హోమ్ / వార్తలు / వంటగ్యాస్‌ ధర స్వల్పంగా పెంపు
పంచుకోండి

వంటగ్యాస్‌ ధర స్వల్పంగా పెంపు

వంటగ్యాస్‌ ధర స్వల్పంగా పెంపు

సబ్సిడీ వంటగ్యాస్‌ ధర స్వల్పంగా పెరిగింది. 14.2 కిలోగ్రాముల సిలిండర్‌ ధరను రూ.2 పెంచారు. దీంతో సబ్సిడీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.434.71 కి చేరింది. గత ఆరు నెలల్లో సబ్సిడీ వంట గ్యాస్‌ ధర పెంచడం వరసగా ఇది ఎనిమిదవసారి. మరోవైపు విమానాల్లో ఉపయోగించే ఇంధనం (ఏటీఎఫ్‌) ధర కూడా 8.6శాతం పెంచారు. పెరిగిన ధరతో కిలో లీటరు ఇంధనం ధర ఢిల్లీలో రూ.52,540.63 కి చేరింది. ఏటీఎఫ్‌ ధరను గత నెల 3.7శాతం తగ్గించగా, ఈసారి కాస్త ఎక్కువగానే పెంచారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు