హోమ్ / వార్తలు / సౌర కుటుంబం వెలుపల ‘తొమ్మిదో గ్రహం’!
పంచుకోండి

సౌర కుటుంబం వెలుపల ‘తొమ్మిదో గ్రహం’!

సౌర కుటుంబం వెలుపల ‘తొమ్మిదో గ్రహం’!

సౌర కుటుంబానికి అవతల ‘తొమ్మిదో గ్రహం (ప్లానెట్‌-9)’ తిరుగుతూ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనావేశారు. దాని వ్యాసార్ధం భూమి కంటే 3.7 రెట్లు ఎక్కువని, ఉపరితల ఉష్ణోగత్ర మైనస్‌ 226 డిగ్రీలని వారు లెక్కకట్టారు. అసలు తొమ్మిదో గ్రహమనేది వాస్తవంగా ఉంటే.. దాని పరిమాణం ఎంత? దానిపై ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? ఎలాంటి దూరదర్శిని సాయంతో దాన్ని చూడగలం? తదితర ప్రశ్నల గుట్టువిప్పేందుకు స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌ వర్సిటీ పరిశోధకులు ప్రస్తుత అధ్యయనం నిర్వహించారు. గ్రహ పరిణామక్రమం వివరాలను తెలుసుకోవడంలో స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు నిపుణులు. దీంతో ప్రస్తుత గ్రహ పరిణామానికి సంబంధించి వారు ఓ నమూనాను సిద్ధంచేశారు. దాని ప్రకారం.. భూమి సూర్యుల మధ్య దూరానికి 700 రెట్లు దూరంలో తొమ్మిదో గ్రహం తిరుగుతూ ఉండొచ్చని పరిశోధకుల్లో ఒకరైన ఎస్తేర్‌ లిండెర్‌ తెలిపారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు