హోమ్ / వార్తలు / వంద కోట్ల మందికి ఆధార్‌ జారీ చేసిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ)
పంచుకోండి

వంద కోట్ల మందికి ఆధార్‌ జారీ చేసిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ)

వంద కోట్ల మందికి ఆధార్‌ జారీ చేసిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ)

విశిష్ట గుర్తింపు సంఖ్య.. ఆధార్‌ చరిత్ర సృష్టించింది. సోమవారంతో దేశంలో వంద కోట్ల మంది ప్రజలు ఆధార్‌ సంఖ్యను పొందారు. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ).

తొలి ఆధార్‌ను 2010లో జారీ చేసింది. గడిచిన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఆధార్‌(ఆర్థిక మరియు ఇతర రాయితీలు, ప్రయోజనాలు, సేవల లక్షిత సరఫరా) చట్టానికి ఆమోదం లభించగా, కేంద్రం నోటిఫై చేసింది.

ఈ సందర్భంగా సోమవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇదొక చరిత్రాత్మక పరిణామమని అభివర్ణించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు అనుమతితో ఐదు ప్రభుత్వ సేవల్లో ఆధార్‌ను ప్రవేశపెట్టామని, మున్ముందు అన్ని ప్రభుత్వ సేవల్లోనూ ఆధార్‌ను జోడిస్తా మన్నారు. ప్రభుత్వ పథకాల్లో లీకేజీలను తొలగించి, అనర్హులను ఏరివేసేందుకు ఆధార్‌ సరైనదని తెలిపారు. యూపీఏ ప్రభుత్వమే దీన్ని ప్రవేశపెట్టినా సమర్థవంతంగా ఉపయోగిస్తోంది మాత్రం మోదీ ప్రభుత్వమేనని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు దక్కాయని, ప్రపంచ దేశాల్లో భారతకు సరికొత్త గుర్తింపు వచ్చిందన్నారు. కాగా, ఆధార్‌ సమాచారం దుర్వినియోగం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఆధార్‌ సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు