హోమ్ / వార్తలు / వేతనాలు 12-25 శాతం పెరిగే అవకాశం
పంచుకోండి

వేతనాలు 12-25 శాతం పెరిగే అవకాశం

వేతనాలు 12-25 శాతం పెరిగే అవకాశం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ), ఇ కామర్స్‌ రంగాల్లో ఉద్యోగులకు వేతన పెంపు సగటు 10-12 శాతం ఉంటుందని, అధిక నైపుణ్యం కలిగిన వారికి మాత్రం ఈ పెరుగుదల 25 శాతం ఉంటుందని మానవ వనరుల నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యధిక నైపుణ్యాలు కలిగి, అత్యుత్తమ పనితీరు కనబర్చే వారికి వేతనం 20-25 శాతం పెరిగే అవకాశం ఉదని కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చెబుతోంది. సగటు వేతనాల పెంపు 11 శాతంగా ఉంటుందని, ఐటీ రంగంలో 13.50 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ ఏడాది వేతన పెంపు సగటు 10-12 శాతం ఉంటుందని ఎగ్జిక్యూటివ్‌ సెర్చ్‌ సంస్థ గ్లోబల్‌హంట్‌ అభిప్రాయపడుతోంది.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు