హోమ్ / వార్తలు / మొబైల్‌కు చెల్లు.. ఆధార్‌ చాలు!
పంచుకోండి

మొబైల్‌కు చెల్లు.. ఆధార్‌ చాలు!

మొబైల్‌కు చెల్లు.. ఆధార్‌ చాలు!

చేతిలో ఫోన్‌ లేకపోయినా... దగ్గర డెబిట్‌ కార్డు లేకున్నా... ఆధార్‌ నంబర్‌ ఒక్కటీ గుర్తుంచుకుంటే చాలు... ఎక్కడైనా సులభంగా నగదు చెల్లింపులు చేసేయవచ్చు. నగదు తీసుకోవొచ్చు. ఆధార్‌ నంబర్‌తో చెల్లింపులు, నగదు స్వీకరణలకు వీలు కల్పించే ‘ఆధార్‌ పే’ సేవను అతి త్వరలోనే ప్రభుత్వం పట్టాలెక్కించనుంది. ‘‘ఆధార్‌ పే సేవను ప్రారంభించబోతున్నాం. దీంతో నగదు చెల్లింపులకు ఫోన్‌ను తమ వెంట తీసుకుని వెళ్లనవసరం లేదు. ఏ దుకాణానికైనా వెళ్లి తమ ఆధార్‌ నంబర్‌ చెప్పి, వేలి ముద్రలు వేయడం ద్వారా నగదు చెల్లించవచ్చు, స్వీకరించవచ్చు’’ అని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ఆధార్‌ పే సర్వీస్‌ పరిధిలోకి ఇప్పటి వరకు 14 బ్యాంకులు వచ్చి చేరాయని, మిగిలిన బ్యాంకులతోనూ చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు