హోమ్ / వార్తలు / విద్యుత్ పొదుపులో భాగంగా ఎస్సీ , ఎస్టీలకు రెండు ఎల్‌ఈడీ బల్బులు
పంచుకోండి

విద్యుత్ పొదుపులో భాగంగా ఎస్సీ , ఎస్టీలకు రెండు ఎల్‌ఈడీ బల్బులు

విద్యుత్ పొదుపులో భాగంగా ఎస్సీ , ఎస్టీలకు రెండు ఎల్‌ఈడీ బల్బులు

విద్యుత్ పొదుపులో భాగంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగ దారులకు అదనంగా మరో రెండు ఎల్‌ఈడీ బల్బులను మంగళ వారం నుంచి పంపిణీ చేసేం దుకు అధికారులు సిద్ధమయ్యా రు. చిలకలూరిపేటలో జరిగిన జన్మ భూమి - మాఊరు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ఎస్సీ, ఎస్టీ విద్యుత్ విని యోగదారులకు బల్బుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే ప్రతి గృహ విద్యుత్ కనెక్షనుకు రెండు ఎల్‌ ఈడి బల్బులు ఇచ్చిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు అదనం గా మరో రెండు ఇవ్వాలని సంకల్పించింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి జన్మ భూమి కార్యక్రమాల్లో పంపిణీ చేయనున్నట్లు ఎస్‌ఈ బి.జయభారతరావు తెలిపారు. విద్యుత్ బల్బుల పంపిణీకి స్థానిక విద్యుత్ సెక్షన కార్యా లయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రం నకలు, విద్యుత్ బిల్లు నకలు, ఆధార్‌ నకలు, ఫోన నెంబరు అందజేసి ఉచి తంగా రెండు బల్బులు పొందాలని సూచిం చారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ వినియోగదారునిగా సర్వీసు నెంబరు గుర్తించిన వారికే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈనెలఖరు వరకు గుర్తించిన అన్ని సర్వీసులకు బల్బులు అందజేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు