హోమ్ / వార్తలు / హైదరాబాద్ లో 2017 ఫిబ్రవరి 13, 14 తేదీలలో ‘ఇండియాసాఫ్ట్ ఐటిఎగ్జిబిషన్’ 17వ సంచిక
పంచుకోండి

హైదరాబాద్ లో 2017 ఫిబ్రవరి 13, 14 తేదీలలో ‘ఇండియాసాఫ్ట్ ఐటిఎగ్జిబిషన్’ 17వ సంచిక

హైదరాబాద్ లో 2017 ఫిబ్రవరి 13, 14 తేదీలలో ‘ఇండియాసాఫ్ట్ ఐటిఎగ్జిబిషన్’ 17వ సంచిక

‘ఇండియాసాఫ్ట్ ఐటిఎగ్జిబిషన్’17వ సంచిక పేరిట ప్రత్యేక గ్లోబల్ నెట్ వర్కింగ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో 2017 ఫిబ్రవరి 13, 14 తేదీలలోనిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సమాచారసాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్ విభాగం (ఐటిఇ & సి) కార్యదర్శిశ్రీ జయేశ్ రంజన్ నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ, టి- హబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసార మాధ్యమాలప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఐటి కంపెనీలకుభారతదేశం అగ్రగామి గమ్యస్థానంగా ఉందన్నారు. భారతదేశం అపరిమిత అవకాశాలున్న దేశం అనిఆయన చెప్పారు. హైదరాబాద్ ఇండియాసాఫ్ట్ ఐటి ఎగ్జిబిషన్, 2017కు హెచ్ఐసిసి లోఆతిథేయిగా వ్యవహరించనుండడం ఇప్పటికి ఇది నాలుగోసారి అని ఆయన తెలిపారు.  ఈ ప్రదర్శన ఐటి కంపెనీలు వాటి మార్కెట్స్థితిగతులను పటిష్టపరచుకోవడానికి అనువైన వ్యాపార సంబంధిత నూతన సహకారాలను, జాయింట్ వెంచర్లను,వ్యూహాత్మకకూటములను ఏర్పరచుకోవడానికి ఒక ప్రత్యేక వేదిక అవుతుందని కూడా ఆయన వివరించారు.ప్రపంచం నలు మూలల నుంచి 75 దేశాలకు చెందిన 500 అంతర్జాతీయ కొనుగోలుదారు సంస్థలు, 250 భారతీయఎగుమతిదారు సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయని వెల్లడించారు. వివిధ దేశాలకుచెందిన సభ్యులతో కూడిన ఒక అంతర్జాతీయ పరిశోధక బృందం కూడా ఈ కార్యక్రమంలోపాల్గొననుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలో ఐటీ ఉత్పత్తుల విధానానికిరూపకల్పన చేయనుందని శ్రీ జయేశ్ రంజన్ తెలిపారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు