హోమ్ / వార్తలు / రాష్ర్టానికి మరో 18వేల ఇళ్లు
పంచుకోండి

రాష్ర్టానికి మరో 18వేల ఇళ్లు

రాష్ర్టానికి మరో 18వేల ఇళ్లు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)లో రాష్ర్టానికి మరో 18వేల ఇళ్లు రానున్నాయి. 2016-17 సంవత్సరానికి ఇప్పటికే 55వేల ఇళ్లు కేటాయించిన కేంద్రం... అందులో 33% అదనంగా త్వరలోనే కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా సమాచారం పంపింది. ఈ మేరకు సుమారు రూ.130 కోట్ల మేరకు ప్రయోజనం కలుగుతుంది. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.72వేలు నేరుగా రాయితీలు ఇస్తుంది. ఇది కాకుండా ఉపాధి హామీ పథకం నిధుల రూపంలో మరో రూ.50వేలు లబ్ధిదారునికి వస్తాయి. ఈ పథకంలో చేపట్టే ఇంటి నిర్మాణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షలుగా నిర్ణయించింది. ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ, ఉపాధిహామీ నిధులతో కలిగే ప్రయోజనాన్ని మినహాయించి... మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసి ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు రాయితీలు చెల్లిస్తుంది.

ఆహరం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు