హోమ్ / వార్తలు / స్టాఫ్‌ సెలెక్షన్‌ ద్వారా 5134 పోస్టులకు నోటిఫికేషన్‌
పంచుకోండి

స్టాఫ్‌ సెలెక్షన్‌ ద్వారా 5134 పోస్టులకు నోటిఫికేషన్‌

స్టాఫ్‌ సెలెక్షన్‌ ద్వారా 5134 పోస్టులకు నోటిఫికేషన్‌

వివిధ విభాగాల్లో ఉన్న 5134 పోస్టుల భర్తీకోసం భారీ నోటిఫికేషన విడుదల చేసింది. పోస్టల్‌ అసిస్టెంట్స్‌/ సోర్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 3281, ఎల్‌డిసి పోస్టులు 1321, డిఇఒ పోస్టులు 506 కాగా కోర్టు క్లర్క్‌ 26 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. 2017 జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ దరఖాస్తుకు అర్హులు.

ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కంప్యూటర్‌ బేస్డ్‌ రిటెన ఎగ్జామినేషన, డిస్ర్కిప్టివ్‌ పేపర్‌, టైపింగ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. నవంబరు 7 లోపు అభ్యర్థులు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌, ఏప్రిల్‌ 9న డిస్ర్కిప్టివ్‌ పేపర్‌ ఎగ్జామ్‌ జరుగుతాయి. పూర్తి వివరాల కోసం www.ssconline.nic.in వెబ్‌సైట్‌ చూడవచ్చు.

పైకి వెళ్ళుటకు