హోమ్ / వార్తలు / స్వామి శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి నివాళులు
పంచుకోండి

స్వామి శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి నివాళులు

స్వామి శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి నివాళులు

సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

"ఆదరణీయ స్వామి శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన ఉత్తమమైన ఆలోచనలు, బోధనలు మరియు అన్యాయం పై ఆయన సాధించిన పోరాటం ఎప్పటికీ ప్రేరణను ఇచ్చేవే" అని ప్రధాన మంత్రి అన్నారు.

కేరళకు చెందిన సంఘ సంస్కర్త అయిన శ్రీ నారాయణ గురు కుల తత్వానికి వ్యతిరేకంగా ఒక సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక స్వాతంత్య్రానికి మరియు సాంఘిక సమానత్వానికి సంబంధించిన నూతన విలువలను కూడా ఆయన పెంపొందించారు.

ఆధారం : పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు