హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / ఇంధన వనరుల సాధారణ ప్రమాణాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంధన వనరుల సాధారణ ప్రమాణాలు

శక్తి మరియు మనము రోజువారీ జీవితంలో ఉపయోగించే శక్తి సాధారణ యూనిట్లు ఇవ్వబడ్డాయి.

ప్రతి మనిషి యొక్క అవసరాల మేరకు భూమి అన్నీ సమకూరుస్తుంది, కానీ వారి అత్యాశ మేరకు మాత్రం కాదు  - మహాత్మాగాంధీ

శక్తిని ఉత్పత్తి చేసేదానికన్నా  వేగంగా దాన్ని ఖర్చుపెడుతున్నాం.

బొగ్గు, నూనె, సహజ వాయువు వంటి - అత్యధికంగా వాడే ఇంధన వనరులు తయారవ్వాలంటే కొన్ని వేల ఏళ్ల సమయం కావాలి.

శక్తి వనరులు పరిమితం

ఇండియాలో శక్తివనరులు  ప్రపంచ శక్తివనరుల్లో 1 శాతమే  అయినా ఇండియా జనాభా  ప్రపంచ జనాభాలో 16 శాతం.

మనం వాడే శక్తిలో అధిక శాతం ఒక్క సారికే వాడగలం. పునరావృతం కాదు.

ఇంధన వాడకంలో 80 శాతం ఇంధన వినియోగ పునరుత్పాదనకాని శక్తి వనరుల నుండే జరుగుతుంది.  మనకున్న శక్తి వనరులు మరో 40 ఏళ్లల్లో  అయిపోతాయని అంచనా.

శక్తిని పొదుపు చేస్తే దేశానికెంతో ధనం ఆదా చేసిన వారమవుతాం.

మన ముడి చమురు అవసరాల్లో 75 శాతం  దిగుమతి చేసుకొంటున్నాం. దీనివల్ల ఏడాదికి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది.

శక్తిని పొదుపు చేస్తే డబ్బును పొదుపు చేసినట్టే.

మీ గ్యాస్ సిలిండర్ ఒక వారం అదనంగా వాడుకోగలిగితే లేదా మీ కరెంటు బిల్లు తక్కువయినా మీకెంత ఆదానో ఒక్కసారి ఆలోచించండి.

ఇంధనశక్తిని ఆదా చేస్తే మన ఇంధన శక్తి వనరులను  ఆదా చేసినట్టే.

వంటచెరకును సమర్ధవంతంగా వాడుకోగలిగితే మన ఇంధన అవసరాలు తగ్గుతాయి. వాటి సేకరణలో పడే కష్టం తగ్గుతుంది.

శక్తిని ఆదా చేస్తే శక్తిని ఉత్పత్తి చేసినట్టే.

ఒక యూనిట్ శక్తిని ఆదా చేస్తే, రెండు యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేసినట్టే.

శక్తిని ఆదా చేస్తే కాలుష్యాన్ని తగ్గించినట్టే.

శక్తిని ఉత్పత్తి చేయడం, వాడటం అనేది కాలుష్యానికి, 83 శాతం కన్నా అధికంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తికి దారి తీస్తుంది.

శక్తిని రేపటి అవసరాలకై కాపాడుకోవడం మన కర్తవ్యం

'ఈ భూమి, నీరు, గాలి అనేవి మనకు మన తల్లిదండ్రులిచ్చిన కానుక కాదు. మన పిల్లలనుంచి మనకు అందిన ఋణం మాత్రమే!' ఒక భారతీయ సామెత

ఇంధన వనరులను సంరక్షించడం ఒక అలవాటుగా చేసుకోండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01538461538
Jagan Jul 16, 2019 10:44 PM

Wind energies lo 4 th place

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు