పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంధనము అంటే

గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన శక్తి అవసరాలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట పనులు, దీపాలకు , వ్యవసాయం వంటి రంగాల్లో నేడు శక్తిని ఎక్కువగా వాడటం జరుగుతోంది.

ఇంధన శక్తి, దాని ప్రస్తుత ఉపయోగం

గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన శక్తి అవసరాలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట పనులు, దీపాలకు , వ్యవసాయం వంటి రంగాల్లో నేడు శక్తిని ఎక్కువగా వాడటం జరుగుతోంది. 75 శాతం శక్తి వనరులు వంట పనులకు , దీపాలకే వినియోగమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వంట పనులు,దీపకాంతులకి అదనంగా ఆయా లభ్యం అవుతున్న జీవపదార్థం(బయోమాస్),కిరోసిన్ వంటి ఇంధనాల ఉపయోగం ఎక్కువగా ఉంది. వ్యవసాయంలో నీరు తోడటంలో శక్తి ఎక్కువగా వినియోగమవుతుంది. ఈ పనులకు ఎక్కువగా విద్యుత్తు,డీజిల్ వంటి ఇంధన శక్తి వనరులు వాడటం జరుగుతుంది. వ్యవసాయ పనుల్లో మనుష్యులు పడే ఎంతో శ్రమకు చాలా వరకు గుర్తింపు లేకుండా పోతోంది. ఎటొచ్చీ, గ్రామాల్లో శక్తిని వాడే తీరులో చాలా తేడాలున్నాయి.

భారత దేశం లో ప్రస్తుత శక్తి వినియోగ పరిస్థితి

భారతదేశంలో 70 శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ఇంధన శక్తి వనరులు మనదేశ అభివృద్ధికి అన్నిటికన్నా కీలకం. అయినప్పటికీ 21 శాతం గ్రామాలు, 50 శాతం గ్రామీణ గృహాల్లో ఇప్పటిదాకా విద్యుత్ సౌకర్యం లేదు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తలసరి ఇంధన శక్తి వాడకంలో సైతం ఎంతో తేడా ఉంది. ఉదాహరణకి, 75 శాతం గ్రామీణ కుటుంబాలు వంట కోసం వంట చెరకునీ, 10 శాతం పిడకలనీ, కేవలం 5 శాతం వంటగ్యాస్ని వాడతాయి. అదే నాగరిక కుటుంబాలలో లేదా పట్టణాలలో 44 శాతం వంటగ్యాస్, 22 శాతం కిరసనాయిల్, ఇంకొ 22 శాతం వంట చెరకునీ వాడతారు. అలాగే, గృహాలలో దీపాల విషయానికొస్తే, 50 శాతం గ్రామీణ గృహాలలో దీపాలకు కిరొసిన్నే వాడుతుంటే, 48 శాతం విద్యుత్తును వాడుతున్నారు. ఇదే నాగరిక గృహాల విషయాని కొస్తే, 89 శాతం విద్యుత్తును, 10 శాతం కిరసనాయిల్ వాడుతున్నారు.

స్త్రీలు తమ రోజువారి ఉత్పాదక సమయంలో వంట చెరకును సమీకరించడంలోనూ, వండటంలోనూ దాదాపు 4 గంటల సమయాన్ని వెచ్చిస్తారు, పిల్లలు కూడా వంట చెరకు సమీకరించడంలో పాల్గోంటారు.

జాతీయాభివృద్ధికి శక్తి వనరుల లభ్యత ఎంతో అవసరం. మన దైనందిన జీవితంలో వంట చేయడం, శుభ్రమైన నీటిని పొందడం, వ్యవసాయం, విద్య, రవాణా, ఉపాధికల్పన, పర్యావరణ పరిరక్షణ - ఇలా అన్నిటిలోనూ ఇంధన శక్తి అనేది ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంది.

గ్రామీణ ఇంధన వనరుల శక్తి వాడకంలో దాదాపు 80 శాతం మేరకు జీవపదార్థం (బయోమాస్) నుంచే సంగ్రహించడం జరుగుతోంది. ఇది గ్రామాల్లో ఇప్పిటికే తరిగి పోతున్న పచ్చదనానికే పెనుముప్పుగా పరిణమించింది. సరైన పొయ్యిని వాడక పోవడంవల్ల స్త్రీలు, పిల్లలు వంటచెరకు సేకరించడంలో చాలా కష్టాల పాలవుతున్నారు. ఇంట్లో అలాంటి పొయ్యి వాడి వంట చేయడంలో ఉత్పన్నమయ్యే పొగవల్ల స్త్రీలకు, పిల్లలకు ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి.

ఇంధన వనరులను పొదుపు చేయడమంటే ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే కదా! ఇంధనాన్ని పొదుపు చేస్తూ మన వనరుల్ని కాపాడుకుంటూ ఉండాలన్నమాట. కుటుంబ స్థాయిలో చిన్న మొత్తాలను పొదుపు చేయడం వల్ల జాతీయ స్థాయిలో భారీగా పొదుపు అవుతుంది . ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 30 శాతం పొదుపు అవుతుందని ఒక అంచనా.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.16666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు