హోమ్ / వార్తలు / సమీప భవిష్యత్తులో దేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి సాంప్ర‌దాయ ఆర్థిక సేవ‌లు - ఆర్ బి ఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్‌
పంచుకోండి

సమీప భవిష్యత్తులో దేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి సాంప్ర‌దాయ ఆర్థిక సేవ‌లు - ఆర్ బి ఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్‌

సమీప భవిష్యత్తులో దేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి సాంప్ర‌దాయ ఆర్థిక సేవ‌లు - ఆర్ బి ఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్‌

స‌మీప భ‌విష్య‌త్తులో భార‌త దేశంలో ప్ర‌తి ఒక్క‌రికి సాంప్ర‌దాయ‌క ఆర్థిక సేవ‌ల‌ను అందించ‌గ‌ల‌మ‌ని రిజ‌ర్వు బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ జి రాజ‌న్ అన్నారు.  మ‌న దేశం నిల‌క‌డ‌గా పురోగ‌మించ‌డానికి అవ‌స‌ర‌మైన, అంద‌రికీ "ఆర్థిక సేవ‌ల" (ఫైనాన్షియ‌ల్ ఇన్ క్లూజ‌న్‌) అంద‌జేతే ముఖ్య‌మైన అంశ‌మ‌ని ఆయ‌న చెప్పారు.  సోమవారం నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌త్ రాజ్‌ ఆధ్వ‌ర్యంలో ఈక్విటీ, యాక్సెస్ అండ్ ఇన్ క్లూజ‌న్ అంశాల‌పై ఏర్పాటైన జాతీయ సదస్సులో శ్రీ రాజ‌న్ మాట్లాడుతూ...  ఫైనాన్షియ‌ల్ ఇన్ క్లూజ‌న్ అనేది నైతికంగాను,ఆర్థిక సామ‌ర్థ్యం పై ఆధార‌ప‌డిన‌ది గాను ఇలా రెండు రూపాల్లోనూ ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి అని తెలిపారు.  ఇక్క‌డ చేరిన మ‌నంద‌రికీ అందుబాటులో ఉన్న సేవ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రికి మ‌నం అందించ‌కూడ‌దా?  అని ఆయ‌న స‌భికుల‌ను అడిగారు.  ప్ర‌తి ఒక్క‌రికి వారిని మ‌రింత మెరుగుప‌ర‌చుకోగ‌లిగే సాధ‌నాలు, వ‌న‌రులు వారి వ‌ద్ద ఉన్న‌ట్ల‌యితే అది ఉత్పాద‌న‌ను, వృద్ధిని మ‌రియు ఆర్థిక స‌మృద్ధిని ఇనుమ‌డింప‌జేస్తుంది అని శ్రీ రాజ‌న్ అన్నారు.

ఆధారం :పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు