హోమ్ / వార్తలు / రైల్వే ‘రాయితీ’కి ఆధార్‌ అనుసంధానం
పంచుకోండి

రైల్వే ‘రాయితీ’కి ఆధార్‌ అనుసంధానం

రైల్వే ‘రాయితీ’కి ఆధార్‌ అనుసంధానం

రైల్వేశాఖ ఇస్తున్న రాయితీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా రాయితీ టికెట్లకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని యోచిస్తున్నారు. ఈ దిశగా విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)తో సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఆధార్‌ను ఏ మేరకు ఉపయోగించుకోవచ్చో తెలపాలంటూ రైల్వే సహా అన్ని మంత్రిత్వశాఖలను ఆర్థికశాఖ కోరిందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎల్పీజీ, పాస్‌పోర్టు సేవలతో ఆధార్‌ కార్డు అనుసంధానం సత్ఫలితాలను ఇవ్వడంతో.. రైల్వే టికెటింగ్‌, బుకింగ్‌కూ దానిని విస్తరించే అవకాశాలపై అధికారులు దృష్టి సారించారు. సీనియర్‌ సిటిజెన్లు, రోగులు, కళాకారులు, క్రీడాకారులు, పాత్రికేయులు తదితర వర్గాలకు రైల్వేశాఖ చార్జీల్లో రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు