హోమ్ / వార్తలు / రేపటి నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు
పంచుకోండి

రేపటి నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు

రేపటి నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలను ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహిస్తోంది. గ్రేటర్‌ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాల పరిధిలోని ఆటో మొబైల్‌ షోరూమ్‌లు, విద్యా సంస్థలతో కలిసి పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలపై రూపొందించిన లోగోను, పోస్టర్‌ను రెండు రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా విసృత్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఇందులో భాగానే ప్రతి ఆర్టీఏ కార్యాలయం పరిధిలో వారం రోజు పాటు వాహనదారులకు, నగర ప్రజలకు అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలను స్వచ్చంధ సంస్థలతో కలిసి చేపట్టనున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు