অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పోల్

పోల్

జీఎస్టీలో నమోదు (Registration) చేసుకుంటే ప్రయోజనమేమిటి?

వస్తుసేవల పన్ను (GST) వ్యవస్థలో నమోదువల్ల వ్యాపారానికి కిందివిధమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

  • వస్తువుల సరఫరాదారు లేదా సేవల ప్రదాతగా చట్టబద్దమైన గుర్తింపు లభిస్తుంది.
  • ఉత్పాదక వస్తుసేవల మీద చెల్లించిన పన్నుకు సరైన లెక్కలుంటాయి. ఈ పన్నును వ్యాపారంద్వారా సరఫరా చేసే వస్తువులు, సేవలు లేదా రెండింటిపైనా విధించే జీఎస్టీ చెల్లింపు కోసం వినియోగించుకో వచ్చు.
  • వస్తుసేవల కొనుగోలుదారులు లేదా స్వీకర్తల నుంచి చట్టబద్దంగా పన్ను వసూలు చేయడంతోపాటు వాటిపై వారు చెల్లించిన పన్నుల జమను తిరిగి వారికి సంక్రమింపజేయవచ్చు.
  • జీఎస్టీ చట్టాలకింద అందుకోగల అన్ని హక్కులు, వివిధ ప్రయోజనాలు పొందే అర్హత లభిస్తుంది.

జీఎస్టీలో నమోదు కాని వ్యక్తి ఉత్పాదక పన్ను జమ (ITC) కోరడం, పన్ను వసూలు చేయడం సాధ్యమా?

సాధ్యం కాదు. జీఎస్టీలో నమోదుకాని వ్యక్తి తన ఖాతాదారులనుంచి పన్ను వసూలుకు అనర్హుడు. అలాగే తాను చెల్లించిన ఐటీసీని తిరిగి కోరడం అసాధ్యం.

ఏ తేదీనుంచి నమోదు అమలులోకి వస్తుంది?

నమోదు చేసుకోవాల్సిన బాధ్యత వర్తించే తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకున్నట్లయితే నమోదు బాధ్యత వర్తించే తేదీనుంచే అది అమలులోకి వచ్చినట్లు పరిగణిస్తారు; నమోదు బాధ్యత వర్తించే తేదీనుంచి 30 రోజుల తర్వాత దరఖాస్తు సమర్పిస్తే, నమోదు మంజూరు తేదీనుంచి అది అమలులోకి వస్తుంది; పన్ను చెల్లింపు పరిమితి మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ స్వచ్చందంగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి నమోదు చేసుకోవాలన్న ఆదేశాలు జారీ అయిన నాటినుంచే అమలులోకి వస్తుంది.

జీఎస్టీ నమూనా చట్టం కింద నమోదు చేసుకోవాల్సిన బాధ్యతగల వ్యక్తులెవరు?

సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టం-2017లోని సెకన్ 22 ప్రకారం... ఒక ఆర్థిక సంవత్సరంలో నమోదుకు నిర్దేశించిన రూ.20 లక్షల సగటు వ్యాపార పరిమాణ పరిమితి దాటినవారు, ఈ చట్టంకింద పన్నువిధించదగిన వస్తువులు లేదా సేవల సరఫరాదారు (అతడి ప్రతినిధిసహా)లైన ప్రతి ఒక్కరిపైనా ఆయా రాష్ట్ర, లేదా కేంద్రపాలిత ప్రాంత పరిధిలో స్వయంగా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది;

దేశంలోని 11 ప్రత్యేక హోదాగల రాష్ట్రాల విషయానికొస్తే (భారత రాజ్యాంగంలోని అధికరణం 279ఎ(4)(జి)లో పేర్కొన్న విధంగా) నమోదు బాధ్యత వ్యాపార పరిమాణం పరిమితి రూ.10 లక్షలు మాత్రమే;దీంతోపాటు చట్టంలోని సెక్షన్ 24 పేర్కొంటున్న ప్రకారం వ్యాపార పరిమాణ పరిమితి రూ.2O లక్షలు దాటకపోయినా కొన్ని వర్గాల సరఫరాదారులు తప్పక నమోదు చేసుకోవాల్సి ఉంటుంది;

మరోవైపు సెకన్ 23 ప్రకారం వ్యవసాయోత్పత్తులు సరఫరా చేసే వ్యవసాయదారులు; జీఎస్టీ చట్టం కింద పన్ను విధించదగని లేదా పూర్తిగా పన్ను మినహాయించిన ప్రత్యేక జాబితాలోని వస్తుసేవలను మాత్రమే సరఫరా చేసే వ్యక్తులకు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత లేదు.

సగటు వ్యాపార పరిమాణం అంటే ఏది?

సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 2 (6) ప్రకారం "సగటు వ్యాపార పరిమాణం"లో కింది సగటు విలువలు ఇమిడి ఉంటాయి:-

ఒకే శాశ్వత ఖాతా సంఖ్య (PAN)గల వ్యక్తి చేసిన...

  1. పన్ను విధించదగిన అన్ని సరఫరాలు;
  2. మినహాయింపుగల అన్ని సరఫరాలు;
  3. ఎగుమతి చేసిన వస్తుసేవలు;
  4. అన్నిరకాలైన అంతర్రాష్ట్ర సరఫరాలు;

పైన పేర్కొన్న వాటన్నిటినీ అఖిలభారత ప్రాతిపదికన లెక్కించాలి. అందులోనుంచి సీజీఎస్టీ, ఎస్టీఎస్టీ, యూటీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాలకింద వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని తీసివేయాలి. పన్ను విధించదగిన వ్యక్తి స్వయంగాగానీ, తన ప్రతినిధులుద్వారాగానీ చేసిన అన్ని సరఫరాలూ సగటు వ్యాపార పరిమాణంలో భాగంగా ఉంటాయి; ఎదురు చెల్లింపు పద్ధతిలో సరఫరాలు చేసి ఉన్నా, స్వీకరించి ఉన్నా వాటి విలువ సగటు వ్యాపార పరిమాణంలో చేరదు; చిన్నచిన్న పనులు చేసేవారు తమ పని పూర్తిచేశాక దానికి సమకూడే విలువ ఆ పనివారి వ్యాపార పరిమాణంలో చేర్చదగినది కాదు. సదరు వస్తువు లేదా సేవనందించే ప్రధాన సరఫరాదారు చేసిన సరఫరాగానే దాన్ని పరిగణించి తదనుగుణంగా వారి వ్యాపార పరిమాణంలో చేర్చాలి.

నమోదు తప్పనిసరి అయ్యే పరిస్థితులేవి?

సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 24 పేర్కొంటున్న ప్రకారం దిగువ తెలిపిన వర్గాల వ్యక్తులు కనీస పరిమితితో నిమిత్తం లేకుండా తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది:-

  1. పన్ను విధించదగిన అంతర్రాష్ట్ర సరఫరాలు చేసే వ్యక్తులు;
  2. సాధారణంగా పన్ను విధించదగిన వ్యక్తులు;
  3. ఎదురు చెల్లింపు పద్దతిలో పన్ను చెల్లించాల్సిన వ్యక్తులు;
  4. చట్టంలోని సెకన్ 9, ఉప సెకన్ (5) కింద పన్ను చెల్లించాల్సిన ఎలక్ట్రానిక్ వ్యాపార నిర్వహణదారులు;
  5. పన్ను విధించదగిన ప్రవాసులు;
  6. చట్టంలోని సెక్షన్ 51 కింద పన్ను కోత పెట్టాల్సినవారు;
  7. పన్ను విధించదగిన ఇతర నమోదైన వ్యక్తుల తరపున ప్రతినిధిగా లేదా ఇతర రూపంలో వస్తుసేవలు సరఫరా చేసేవారు;
  8. ఉత్పాదక సేవల పంపిణీదారు (చట్టంకింద విడిగా నమోదు చేసుకోవడంతో నిమిత్తం లేకుండా);
  9. సెకన్ 52 కింద పన్ను వసూలు చేయాల్సిన వ్యక్తులు;
  10. ప్రతి ఎలక్ట్రానిక్ వ్యాపార నిర్వహణదారులు
  11. నమోదైన వ్యక్తికిగాక భారతదేశంలోని వ్యక్తికి దేశం వెలుపల ఓ ప్రదేశం నుంచి ఆన్లైన్ సమాచారం, డేటాబేస్ పునర్లభ్యత సేవలందించే ప్రతి వ్యక్తి:
  12. వస్తుసేవల పన్ను మండలి సిఫారసు మేరకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే వ్యక్తులు, వర్గాలకు చెందిన ఇతర వ్యక్తులు.

జీఎస్టీ కింద నమోదుకు కాలవ్యవధి ఎంత?

నమోదు బాధ్యత వర్తించే తేదీనుంచి 30 రోజుల్లోగా ప్రతి వ్యక్తి నిర్దేశిత నమోవు షరతులు-నిబంధనల ప్రకారం నిర్దేశిత విధానంలో నమోదు చేయించుకోవాలి. సాధారణంగా పన్ను విధించదగిన వ్యక్తి, పన్ను విధించదగిన ప్రవాసీ వ్యక్తి వ్యాపార ప్రారంభానికి కనీసం 5 రోజుల ముందు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి.

ఒక వ్యక్తి ఒకే శాశ్వత ఖాతా సంఖ్యతో వేర్వేరు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లయితే ఒకే ఒకసారి నమోదు సరిపోతుందా?

సరిపోదు... నమోదు చేయించుకోవాల్సిన ప్రతి వ్యక్తి తాను ఏయే రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా నమోదు చేసుకోవాల్సిందే. తదనుగుణంగా సీబీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెక్షన్ 22, ఉప సెక్షన్ (1)కి లోబడి జీఎస్టీ చెల్లించాల్సిందే.

ఒక రాషంలో బహుళ సంసలతో ప్రత్యక్ష వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తి భిన్నరకాల నమోదు చేయించుకునే వీలుందా?

వీలుంది... సెక్షన్ 25లోని ఉప సెక్షన్ (2) ప్రకారం ఒక రాష్ట్రంలో బహుళ సంస్థలతో ప్రత్యక్ష వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తి ప్రతి వ్యాపారాన్నీ నిర్దిష్ట షరతుల మేరకు విడివిడిగా నమోదు చేసుకోవచ్చు.

జీఎస్టీ చెల్లించే బాధ్యత లేకపోయినా ఒక వ్యక్తి స్వచ్ఛందంగా నమోదు చేసుకోగల వెసులుబాటు ఉందా?

ఉంది... సెక్షన్ 25లోని ఉప సెక్షన్ (3) పేర్కొంటున్న మేరకు ఒక వ్యక్తికి జీఎస్టీ చెల్లించే బాధ్యత లేకపోవడంతోపాటు సెక్షన్ 22 కింద నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న పన్ను విధించదగిన వ్యక్తులకు వర్తించే చట్ట నిబంధనలన్నీ ఇటువంటి వ్యక్తులకూ వర్తిస్తాయి.

నమోదు కోసం శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరిగా కలిగి ఉండాలా?

అవును... సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 25(6) పేర్కొంటున్న మేరకు నమోదు కోసం ప్రతి వ్యక్తి ఆదాయపన్ను చట్టం-1961 (43/1961) ప్రకారం శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కలిగి ఉండాలి. అయితే, పైన పేర్కొన్న సెక్షన్ 25(6) ప్రకారం పాన్ బదులుగా సదరు వ్యక్తికి సెక్షన్ 51 కింద పన్ను కోత చేసి ఉండాలి. సదరు ఆదాయపన్ను చట్టం కింద పన్ను కోత వసూలు ఖాతా సంఖ్య (TAN) కలిగి ఉండాలి.

అలాగే సెక్షన్ 25(7) ప్రకారం పన్ను విధించదగిన ప్రవాసీ వ్యక్తికి నమోదు కోసం పాన్ తప్పనిసరి కాదు. నిర్దేశిత ఇతర పత్రాలలో దేనితోనైనా వారు నమోదు పొందవచ్చు.

ఈ చట్టం కింద పన్నుల విభాగం స్వయంగా సముచిత అధికారిద్వారా ఒక వ్యక్తిని నమోదు చేయవచ్చా?

చేయవచ్చు. సెక్షన్ 25 ఉప సెక్షన్ (8) ప్రకారం... నమోదు బాధ్యతగల వ్యక్తి సకాలంలో నమోదు పొందకపోతే సముచిత అధికారి ఈ చట్టం కింద లేదా అప్పటికి అమలులో ఉన్న ఏ ఇతర చట్టం కిందనైనా ఎలాంటి పక్షపాతానికి తావులేని చర్యలో భాగంగా నమోదు నిబంధనలకు అనుగుణంగా సదరు వ్యక్తిని నమోదు చేయవచ్చు.

నమోదు కోసం సమర్పించిన దరఖాస్తును సముచిత అధికారి తిరస్కరించవచ్చా?

తిరస్కరించవచ్చు... సీజీఎస్సీ/ఎసీఎసీ చటంలోని సెక్షన్ 25 ఉప సెక్షన్ 10 ప్రకారం... నమోదు కోసం సమర్పించిన దరఖాస్తును తగిన పరిశీలన అనంతరం తిరస్కరించవచ్చు.

ఏ వ్యక్తికైనా నమోదు మంజూరు శాశ్వతమా?

అవును... ఒకసారి నమోదు మంజూరు ధ్రువీకరణ పత్రం జారీచేసిన తర్వాత అది స్వాధీనం/ రద్దు/తాత్కాలిక లేదా సంపూర్ణ తిరస్కృతికి గురైతే తప్ప శాశ్వతంగా అమలులో ఉంటుంది.

ఐక్యరాజ్యసమితి విభాగాలు జీఎస్టీ కింద నమోదు చేసుకోవడం అవసరమూ?

అవును... సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 25 (9) ప్రకారం... గుర్తింపు పొందిన ఐక్యరాజ్యసమితి విభాగాలు, విదేశీ రాయబార లేదా దౌత్యాధికారుల కార్యాలయాలు, గుర్తింపు పొందిన అదే స్థాయిలోని వ్యక్తులు జీఎస్టీ పోర్టల్ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్య (UN) పొందాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఈ గుర్తింపు సంఖ్య స్వరూపం సరిగ్గా వస్తుసేవల పన్ను గుర్తింపు సంఖ్య (GSTIN) స్వరూపంతో సరిపోలి ఉండాలి. ఈ విధంగా విశిష్ట గుర్తింపు సంఖ్య పొందితేనే ప్రకటిత జాబితాలోని వస్తుసేవలను స్వీకరించిన తర్వాత వాటిపై పన్నులు వాపసు కోరే వెసులుబాటుతోపాటు ఇతరత్రా ప్రకటిత అంశాల విషయంలో ఉపయుక్తంగా ఉంటుంది.

ఐరాస సంస్థలకు సరఫరాలు జరిపే పన్ను చెల్లింపుదారు బాధ్యతలు ఏమిటి?

ఈ సంస్థలకు సరఫరాలు జరిపే పన్ను చెల్లింపుదారు ఇన్వాయిస్ లపై యూఐఎన్ నంబరు వేయాల్సి ఉంటుంది. సదరు సరఫరాలను రిజిస్టర్ చేసుకొన్న మరో వ్యాపార సంసధకు జరిపినదిగా (బీ2బీ) భావించాలి. ఆ ఇన్వాయిస్ లను సరఫరాదారు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ సంస్థలు కూడా రిజిస్టిషస్ చేయించుకోవడం తప్పనిసరా?

బయటికి సరఫరాలు జరుపుని (కనుక రిజిస్టేషన్ చేయించుకోల్సిన అవసరం లేదు), అదే సమయంలో అంతర్ రాష్ట్ర కొనుగోళ్లు జరిపే ప్రభుత్వ కార్యాలయాలకు, పబ్లక్ రంగ సంస్థలకు సంబందిత రాష్ట్రాల పన్ను అధికారులు విశిష్ట గుర్తింపు సంఖ్యను జీఎస్టీ పోర్టల్ ద్వారా కేటాయిస్తారు.

సాధారణ పన్ను విధించదగిన వ్యక్తి అంటే ఎవరు?

సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 2 (20) నిర్వచనం ప్రకారం... దేశంలో ఎక్కడా స్థిరమైన వ్యాపార స్థానం లేకపోయినా తన వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా స్వయంగా లేదా ప్రతినిధిద్వారా లేదా ఇతర రూపాల్లో అప్పుడప్పుడూ వస్తువులు లేదా సేవల సరఫరా సంబంధిత లావాదేవీలు నిర్వహించే వ్యక్తి.

పన్ను విధించదగిన ప్రవాస వ్యక్తి అంటే ఎవరు?

చట్టంలోని సెక్షన్ 2 (77) నిర్వచనం ప్రకారం... దేశంలో ఎక్కడా స్థిరమైన నివాసంతోపాటు వ్యాపార స్థానం లేకపోయినా తన వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా స్వయంగా లేదా ప్రతినిధిద్వారా లేదా ఇతర రూపాల్లో అప్పుడప్పుడూ వస్తువులు లేదా సేవల సరఫరా సంబంధిత లావాదేవీలు నిర్వహించే ప్రవాసీ వ్యక్తి.

పన్ను విధించదగిన సాధారణ, ప్రవాసీ వ్యక్తులకు జారీచేసిన నమోదు ధ్రువీకరణ చెల్లుబాటు కాలం ఎంత?

చట్టంలోని సెక్షన్ 27 (1), ఇతర నిబంధనల ప్రకారం. "పన్ను విధించదగిన సాధారణ వ్యక్తి", లేదా "పన్ను విధించదగిన ప్రవాసీ వ్యక్తి"కి జారీచేసిన నమోదు ధ్రువీకరణ చెల్లుబాటు కాలం వారు సమర్పించిన నమోదు దరఖాస్తులో పేర్కొన్న వ్యవధి వరకూ లేదా అమలులోకి వచ్చిన తేదీనుంచి 90 రోజుల వరకూ ఏది ముందైతే అప్పటిదాకా ఉంటుంది. అయితే, వారు కోరిన పక్షంలో సముచిత అధికారి ఈ వ్యవధిని మరో 90 రోజులకు మించకుండా పొడిగించవచ్చు.

ఈ ప్రత్యేక విభాగం కింద నమోదు పొందే సమయంలో సాధారణ, ప్రవాసీ పన్ను విధించదగిన వ్యక్తులు ఏదైనా ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుందా?

అవును... "సహజంగా పన్ను విధించదగిన వ్యక్తులు" నమోదు కోసం ముందస్తు పన్ను చెల్లించే అవసరం లేకపోయినా "సాధారణ, ప్రవాసీ పన్ను విధించగిన వ్యక్తులు" దరఖాస్తు సమర్పించే సమయంలో ముందస్తు పన్ను జమ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 27 (2), ఇతర నిబంధనల మేరకు వారు కోరిన నమోదు చెల్లుబాటు వ్యవధిలో సంభావ్య పన్ను బాధ్యతకు సమానమైన మొత్తాన్ని ముందస్తు పన్నుకింద జమ చేయాల్సి ఉంటుంది. తొలి దరఖాస్తులో కోరిన వ్యవధి లేదా 90 రోజులు ముగిసిన తర్వాత పొడిగింపు కోరినప్పుడూ ఇదే తరహాలో నమోదు పొడిగింపు కాలపు లేదా 90 రోజుల సంభావ్య పన్ను బాధ్యతకు సమానమైన మొత్తం ముందస్తు పన్నుగా జమ చేయాల్సి ఉంటుంది.

నమోదు ధ్రువీకరణ పత్రంలో సవరణలకు అనుమతి ఉందా?

ఉంది... సెక్షన్ 28 ప్రకారం నమోదిత వ్యక్తి ధ్రువీకరణ పత్రంలో సవరణ కోసం సమర్పించిన దరఖాస్తులో ఇచ్చిన సమాచారం ఆధారంగా లేదా సముచిత అదికారి స్వీయ నిర్ధారణ ప్రకారం నమోదిత వివరాలలో సవరణలకు ఆమోదం తెలపవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయితే, సవరణ కోసం దరఖాస్తు స్వీకరించిన తర్వాత 15 సాధారణ పనిదినాల్లోగా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ధ్రువీకరణ పత్రంలోని నిర్దిష్ట కీలకాంశాల సమాచారం సవరణకు మాత్రమే సముచిత అధికారి అనుమతి వర్తిస్తుంది. ఇతర అంశాల్లోని సమాచార సవరణ కావాలంటే జీఎస్టీ ఉమ్మడి పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

ధ్రువీకరణ పత్రం రద్దుకు అనుమతి ఉంటుందా?

ఉంటుంది... సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 29లో పేర్కొన్న పరిస్థితులకు అనుగుణంగా సముచిత అధికారి నమోదు ధ్రువీకరణ పత్రం రద్దు చేయవచ్చు. పన్ను విధించదగిన నమోదిత వ్యక్తి లేదా అతని మరణానంతరం చట్టబద్ద వారసులు నిర్దేశిత రూపంలో సమర్పించే దరఖాస్తు మేరకు లేదా స్వీయ విచక్షణ ప్రకారం సముచిత అధికారి నిర్దేశిత వ్యవధి, విధివిధానాలకు అనుగుణంగా నమోదు ధ్రువీకరణను రద్దు చేయవచ్చు. నమోదు నిబంధనల ప్రకారం (స్వీయ నిర్ణయం మేరకు సముచిత అధికారి రద్దుకు ప్రతిపాదించిన పక్షంలో) సంజాయిషీ నోటీసుకు సమాధానం అందుకున్న తర్వాత లేదా రద్దు కోసం (పన్ను విదించదగిన వ్యక్తి లేదా చట్టబద్ద వారసులు) దరఖాస్తు సమర్పించిన తేదీ నుంచి 30 రోజుల్లోగా రద్దు ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది.

సీజీఎస్టీ కింద నమోదు ధ్రువీకరణ రద్దుచేస్తే ఎస్టీఎస్టీ చట్టం కింద కూడా అది వర్తిస్తుందా?

అవును... ఒక చట్టం (ఉదాహరణకు సీజీఎస్టీ) కింద నమోదు ద్రవీకరణ రద్దయిన పక్షంలో ఇతర చట్టం (సెక్షన్ 29(4) ఎస్టీఎస్టీ చట్టం) కింద కూడా రద్దయినట్లే పరిగణించాలి.

సముచిత అధికారి తనంతట తానుగా నమోదు ధ్రువీకరణను రద్దు చేయవచ్చా?

చేయవచ్చు... సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెక్షన్ 29 (2)లో పేర్కొన్న కొన్ని పరిస్థితుల్లో సముచిత అధికారి తనంతట తానుగా నమోదు ధ్రువీకరణను రద్దు చేయవచ్చు. అంటే. సీజీఎస్టీ చట్ట నిబంధనలను లేదా అందులోని ఇతర నియమాలను ఉల్లంఘించడం, మిశ్రమ పద్దతికింద పన్ను చెల్లించే డీలరు వరుసగా మూడు పన్ను కాలపు రిటర్నులు దాఖలు చేయకపోవడం లేదా క్రమబద్ద పన్ను చెల్లింపుదారు వరుసగా ఆరు నెలలపాటు రిటర్నులు సమర్పించకపోవడం, స్వచ్చంద నమోదు తేదీ నుంచి ఆరు నెలల్లోగా వ్యాపారం ప్రారంభించకపోవడం వంటి "పరిస్థితుల"లో సముచిత అధికారి నమోదు ధ్రువీకరణ రద్దుకు స్వీయ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే, దీనికి ముందు సదరు సముచిత అధికారి సహజ న్యాయ సూత్రాల (సెక్షన్ 29 (2)(ఇ) నిబంధన)ను అనుసరించాల్సి ఉంటుంది.

ఉద్దేశపూర్వక తప్పుడు ప్రకటన, మోసం లేదా నిజాలను దాచి నమోదు ధ్రువీకరణ పొందితే ఏమవుతుంది?

అటువంటి సందర్భాలుంటే నమోదు ధ్రువీకరణను సముచిత అధకారి వెనుక తేదీనుంచి రద్దు చేయవచ్చు. (సెకన్ 29(2)(ఇ).

జీఎస్టీ చట్టం కింద సేవల కోసం కేంద్రీకృత నమోదు ధ్రువీకరణ వెసులుబాటు ఉందా?

లేదు... పన్ను చెల్లింపుదారు తాను పన్ను విధించదగ్గ సరఫరాలు చేస్తున్న ప్రతి రాష్ట్రం నుంచి విడివిడిగా నమోదు ధ్రువీకరణ పొందాలి.

ఒక రాష్ట్రంలో వేర్వేరు ప్రత్యక వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే పన్ను చెల్లింపుదారు ప్రతి వ్యాపారానికీ వేర్వేరు నమోదు ధ్రువీకరణ పొందే వీలుందా?

లేదు... అయితే, సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 25(2) నిబంధన ప్రకారం ఒక రాష్ట్రంలో బహుళ సంస్థలతో ప్రత్యక్ష వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తి ప్రతి వ్యాపారానికీ విడివిడిగా నమోదు ధ్రువీకరణ పొందే వీలుంది.

ఉత్పాదక సేవల పంపిణీదారు (ISD) అంటే ఎవరు?

సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెక్షన్ 2 (61) నిర్వచనం ప్రకారం... ISD అంటే... ఉత్పాదక సేవల పంపిణీదారు అని అర్థం. ఇది ప్రాథమికంగా ఉత్పాదక సేవల స్వీకరణ సంబంధిత పన్ను రసీదులు అందుకునేందుకు ఉద్దేశించిన కార్యాలయం. (ఒకే పాన్ నంబరుగల) సరఫరాదారులకు నిష్పత్తి మేరకు ఉత్పాదక పన్ను జమును పంపిణీ చేయడం దీని బాధ్యత.

ఈసరికే ఉన్న పన్ను చెల్లింపుదగారు రిజిస్టరేషన్తో పాటుగా విడిగా ఐఎస్టీ రిజిస్టిషస్ కూడా చేయించుకోవాలా?

అవును. ఐఎస్డీ (ISD) రిజిస్టేషన్ అనేది పన్ను చెల్లింపుదారుకు సంబంధించిన ఒక కార్యాలయానికి సంబంధించినది. సాధారణ రిజిస్టేషన్ కు ఇది భిన్నమైనది.

పన్ను చెల్లింపుదారు బహుళ ఐఎస్టీలు కలిగి ఉండవచ్చా?

అవును. పన్ను చెల్లింపుదారుకు చెందిన వేరువేరు కార్యాలయాలు విడివిడిగా ఐఎస్డి రిజిస్టేషన్ చేయించుకోవచ్చు.

వ్యాపారం బదిలీ సందర్భంలో (నమోదు ధ్రువీకరణకు సంబంధించి) బాధ్యతలేమిటి?

సెక్షన్ 22(3) ప్రకారం... బదిలీ లేదా వారసత్వంద్వారా వ్యాపారాన్ని పొందినట్లయితే అదే రోజునుంచి తన పేరిట అమలులోకి వచ్చేలా కొత్తగా నమోదు ధ్రువీకరణ పొందాల్సిన బాధ్యత సదరు వ్యక్తిపై ఉంటుంది.

ప్రస్తుత కేంద్ర సుంకం/సేవాపన్ను/విలువ ఆధారిత పన్ను చట్టాలకింద ఇప్పటికే నమోదైన పన్నుచెల్లింపుదారులు/డీలర్లు తాజాగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందా?

లేదు... వస్తుసేవల పన్ను చట్రం (GSTN) అటువంటి వారందరినీ తన పరిధిలోకి తీసుకుని, చట్టం అమలులోకి వచ్చే తేదీనుంచి తాత్కాలిక జీఎస్ టిన్ (GSTIN) సంఖ్యతో నమోదు పత్రం జారీచేస్తుంది. అటుపైన ఆరు నెలల్లోగా పన్ను శాఖ అధికారుల సముచిత తనిఖీల అనంతరం అది శాశ్వత ధ్రువీకరణ పత్రంగా మారుతుంది. ఇందుకోసం అవసరమైన పత్రాలను, సమాచారాన్ని నిర్దేశిత సమయంలోగా అందజేయాలని నమోదిత వ్యక్తులను అధికారులు కోరుతారు. తదనుగుణంగా అవన్నీ అందజేయడంలో విఫలమైతే తాత్కాలిక జీఎన్ టిన్ సంఖ్య రద్దవుతుంది.

కేంద్రీకృత నమోదు ధ్రువీకరణగల సేవాపన్ను చెల్లింపుదారులు తమకు వ్యాపారాలున్న సంబంధిత రాష్ట్రాల్లో నమోదు ధ్రువీకరణ కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చిన్న పనులు చేసేవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలా?

లేదు... చిన్న పనులు చేసేవారు సేవల సరఫరాదారులు. అయితే, వారి సగటు వ్యాపార పరిమాణం రూ.20/10 లక్షల స్థాయిని దాటినప్పుడు మాత్రమే నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.

చిన్న పనులు చేసేవారి వ్యాపార స్థలం నుంచి వస్తు సరఫరాకు అనుమతి ఉంటుందా?

ఉంటుంది... అయితే, సదరు చిన్న పనులు చేసే వ్యక్తి నమోదు ధ్రువీకరణ పొంది ఉంటేనే ఇది సాధ్యం. లేదంటే చిన్న పనులుచేసే వ్యక్తి పని ప్రదేశాన్ని తన అదనపు కార్యకలాపాల స్థానంగా ప్రధాన వ్యాపారి ప్రకటించి ఉండాలి.

పన్ను చెల్లింపుదారు నమోదుకు దరఖాస్తు చేసే సమయంలో తన ప్రదేశాలన్నిటినీ ప్రకటించాలా?

అవును... ప్రధాన వ్యాపార స్థానం, ఇతర వ్యాపార ప్రదేశాలను సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 2(89), 2(85) విడివిడిగా నిర్వచిస్తున్నాయి. కాబట్టి పన్ను చెల్లింపుదారు తన ప్రధాన వ్యాపార స్థానంతోపాటు అదనపు వ్యాపార ప్రదేశాలను కూడా నమోదు దరఖాస్తులో తప్పక వెల్లడించాలి.

ఐటీ (IT) యంత్రాంగం అందుబాటులోలేని చిన్న వ్యాపారులు లేదా డీలర్లకు తోడ్పడేందుకు వ్యవస్థ ఏదైనా ఉంటుందా?

ఐటీ ప్రావీణ్యం పొందిన యంత్రాంగాలు పన్ను చెల్లింపుదార్ల అవసరాల నిమిత్తం ఈ దిగువ సౌకర్యలు సమకూర్చడమైంది.

ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ (టీఆర్పీ)... పన్ను చెల్లింపుదారు తన రిజిస్టేషన్ దరఖాస్తు, రిటర్న్ సొంతంగా సిద్ధం చేసుకోవచ్చు లేదా సహాయం కొరకు టీఆర్పీని సంప్రదించవచ్చు. టీఆర్పీ తనకు పన్ను చెల్లింపుదారు సమకూర్చిన సమాచారం ఆధారంగా నిర్ణీత పద్ధతిలో రిజిస్టేషన్ దరఖాస్తు, రిటర్న్ సిద్ధం చేసి ఇస్తారు. అయితే అందులోని సమాచారం సరైనదా అనే విషయంలో చట్టపరమైన బాధ్యత పన్ను చెల్లింపుదారు మీదే ఉంటుంది. ఎలాంటి పొరపాట్లకు గానీ, తప్పుడు సమాచారానికి గానీ టీఆర్పీకి ఎలాంటి బాధ్యత ఉండదు.

ఫెసిలిటేషన్ సెంటర్ (ఎఫ్.సీ)... అధీకృత వ్యక్తి సంతకంతో కూడిన సమ్మరీ షీటుతోపాటుగా దరఖాస్తుదారు సమర్పించే అన్ని పత్రాలు, ఫారాలు అప్లోడ్ చేసే బాధ్యత ఈ విభాగానిదే. కామన్ పోర్టల్ పై ఎఫ్సిఐడీ (FCID) మరియు పాస్వర్డ్ ఉపయోగించి డేటా అప్లోడ్ చేసిన తర్వాత అక్నాలెజ్మెంట్ ప్రింటు తీసి ఎఫ్ సీ నిర్వాహకుడు సంతకం చేసి పన్ను చెల్లింపుదారు రికార్డుల నిమిత్తం అందజేస్తారు. అదేవిధంగా అధీకృత వ్యక్తి సంతకం చేసిన సమ్మరీ పీటును ఎఫ్సీ స్కాన్ చేసి అప్ లోడ్ చేస్తారు.

జీఎస్టీఎస్ కింద డిజిటల్ సంతకం సదుపాయం ఏదైనా ఉందా?

దరఖాస్తులు/ఇతరత్రా పత్రాల సమర్పణ కోసం పన్ను చెల్లింపుదారులు తము చెల్లుబాటయ్యే డిజిటల్ సంతకాలు వినియోగించుకునేందుకు రెండు రకాల వెసులుబాట్లున్నాయి. అవేమిటంటే.. ఆధార్ నంబరుద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ-సంతకం చేయడం; లేదా తన డిజిటల్ సంతకపు ధ్రువీకరణ పత్రాన్ని (DSC) జీఎస్టీ పోర్టల్లో నమోదు చేసుకోవడంద్వారా వినియోగించుకోవడం. అయితే, లేదా పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలు డీఎస్పీద్వారా మాత్రమే సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సంతకాల కోసం 2వ స్థాయి, 3వ స్థాయి డిజిటల్ సంతకాల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ఆమోదిస్తారు.

నమోదు కోసం ఆస్లైస్లో సమర్పించిన దరఖాస్తుపై నిర్ణయానికి కాల పరిమితి ఎంత?

దరఖాస్తులో వెల్లడించిన సమాచారం, ఆన్లైన్లో పంపిన పత్రాలు సరిపోలినట్లయితే కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ విభాగాల అధికారులు 3 సాధారణ పనిదినాల్లోగా స్పందించాలి. ఏవైనా లోపాలు/పొరపాట్లు ఉన్నాయని అధికారులు తెలియజేస్తే సదరు సమాచారం అందిన తేదీనుంచి 7 రోజులలో దరఖాస్తుదారు సదరు లోపాలు/పొరపాట్లను తొలగించి నివేదించాలి. ఈ నివేదన అందుకున్న తేదీనుంచి 7 రోజుల్లోగా దరఖాస్తుకు ఆమోదం లేదా తిరస్కరణపై కేంద్ర, రాష్ట్ర అధికారులు నిర్ణయం ప్రకటించాలి. ఈ వ్యవధిలోగా వారు స్పందించని పక్షంలో పోర్టల్ తనంతట తానుగా నమోదు ధ్రువీకరణను సృష్టిస్తుంది.

ఆన్ లైన్ దరఖాస్తుపై ఏదైనా సందేహం వెలిబుచ్చితే దరఖాస్తుదారు ఎంత వ్యవధిలోగా స్పందించాలి?

దరఖాస్తు తనిఖీ ప్రక్రియ సందర్భంగా పన్ను అధికారులలో ఎవరైనా ఏదో ఒక పొరపాటును గమనించినా, ఏదైనా సందేహం కలిగినా ఆ సమాచారాన్ని 3 సాధారణ పనిదినాల్లోగా దరఖాస్తుదారుతోపాటు ఇతర పన్ను అధికార సంస్థకు జీఎస్టీ పోర్టల్ ద్వారా తెలియజేయాలి. ఈ సమాచారం అందుకున్న తేదీనుంచి 7 రోజుల్లోగా దరఖాస్తుదారు సదరు సందేహానికి జవాబివ్వాలి/పొరపాటును సరిదిద్ది పంపాలి. ఈ వివరణ లేదా అదనపు పత్రాలేవైనా అందుకున్న తర్వాత సంబంధిత పన్ను అధికార సంస్థ ఆ తేదీనుంచి 7 సాధారణ పనిదినాల్లోగా స్పందించాలి.

నమోదు తిరస్కరణ ప్రక్రియ ఏమిటి?

నమోదు మంజూరుకు తిరస్కరించిన పక్షంలో అందుకు కారణాలేమిటో సుస్పష్టంగా వివరించే సాధికారిక ఆదేశాలద్వారా దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సదరు అధికార స్థానపు తిరస్కరణ నిర్ణయంపై పునఃపరిశీలన అభ్యర్ధన (అప్పీల్) దాఖలు చేసే హక్కు దరఖాస్తుదారుకు ఉంది. అయితే, సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 26 ఉప సెక్షన్ (2) ప్రకారం. నమోదు ద్రవీకరణ కోసం వచ్చిన దరఖాస్తును ఒక అధికార స్థానం (ఉదాహరణకు (సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టం) తిరస్కరించినప్పుడు ఇతర (ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీ/సీజీఎస్టీ) చట్టాల కింది అధికార స్థానాలు కూడా తిరస్కరించినట్లే పరిగణించాలి.

దరఖాస్తును తిరస్కరిస్తే సదరు నిర్ణయాన్ని తెలియజేస్తారా?

దరఖాస్తు ఆమోదించినా, తిరస్కరించినా ఆ నిర్ణయాన్ని దరఖాస్తుదారుకు జీఎస్టీ ఉమ్మడి పోర్టల్ నుంచి ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా తెలియపర్చబడుతుంది. ఈ దశలో జూరిస్డిక్షన్ పరిధి గురించి దరఖాస్తుదారుకు తెలియజేస్తారు.

జీఎస్టీఎస్(GSTN) పోర్టల్ నుంచి రిజిస్టేషన్ సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చా?

రిజిస్టేషన్ మంజూరు చేసినట్టయితే జీఎస్టీ కామన్ పోర్టల్ నుంచి రిజిస్టేషన్ సర్టిఫికెట్ ను దరఖాస్తుదారు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

నమోదు ధ్రువీకరణ రద్దును ఉపసంహరించే వీలుందా?

ఉంది. అయితే, సదరు ధ్రువీకరణ రద్దు నిర్ణయం సముచిత అధికారి స్వయంగా తీసుకున్నదై ఉండాలి తప్ప పన్ను విధించదగిన వ్యక్తి లేదా వారి చటబద్ద వారసుల విజ్ఞప్తి ఆధారంగా తీసుకున్నది కాకూడదు స్వీయ నిర్ణయంతో అధికార స్థానం తన ధ్రువీకరణను రద్దు చేసినట్లయితే ఈ ఉత్తర్వు అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా సదరు నిర్ణయ ఉపసంహరణ కోరుతూ సముచిత అధికారికి పన్ను చెల్లింపుదారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు/సమాచారం/వివరణ అందిన తేదీనుంచి 30 రోజుల్లోగా సముచిత అధికారి ధ్రువీకరణ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించవచ్చు లేదా అందుకోసం వచ్చిన దరఖాస్తును తిరస్కరించవచ్చు.

నమోదు ధ్రువీకరణ రద్దువల్ల దాన్నికోల్పోయిన వ్యక్తిపై పన్ను చెల్లింపు బాధ్యత ఏదైనా ఉంటుందా?

ఉంటుంది. సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 29(5) ప్రకారం... నమోదు ధ్రువీకరణ రద్దయిన ప్రతి నమోదిత పన్ను చెల్లింపుదారు ఆ తేదీకి ముందురోజు తనవద్దగల ఉత్పాదకాల నిల్వ, పాక్షికంగా వినియోగించిన ఉత్పాదకాలు, పూర్తయిన వస్తువుల నిల్వ లేదా మూలధన వస్తువులు, యంత్రాలు, యంత్ర పరికరాలు తదితరాలపై జమ అయిన ఉత్పాదక పన్ను లేదా చెల్లించాల్సిన ఉత్పత్తి పన్ను. ఏది ఎక్కువైతే దానికి సమానమైన మొత్తాన్ని తన నగదు/జమ పుస్తకాలలో నిల్వను తగ్గించుకోవడంద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

పన్ను విధించదగిన సాధారణ, ప్రవాసీ వ్యక్తుల మధ్య తేడా ఏమిటి?

పన్ను విధించదగిన సాధారణ, ప్రవాసీ వ్యక్తుల గురించి సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెక్షన్ 2 (2O), 2(77) వేర్వేరుగా నిర్వచించాయి. ఈ రెండు వర్గాల మధ్య కొన్ని తేడాలు కింది విధింగా ఉన్నాయి:-

పన్ను విధించదగిన సాధారణ వ్యక్తి

పన్ను విధించదగిన సాధారణ వ్యక్తి

పన్ను విధించదగిన ప్రవాసీ

స్థిరమైన వ్యాపార ప్రదేశమేదీ లేకుండా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అప్పుడప్పుడూ వస్తువులు లేదా సేవల సరఫరా లావాదేవీలు నిర్వహించేవారు. శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కలిగి ఉంటారుభారతదేశంలో స్థిరమైన వ్యాపార ప్రదేశమేదీ లేకుండా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అప్పుడప్పుడూ సేవల సరఫరా లావాదేవీలు నిర్వహించేవారు. శాశ్వత ఖాతా సంఖ్య కలిగి ఉండరు; ప్రవాసీ వ్యక్తి ఒకవేళ; పాన్ కలిగి ఉంటే పన్ను విధించదగిన సాధారణ వ్యక్తిగా నమోదు చేసుకోవచ్చు.
నమోదు కోసం మామూలు పన్ను చెల్లింపుదారుల తరహాలో జీఎస్టీ రిజిస్టేషన్-O1 దరఖాస్తు ఫారాన్నే వినియోగించవచ్చు.ప్రవాసీ వ్యక్తి నమోదు కోసం ప్రత్యేక దరఖాస్తు (జీఎస్టీ రిజిస్టేషన్-O9)ను సమర్పించాల్సి ఉంటుంది.
వ్యాపార కార్యకలాపాల కొనసాగింపులో భాగంగా లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది.నిర్వచనంలో వ్యాపార పరీక్ష లేదు
సాధారణ GSTR-1, GSTR-2, GSTR-3 రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.కొనుగోలు చేసుకునే సరఫరాలన్నిటిపై ఉత్పాదక పన్ను జమ (ఐటీసీ)ను కోరవచ్చు.GSTR-5 నమూనాలో ప్రత్యేక సరళీకృత రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకునే వస్తువులు లేదా సేవలపై మాత్రమే ఐటీసీ పొందడం సాధ్యమవుతుంది.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate