హోమ్ / వార్తలు / స్టాఫ్సెలక్షన్ కమిషన్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (టైర్- 1) పరీక్షల షెడ్యూల్ లో మార్పు లేదు ఈ పరీక్షలు సెప్టెంబర్ 11, 2016 వరకు జరుగుతాయి
పంచుకోండి

స్టాఫ్సెలక్షన్ కమిషన్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (టైర్- 1) పరీక్షల షెడ్యూల్ లో మార్పు లేదు ఈ పరీక్షలు సెప్టెంబర్ 11, 2016 వరకు జరుగుతాయి

స్టాఫ్సెలక్షన్ కమిషన్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (టైర్- 1) పరీక్షల షెడ్యూల్ లో మార్పు లేదు ఈ పరీక్షలు సెప్టెంబర్ 11, 2016 వరకు జరుగుతాయి

స్టాఫ్సెలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించిన విధంగా కంప్యూటర్ ఆధారితమైన కంబైండ్ గ్రాడ్యుయేట్లెవెల్ (టైర్-1)పరీక్షలు, 2016 ను నిర్వహించనుంది. ఈ పరీక్షలు కిందటినెల (ఆగస్టు) 27వ తేదీ నుండి ఈ నెల సెప్టెంబరు 11వ తేదీ వరకు జరపనున్నట్లు స్టాఫ్సెలక్షన్ కమిషన్ ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు కురిసేఅవకాశముందని భారత వాతావరణ అధ్యయన విభాగం (ఐఎండి) అంచనా వేసినందువల్ల,కేంద్ర కార్మిక సంఘాలు వాటి డిమాండ్లసాధన కోసం సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నందువల్ల తలెత్తినపరిస్థితులను కమిషన్ పరిగణన లోకి తీసుకొంది. ఈ పరీక్షలను నిర్వహించే సమయంలో గాని, రిపోర్టింగ్ టైం లో గాని, పరీక్షాకేంద్రాల్లోకి  ప్రవేశించేందుకునిర్ణయించిన తుది సమయంలో గాని  ఎటువంటిమార్పు లేదని కమిషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 2వ తేదీన మొత్తం 32 చోట్ల(తెలంగాణ లో 13 కేంద్రాలు, ఆంధ్ర ప్రదేశ్ లో 19 కేంద్రాలు ఏర్పాటయ్యాయి) పరీక్షలనుముందుగా నిర్ణయించిన మేరకు మూడు బ్యాచ్ లుగా నిర్వహించనున్నారు. బ్యాచ్ ల వారీగాపరీక్షా సమయాలను.. ఒకటవ బ్యాచ్ కు ఉదయం 10 గంటల నుండి 11.15 నిమిషాల వరకు,రెండవబ్యాచ్ కు మధ్యాహ్నం 1.15 నిమిషాలనుండి 2.30 నిమిషాల వరకు, మూడవ బ్యాచ్ కు సాయంత్రం4.15 నిమిషాల నుండి సాయంత్రం 5.30 వరకు.. నిర్దేశించారు. ఆయా పరీక్షాకేంద్రాలకు సకాలంలో చేరుకోవల్సిందిగా అభ్యర్థులందరికీ సూచించడమైంది. మరిన్నివివరాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దక్షిణ ప్రాంత కార్యాలయంలో ఏర్పాటు చేసినహెల్ప్ లైన్ నంబర్లు 044- 2825 1139 (ల్యాండ్ లైన్)కు, లేదా 9445 1959 46 (మొబైల్)కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని ప్రకటనలో వివరించారు.

ఆధారం: పత్రికా సమాచారకార్యాలయము

పైకి వెళ్ళుటకు