హోమ్ / వార్తలు / మార్చిలోగా న్యూ–సదరన్‌ గ్రిడ్ల అనుసంధానం
పంచుకోండి

మార్చిలోగా న్యూ–సదరన్‌ గ్రిడ్ల అనుసంధానం

మార్చిలోగా న్యూ–సదరన్‌ గ్రిడ్ల అనుసంధానం

న్యూ గ్రిడ్‌(నార్త్, ఈస్ట్, వెస్ట్‌ గ్రిడ్‌) నుంచి దక్షిణాది(సదరన్) రాష్ట్రాల కు విద్యుత్‌ ఇచ్చి పుచ్చుకోవడానికి అనువైన లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్  ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. న్యూ గ్రిడ్‌ నుంచి సదరన్  గ్రిడ్‌కు లైన్ల నిర్మాణం పూర్తయితే దేశ వ్యాప్తంగా విద్యుదుత్పత్తి, డిమాండ్‌ల మధ్య సమన్వయం సాధించవచ్చన్నారు. పీజీసీ ఐఎల్‌ చైర్మన్  ఐఎస్‌ ఘా, సదరన్ జియన్  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శేఖర్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మంగళవారం ప్రగతి భవన్ లో సీఎంను కలిశారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకోవడానికి అవసరమైన వార్దా (మహారాష్ట్ర)– డిచ్‌పల్లి లైను నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీఎం కోరారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు