హోమ్ / వార్తలు / రూ.12,230 కోట్ల ఉపాధిహామీ నిధుల విడుదల
పంచుకోండి

రూ.12,230 కోట్ల ఉపాధిహామీ నిధుల విడుదల

రూ.12,230 కోట్ల ఉపాధిహామీ నిధుల విడుదల

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ.12,230 కోట్లను శనివారం విడుదల చేసింది. ఈ పథకానికి తగినన్ని నిధులు కేటాయించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసిన కొద్దిరోజుల్లోనే కేంద్రం ఈ మొత్తం విడుదల చేయడం గమనార్హం. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏకకాలంలో ఇంతమొత్తం కేటాయించడం ఇదే మొదటిసారని అందులో పేర్కొంది. ప్రతిష్ఠాత్మక కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి కేంద్ర వాటా మొత్తం చెల్లిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిధులతో గతేడాది పెండింగ్‌ వేతనాల సమస్య తీరడమే కాకుండా రాబోయే 2016-17 ఆర్థిక సంవత్సరానికీ ఉపయుక్తంగా ఉంటుందని అందులో వివరించారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు