హోమ్ / వార్తలు / శాటిలైట్‌ ద్వారా పంటల బీమా పథకం, శాటిలైట్‌ ద్వారా నష్టం అంచనా
పంచుకోండి

శాటిలైట్‌ ద్వారా పంటల బీమా పథకం, శాటిలైట్‌ ద్వారా నష్టం అంచనా

శాటిలైట్‌ ద్వారా పంటల బీమా పథకం, శాటిలైట్‌ ద్వారా నష్టం అంచనా

వరిలో పంటల బీమాపై ఫిలిఫైన్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రెండు వారాల కిందట వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌, రంగా విశ్వవిద్యాలయం అం తర్జాతీయ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రభుప్రసాదిని, ప్లానింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఈదర నారాయణ, పరిశోధనల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌వీ నాయుడు, మనిల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎం.మోరెల్‌లు ఒప్పందాలు చేసుకున్నారు.
శాటిలైట్‌ ద్వారా నష్టం అంచనా
రాష్ట్రంలో వరి పంటను స్విస్‌ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధా నం చేసి శాటిలైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తా రు. శాటిలైట్‌ రెండు వారాలకు ఒకసారి వరి పంటకు సంబంధించిన ఫొటోలను పంపుతుంది. ఈ ఫొటోలు, వీడియోలను భద్రపరుస్తారు. వరదలు, తుపాన్‌లు, కరువు, అకాల వర్షాలు వచ్చిన సమయంలో తాజాగా శాటిలైట్‌లో నమోదైన చిత్రాలు, వీడియోలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ దశలో పంట నష్టం శాతాన్ని నిర్థారిస్తారు. దీని ఆధారంగా బీమా కంపెనీలు ఎంత పరిహారం చెల్లించాలనే అంశాన్ని నిర్ణయిస్తారు. ఈ విధంగా వరిలో పంటల బీమా పథకం ద్వారా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు