హోమ్ / వార్తలు / వచ్చేనెల 14 నుంచి మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు
పంచుకోండి

వచ్చేనెల 14 నుంచి మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు

వచ్చేనెల 14 నుంచి మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ హైదరాబాద్‌, గర్ల్స్‌ ఇన్‌ టెక్‌ ఇండియాలు సంయుక్తంగా వచ్చేనెల 14 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని హరితప్లాజాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో సదస్సును నిర్వహిస్తున్నాయి. నవంబర్‌ 2లోగా మహిళలు http://powertoolsbootcamp.blogspot.com వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. మూడు విభాగాల్లో వీరిని సదస్సుకు ఎంపికచేస్తారు. ఇప్పటికే పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టిన మహిళలు, ఉద్యోగం చేస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారు, విద్యార్థులుగా వీరిని విభజించారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు