హోమ్ / వార్తలు / విత్తన ధ్రువీకరణ సంస్థకు ‘సేంద్రియ’ గుర్తింపు
పంచుకోండి

విత్తన ధ్రువీకరణ సంస్థకు ‘సేంద్రియ’ గుర్తింపు

విత్తన ధ్రువీకరణ సంస్థకు ‘సేంద్రియ’ గుర్తింపు

రాష్ట్రంలో సేంద్రియ ధ్రువీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ (టీఎ్‌సఎ్‌ససీఏ)ను ప్రాంతీయ మండలిగా గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల సేంద్రియ వ్యవసాయంచేసే ప్రాంతీయ రైతు సమూహాలకు ధ్రువీకరణ సంబంధిత సేవలతోపాటు కేంద్రంనుంచి నిధులూ అందుతాయి. ఇందుకోసం రైతులు, రైతు బృందాలు, ఉత్పత్తిదారులు తగిన రుసుముతో సంస్థవద్ద నమోదు చేసుకోవాలి. ఈ సంస్థ ధ్రువీకరణ ఏడాది చెల్లుబాటులో ఉంటుంది. ఇక రాజేంద్రనగర్‌లోని విత్తన ప్రయోగశాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని సోమవారం నాటి టీఎ్‌సఎ్‌ససీఏ బోర్డు సమావేశం తీర్మానించింది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు