హోమ్ / వార్తలు / హైదరాబాద్ జిల్లాలో జూన్‌ 2, 21 తేదీల్లో ఆరోగ్యశ్రీ శిబిరాలు
పంచుకోండి

హైదరాబాద్ జిల్లాలో జూన్‌ 2, 21 తేదీల్లో ఆరోగ్యశ్రీ శిబిరాలు

హైదరాబాద్ జిల్లాలో జూన్‌ 2, 21 తేదీల్లో ఆరోగ్యశ్రీ శిబిరాలు

 

హైదరాబాద్ జిల్లాలో జూన్‌ 2, మరియు 21 తేదీల్లో ఆరోగ్యశ్రీ శిబిరాలు నిర్వ   హించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్‌ 2న సైదాబాద్‌ మండలం ఓల్డ్‌ మలక్‌పేటలోని పద్మానగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేయనున్న వైద్య శిబిరంలో గాంధీ, ప్రభుత్వ ఈఎన్‌టీ, నియో బీబీసీ చిల్డ్రన్‌ హాస్పిటల్‌, పుష్పగిరి ఐ ఆస్పత్రి, నాంపల్లి కేర్‌ ఆస్పత్రుల వైద్యులు, అసిఫ్‌నగర్‌ మండలం జియాగూడ డా.బీఆర్‌ అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ నందు సురక్షా పిల్లల ఆస్పత్రి, ఇండో యూఎస్‌, మెడివిజన్‌ ఐ ఆస్పత్రి, ఉస్మా నియా కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రుల వైద్య నిపుణులు పాల్గొంటారన్నారు.
జూన్‌ 21న ముషీరాబాద్‌ మండలం లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ బండమైసమ్మ నగర్‌లోని కమ్యూనిటీహాల్‌ నందు నిర్వహించే ఆరోగ్య శిబిరానికి హైదరాబాద్‌ నర్సింగ్‌హోమ్‌, సికింద్రాబాద్‌ యశోద, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వచెస్ట్‌ ఆసుపత్రి వైద్య నిపుణులు పాల్గొని వైద్యచికిత్సలు అందచేస్తారని తెలిపారు.

హైదరాబాద్ జిల్లాలో జూన్‌ 2, మరియు 21 తేదీల్లో ఆరోగ్యశ్రీ శిబిరాలు నిర్వ   హించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ఒక ప్రకటనలో తెలిపారు.జూన్‌ 2న సైదాబాద్‌ మండలం ఓల్డ్‌ మలక్‌పేటలోని పద్మానగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేయనున్న వైద్య శిబిరంలో గాంధీ, ప్రభుత్వ ఈఎన్‌టీ, నియో బీబీసీ చిల్డ్రన్‌ హాస్పిటల్‌, పుష్పగిరి ఐ ఆస్పత్రి, నాంపల్లి కేర్‌ ఆస్పత్రుల వైద్యులు, అసిఫ్‌నగర్‌ మండలం జియాగూడ డా.బీఆర్‌ అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ నందు సురక్షా పిల్లల ఆస్పత్రి, ఇండో యూఎస్‌, మెడివిజన్‌ ఐ ఆస్పత్రి, ఉస్మా నియా కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రుల వైద్య నిపుణులు పాల్గొంటారన్నారు. జూన్‌ 21న ముషీరాబాద్‌ మండలం లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ బండమైసమ్మ నగర్‌లోని కమ్యూనిటీహాల్‌ నందు నిర్వహించే ఆరోగ్య శిబిరానికి హైదరాబాద్‌ నర్సింగ్‌హోమ్‌, సికింద్రాబాద్‌ యశోద, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వచెస్ట్‌ ఆసుపత్రి వైద్య నిపుణులు పాల్గొని వైద్యచికిత్సలు అందచేస్తారని తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

 

పైకి వెళ్ళుటకు