హోమ్ / వార్తలు / వినూత్న ఆవిష్కరణలకు 15 లక్షల రివార్డు!
పంచుకోండి

వినూత్న ఆవిష్కరణలకు 15 లక్షల రివార్డు!

వినూత్న ఆవిష్కరణలకు 15 లక్షల రివార్డు!

వైద్య రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేసే విద్యార్థులకు రూ.15 లక్షల రివార్డును బిరాక్‌(బయో టెక్నాలజీ ఇండసీ్ట్ర రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌) అందించనుంది. తక్కువ ఖర్చుతో మెడిసిన్‌, బయోటెక్నాలజీలో వైద్య సమస్యలకు నూతన ఆవిష్కరణలు చేసేందుకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల విద్యార్థులు www.gyti.techpedia.in వెబ్‌సైట్‌ ద్వారా డిసెంబరు 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. స్కూల్‌ స్థాయి నుంచి వైద్య విద్యార్థుల వరకు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిరాక్‌, ఎస్‌ఆర్‌ఐఎ్‌సటీఐ (సొసైటీ ఫర్‌ రీసెర్చ్‌్క్షఇన్నోవేషన్స్‌ ఇన్‌ ఫీల్డ్‌ ఆఫ్‌ మెడిసిన్‌)లు సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. 15 అత్యుత్తమ ఆవిష్కరణలకు ఈ రివార్డును 2017, మార్చిలో జరిగే ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్స్‌’ కార్యక్రమంలో అందజేస్తామని ఎస్‌ఆర్‌ఐఎస్‌టీఐ అధ్యక్షుడు అనిల్‌ కె గుప్తా తెలిపారు. దీంతో పాటు, 100 మంది విద్యార్థులకు రూ.లక్ష చొప్పున నగదును బహూకరిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ విధానాలు, పరికరాలు, మందులు, వేక్సిన్‌లు రూపొందించాలని బిరాక్‌ ఎండీ డా.రేణు స్వరూప్‌ చెప్పారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు