హోమ్ / వార్తలు / క్యాన్సర్‌ను గుర్తించే కొత్త పరిజ్ఞానం
పంచుకోండి

క్యాన్సర్‌ను గుర్తించే కొత్త పరిజ్ఞానం

శరీరంలోని కణజాలం నమూనాల్ని సేకరించాల్సిన అవసరం లేకుండానే.. క్యాన్సర్‌ను, దాని దశల్ని వేగంగా గుర్తించే పద్ధతిని ముంబయి శాస్త్రవేత్తలు గుర్తించారు

శరీరంలోని కణజాలం నమూనాల్ని సేకరించాల్సిన అవసరం లేకుండానే.. క్యాన్సర్‌ను, దాని దశల్ని వేగంగా గుర్తించే పద్ధతిని ముంబయి శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సరికొత్త పరిజ్ఞానాన్ని యూఎం-డీఏఈ సీబీఎస్‌, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చి ఆవిష్కరించాయి. కణతి కణాలు ఒకదానికొకటి అతుక్కోవడాన్ని గుర్తించేందుకు లేజర్‌ పుంజాల్ని ఉపయోగించారు. ప్రస్తుతం సూది లేదా బయాప్సీ ద్వారా కణాలు, కణజాలాన్ని సేకరించి పరీక్షించడం ద్వారా క్యాన్సర్లను నిర్ధరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో పలు పరిమితులు ఉన్నట్లు పరిశోధకులు డాక్టర్‌ ఉమా లాడీవాలా పేర్కొన్నారు. తాజా అధ్యయనంలో సజీవ కణతి కణాన్ని గుర్తించేందుకు లేజర్‌ పుంజాన్ని ఉపయోగించి, మరో కణం చెంతకుచేర్చి పరిశీలించారు. సాధారణ కణాలు వేగంగా ఒకదానికొకటి అతుక్కుంటుండగా, అనారోగ్యకర కణాలు నెమ్మదిగా అతుక్కుంటున్నట్లు ప్రొఫెసర్‌ దీపక్‌ మాథుర్‌ పేర్కొన్నారు. ఈ అధ్యయనం ప్రాథమిక స్థాయిలో ఉందనీ, రోగుల నుంచి సేకరించే కణతి కణాలపై పరీక్షించి, సామర్థ్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని వివరించారు.

ఆధారము: ఈనాడు

పైకి వెళ్ళుటకు