హోమ్ / వార్తలు / సెప్టెంబరు 12 నుంచి సింగరేణి ఆస్పత్రుల్లో.. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు
పంచుకోండి

సెప్టెంబరు 12 నుంచి సింగరేణి ఆస్పత్రుల్లో.. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు

సెప్టెంబరు 12 నుంచి సింగరేణి ఆస్పత్రుల్లో.. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు

 

మీకోసం-మీ ఆరోగ్యం కోసం’ కార్యక్రమంలో భాగంగా... సెప్టెంబరు 12 నుంచి 16 దాకా 9 సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్య పరీక్షలు, సేవలందిస్తారు. హైదరాబాద్‌లోని 10 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులకు చెందిన సుమారు 50 మంది వైద్య నిపుణులు, వారి సిబ్బంది సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో సేవలందిస్తారని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. ప్రధానంగా మూత్రపిండాలు, గుండె, నరాలు, కంటిజబ్బులకు సంబంధించిన విభాగాల్లో సేవలందిస్తారని సీఎండీ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, భూపలపల్లి, గోదావరిఖని, 8 ఇంక్లైన్‌ కాలనీ డిస్పెన్సరీ, శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌, బెల్లంపల్లిల్లోని ఏరియా ఆస్పత్రుల్లో జరుగుతాయి. వీటిలో వైద్యసేవలు పొందాలనుకునే కార్మికులు 6 నుంచి పదో తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

ఆధారం: ఈనాడు

 

పైకి వెళ్ళుటకు