హోమ్ / వార్తలు / సర్వ శిక్ష అభియాన్‌కు స్కోచ్‌ పురస్కారం
పంచుకోండి

సర్వ శిక్ష అభియాన్‌కు స్కోచ్‌ పురస్కారం

సర్వ శిక్ష అభియాన్‌కు స్కోచ్‌ పురస్కారం

తెలంగాణ సర్వ శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లోని ఛైల్డ్‌ ఇన్ఫో ప్రాజెక్టుకు స్కోచ్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌ పురస్కారం-2016 దక్కింది. దేశంలోని వంద ఉత్తమ ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి సమగ్ర సమాచారాన్ని సేకరించి తెలంగాణ సర్వ శిక్ష అభియాన్‌ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తోంది. దీన్ని ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేశారు. విద్యార్థుల పర్యవేక్షణకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఆ ప్రాజెక్టే స్కోచ్‌ పురస్కారానికి ఎంపికైంది. సెప్టెంబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే సదస్సులో ఈ అవార్డును విద్యాశాఖ అధికారులు అందుకోనున్నారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు