హోమ్ / వార్తలు / రేపటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌
పంచుకోండి

రేపటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

రేపటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ 26వ తేదీ నుంచే ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈనెల 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 31వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన విద్యార్థులు ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని, ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి 3వ తేదీన రాత్రి 8 గంటల తర్వాత సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 243 ఎంబీఏ కాలేజీల్లో 28,174 సీట్లు, 36 ఎంసీఏ కాలేజీల్లో 2,336 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఆధారం : సాక్షి

పైకి వెళ్ళుటకు