హోమ్ / వార్తలు / విదేశీ పెట్టుబడిదారులకు పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ మంజూరుకు మంత్రి మండలి ఆమోదం
పంచుకోండి

విదేశీ పెట్టుబడిదారులకు పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ మంజూరుకు మంత్రి మండలి ఆమోదం

విదేశీ పెట్టుబడిదారులకు పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ మంజూరుకు మంత్రి మండలి ఆమోదం

విదేశీ పెట్టుబడిదారులకు పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ (పి ఆర్ ఎస్) మంజూరు చేసే పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రభుత్వం కాలానుగుణంగా నోటిఫై చేసే ఎఫ్ డి ఐ విధానంలో నిర్దేశించిన షరతులకు లోబడి ఈ పథకం అమలవుతుంది.

ఈ పథకం భారత దేశంలోకి తరలివచ్చే విదేశీ పెట్టబడులను ప్రోత్సహించడంతోపాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా విదేశీ పెట్టుబడిదారులకు పి ఆర్ ఎస్ మంజూరుకు వీలుగా వీసా మాన్యువల్ లో తగిన నిబంధనలను చేర్చనున్నారు.

పలుమార్లు ప్రవేశించడానికి వీలు వుండేటట్లు 10 సంవత్సరాల కాలానికి పి ఆర్ ఎస్ ను మంజూరు చేస్తారు. పి ఆర్ ఎస్ కలిగివున్న వ్యక్తికి సంబంధించి ఎటువంటి ప్రతికూలత ఎదురవని పక్షంలో మరొక 10 సంవత్సరాలపాటు దీనిని సమీక్షించేందుకు అవకాశం ఉంది. నిర్ణీత అర్హత నిబంధనలను పూర్తిచేసిన విదేశీ పెట్టుబడిదారులు, అతని/ఆమె దాంపత్య భాగస్వామి మరియు ఆశ్రితులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి విదేశీ పెట్టుబడిదారు 18 మాసాల వ్యవధి లోపల కనీసం 10 కోట్ల రూపాయలు గాని, 36 మాసాల వ్యవధి లోపల 25 కోట్ల రూపాయలు గాని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ విదేశీ పెట్టుబడి ప్రతి ఆర్థిక సంవత్సరంలోను కనీసం 20 మంది స్థానిక భారతీయులకు ఉపాధిని కల్పించవలసి ఉంటుంది.

పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ ను బహుళ ప్రవేశ సౌకర్యంతో మొదట్లో 10 సంవత్సరాలకు మంజూరు చేస్తారు. దీనిని ఆ తరువాత మరొక 10 సంవత్సరాలకు తిరిగి నవీకరించుకొనేందుకు వీలుంటుంది. దేశంలో ఉండడానికి ఎటువంటి ఒప్పందపు నిబంధనతో ముడి పెట్టని బహుళ ప్రవేశార్హ వీసాగా పి ఆర్ ఎస్ పనికి వస్తుంది. పి ఆర్ ఎస్ కలిగివున్నవారు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోనక్కర లేకుండా మినహాయింపు లభిస్తుంది. వారు దేశంలో నివసించేందుకు ఒక గృహం కొనుగోలు చేసేందుకు అనుమతిస్తారు. పి ఆర్ ఎస్ కలిగివున్న వ్యక్తి యొక్క దాంపత్య భాగస్వామి/ ఆశ్రితులు భారత దేశంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేయడానికీ (ఎంప్లాయిమెంట్ వీసాకు సంబంధించిన జీతం నిబంధనల సడలింపు వర్తించేటట్లుగా), చదువుకోవడానికీ అనుమతి ఇస్తారు.
ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు