హోమ్ / వార్తలు / మెడికల్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా రద్దుపై తీర్పు వాయిదా
పంచుకోండి

మెడికల్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా రద్దుపై తీర్పు వాయిదా

మెడికల్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా రద్దుపై తీర్పు వాయిద

ప్రవాస భారతీయులకు మెడికల్ కోర్సుల్లో కోటాను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును గుజరాత్ హైకోర్టు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్లు లిఖితపూర్వక వినతులను సమర్పించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ వీఎం పంచోలి డివిజన్ బెంచ్ తీర్పును వాయిదా వేసింది. సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ డెంటల్ కాలేజీల బృందం, ఎన్ఆర్ఐ కోటాలో అడ్మిషన్లు కోరుతున్న నలుగురు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ ప్రొఫెషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ఫిక్సేషన్ ఆఫ్ ఫీజ్) (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2016ను ఈ పిటిషనర్లు సవాలు చేశారు. మెడికల్, పారా మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ విద్యార్థులకు కల్పిస్తున్న 15 శాతం రిజర్వేషన్‌ను ఈ ఆర్డినెన్స్ రద్దు చేస్తోంది. పీఏ ఇనామ్‌దార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ కోటాను ఏర్పాటు చేశారని, ఈ ఆర్డినెన్స్ ఆ తీర్పుకు వ్యతిరేకమని పిటిషనర్లు వాదించారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు