడిజి-ధన్ మేళా కార్యక్రమం ఆరంభమైందని, నగదురహిత లావాదేవీలను గురించి సామాన్య ప్రజానీకంలో జాగృతినికలిగించడంలో ఈ మేళాలు విజయవంతం అయ్యాయని ఆయన చెప్పారు. పాత పెద్ద నోట్ల చెలామణిరద్దు అవినీతిపైన, నల్లధనంపైన పోరు కోసం తీసుకున్న నిర్ణయమని, దీనితో దేశ జనాభాలో పన్నులు చెల్లిస్తున్న వారు ఒక్క శాతంగా మాత్రమేఉన్నట్లు తేలిందన్నారు. ఇది ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థ లక్షణం కాదు అని మంత్రిఅన్నారు. కేవలం 24 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని చెప్పారు. చట్టాలనుఅనుసరించకపోవడం మంచిది కాదన్నారు. సమాంతర ఆర్థిక వ్యవస్థ దేశానికి ఒక దుశ్శకునంఅని మంత్రి పేర్కొన్నారు. మొబైల్ సాంకేతికత ప్రజల కార్యకలాపాలలో మరీ ముఖ్యంగావ్యాపార లావాదేవీలలో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చిందని వివరించారు. మరింత మందిపన్నుల పరిధి లోకి వస్తే ఖజానాకు సమకూరి రహదారులు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను చేపట్టేందుకు ప్రభుత్వానికి ఊతంలభించగలదని శ్రీ మేఘ్ వాల్ చెప్పారు. మంచి ఆసుపత్రుల సంఖ్య పెరిగితే దేశ ప్రజలకుఆరోగ్య సంరక్షణ సేవలను కల్పించవచ్చని పేర్కొన్నారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం


పైకి వెళ్ళుటకు