హోమ్ / వార్తలు / విజ్ఞాన వర్సిటీలో ‘సృజనాంకుర 2017’
పంచుకోండి

విజ్ఞాన వర్సిటీలో ‘సృజనాంకుర 2017’

విజ్ఞాన వర్సిటీలో ‘సృజనాంకుర 2017’

రాష్ట్రంలో తొలిసారిగా విజ్ఞాన వర్శిటీ వేదికగా ఈనెల 26 నుంచి మూడు రోజుల పాటు ‘సృజనాంకుర 2017’ పేరుతో టెక్నికల్‌ సదస్సు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ రఘునందన తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద సాంకేతిక సమరానికి విజ్ఞాన వర్సిటీ వేదిక కానుందన్నారు. పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలు పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌, ఎంబెడెడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అంశాలతో పాటు సామాజిక దృక్కోణంలో భాగంగా పర్యావరణం, జీవశాస్త్రం, స్టార్టప్‌ ఆలోచనలకు ఊతమిచ్చేలా సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్కిల్‌ ఇండియా, మేకిన ఇండియా, డిజిటల్‌ ఇండియా నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి పది వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. మొత్తం 50 పైగా అంశాల్లో విద్యార్థినీ, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆనలైన రిజిస్ట్రేషన్ కోసం www.vignansrujanankura.com అనే వెబ్‌సైట్‌ను తమ విద్యార్థులు వినోద్‌, అఖిల్‌, భాను, రాఘవులు రూపొందించారని తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు