హోమ్ / శక్తి వనరులు / ఇంధన సముదాయము / బిపిఎల్ కుటుంబాలకు కనెక్షన్ విడుదలకు సిఎస్ఆర్ పథకం.
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బిపిఎల్ కుటుంబాలకు కనెక్షన్ విడుదలకు సిఎస్ఆర్ పథకం.

పథకం ముఖ్యాంశాలు

దారిద్య్ర రేఖకు క్రింది (బీపీఎల్) కుటుంబాలు (14.2 కిలోలు లేదా 5 కిలోల సామర్థ్యం ఎదైనా) ఒక సిలిండరుకు మరియు ఒక ప్రెజర్ రెగ్యులేటరుకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించ కుండా కొత్త ఎల్పిజి కనెక్షన్ పొందవచ్చు . అయితే, క్రింద ఇచ్చిన ఇతర ఖర్చులు కొత్త ఎల్పిజి కనెక్షన్ల లబ్ధిదారులు భరించ వలసి ఉంటుంది.

 • కొత్త కనెక్షను ఇంస్టలేషను/ డెమో ఖర్చులు
 • సంబంధిత పంపిణీదారు DGCC  జారీ చేయడానికైన అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు .
 • కొత్త ఎల్పిజి కనెక్షన్ సమయంలో  బిఐఎస్ గుర్తులు కలిగిన రబ్బరు ట్యూబ్ మరియు గ్యాస్ స్టవ్ ను వినియోగదారుడు కలిగి ఉండాలి. వీటిని పంపిణీదారు నుంచి కాని వేరె దగ్గర నుంచి గాని కొనవచ్చు. పంపిణీదారు నుండి కొనుగోలు చేస్తే, హాట్ ప్లేట్ మరియు ఎల్పిజి రబ్బరు ట్యూబ్ ధరను పంపిణీదారుకు చెల్లించాలి.
 • హాట్ ప్లేట్  వేరే దగ్గర నుంచి కొంటే కస్టమర్ హాట్ ప్లేట్ తనిఖీ ఖర్చును పంపిణీదారుకు చెల్లించాల్సి ఉంటుంది.
 • ఎల్పిజి నిండు సిలిండర్ (లు)  ధర కూడా కొత్త ఎల్పిజి కనెక్షన్ తీసుకుంటున్నప్పుడు  కస్టమర్ చెల్లించాలి.

ఈ పథకం కింద కొత్త ఎల్పిజి కనెక్షన్ను తీసుకొనే ఏ బిపిఎల్ కేటగిరీ వారికైనా 14.2 కిలోల సిలిండరుపై రూ 1,600 రిబేటు ఇవ్వబడుతుంది. సెక్యూరిటీ డిపాజిటు రూ 1, 450 మరియు ప్రెషరు రెగ్యులేటరు వ్యయం రూ .150లు ఈ రిబేటులో ఉంటాయి.

బిపిఎల్ కార్డు హోల్డర్ కనెక్షన్ పొందే పద్దతి

 • బిపిఎల్ కార్డు హోల్డర్ సమీప పంపిణీదారు/RGGLVకు వెళ్ళి సూచించిన డిక్లరేషన్ ఫాంను సమర్పించాలి. దానితో పాటు బిపిఎల్ రేషన్ కార్డ్ కాపీని జతచేయాలి.
 • పంపిణీదారు/RGGLV బిపిఎల్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీ పై "అసలు తనిఖీ చేయబడింది" అని ముద్రవేసి ఈ పథకం కింద LPG వినియోగదారుని పేరును నమోదు చెసుకుంటాడు.
 • పంపిణీదారు/RGGLV బిపిఎల్ రేషన్ కార్డు దారుల (లబ్దిదారుల) జాబితా సిద్ధం చేస్తాడు. తర్వాత ఉచిత కనెక్షన్ల సెక్యూరిటీ డిపాజిట్  విడుదల కోసం  రాష్ట్ర ప్రభుత్వ అధికారికి - BDO / DSO / FDO మొదలైన - జాబితా అందచేస్తాడు.
 • రాష్ట్ర ప్రభుత్వం చేసిన ధృవీకరణ ఆధారంగా,  కావల్సిన అన్ని అర్హతలూ ఫార్మాలిటీలు పూర్తయిన  లబ్ధిదారులకు, కొత్త ఎల్పిజి కనెక్షన్ విడుదలకు చేస్తారు.
 • ఈ పథకం కింద బిపిఎల్ రేషన్ కార్డు ఉన్నవారికి  డిపాజిటు లేని ఒక ఉచిత సిలెండర్ మాత్రమే విడుదల చేస్తారు. ఒకవేళ  బిపిఎల్ రేషన్ కార్డు హోల్డర్ రెండవ సిలిండర్ (DBC) కోరుకుంటె, అప్పటి డిపాజిట్ రేటు ను కట్టవలసి ఉంటుంది

మూలం : My LPG.in

3.016
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు