హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / ఇంధనశక్తి రకములు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంధనశక్తి రకములు

శక్తి వివిధ మూలాల నుండి, వివిధ తరగని మరియు అంతంకాని తరగని శక్తి వనరులు దాని ఉపయోగాలు, ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఇక్కడ వివరించడం జరుగుతుంది.

పునరుత్పాదక శక్తి

సౌరశక్తి

సూర్యుడు

మనకు శక్తినిచ్చే ప్రాథమిక శక్తి వనరు ఏదీ అంటే అది సూర్యుడే. పగటిపూట మన గృహాలను కాంతిమయం చేసేది, మన బట్టలు, వ్యవసాయ పంటలూ ఎండడానికి తోడ్పడేది, మనలని వెచ్చగా ఉంచేదీ ఆ సూర్యరశ్మే. ఈ శక్తి స్థానం ఎంతో గొప్పది.

లాభాలు:

  • ఇది మనకు ఏడాది పొడవునా ఉచితంగా లభించే సహజ వనరు.
  • పుష్కలంగా దొరుకుతుంది.
  • కాలుష్య రహితం.

నష్టాలు :

  • ఋతువుల మార్పు,వాతావరణ మార్పుల మీద ఆధారపడింది. అందువల్ల ఎల్లవేళలా వినియోగించ లేము.
  • ప్రారంభంలో ఉత్పాదక వినియోగానికి ఎక్కువ పెట్టుబడి అవసరముంటుంది.

ఉత్పాదకతతో కూడిన సౌరశక్తి వినియోగం కోసం సాంకేతిక శాస్త్ర అధ్యయనాలు సౌరశక్తితో విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్(ఎస్.పి.వి)లను వాడటం ద్వారా సూర్యరశ్మిని నేరుగా డి.సి విద్యుత్తుగా మార్చవచ్చు. అలా తయారైన విద్యుత్తును నేరుగా వాడుకోవచ్చు. లేదా బ్యాటరీల్లో నిలువచేసుకోవచ్చు. సౌరశక్తి లభ్యంకానపుడు ఆ బ్యాటరీల్లోని విద్యుత్తు వాడుకోవచ్చు. నేడు సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ను గృహాల విద్యుత్ దీపాలకోసం, వీధి దీపాల కోసం, నీటిని తోడటం కోసం గ్రామాల్లో విజయవంతంగా వాడుతున్నారు. కొండ ప్రాంతాల్లో నీటిని వేడిచేయడం కోసం సౌరశక్తిని వాడుతున్నారు.

సౌర శక్తి గురించి పూర్తి వివరాల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

వాయు శక్తి

వీచే గాలి

వీచేగాలి అంటే గాలి భూమ్మీదా, సముద్రం మీదా సహజంగా వీచే గాలి. గాలి వీచినపుడు ఒక గాలిమరలోని బ్లేడులు తిరగడం వల్ల వాటికి కలిపి ఉన్న షాఫ్ట్ కూడా తిరుగుతుంది. పంపులో లేదా జనరేటర్లో ఈ షాఫ్ట్ కదలికలవల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీచేగాలి వల్ల ఇండియాలో 45000 మెగావాట్ల శక్తి నిఉత్పత్తి చేయగల అవకాశాలున్నాయి. ప్రపంచంలో వీచే గాలి వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియాది 5వ స్థానం. ఇండియా ప్రస్తుతం 1870 మెగావాట్లు ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ప్రేవేటు సంస్థల భాగస్వామ్యం 95 శాతం.

లాభాలు :

  • ఇది పరిసరాలకు అనుకూలం.
  • పుష్కలంగా,ఉచితంగా దొరుకుతుంది.

నష్టాలు :

  • పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది.
  • గాలి వేగం ఎల్లప్పుడు ఒకేలా ఉండదు. అందువల్ల దీని ప్రభావం విద్యుదుత్పాదన పై ఉంటుంది.

జీవపదార్థం

కిరణజన్యసంయోగ క్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని అందుకొని జీవపదార్థని (బయోమాస్ను) తయారు చేసుకొంటాయి. ఇది వివిధ దశల్లో, వివిధ రూపాల్లో శక్తి స్థావరాలుగా మారి పనికొస్తూ ఉంటుంది . ఉదాహరణకు పశువుల దాణా, పేడ (జీవఇంధనాలు)గా వినియోగిస్తారు. వ్యవసాయ వ్యర్థాలు వంట చేయడానికి పనికొస్తుంది. భారతదేశంలో వ్యవసాయ, అరణ్య అవశేషాలన్నీ కలిసి సాలుకి 120-150 మిలియన్ మెట్రిక్ టన్నుల జీవపధార్థం(బయోమాస్) ఉత్పత్తి అవుతుంది. దీన్ని సక్రమంగా వినియోగిస్తే, 16000 మెగా వాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది.

వాడకం

జీవపదార్థం(బయోమాస్) ఒక ముఖ్యమైన శక్తి వనరు. భారతదేశం మొత్తం ఇంధన వినియోగంలో దీని వాటా 30 శాతం,ఇది గ్రామీణ గృహావసరాల్లో దాదాపు 90 శాతంగా ఉంది. జీవపదార్థం(బయోమాస్ను) ఇళ్ళలో వంట చేసుకోవడానికి,వేడి చేసుకోవడానికి విస్తృతంగా వాడుతున్నారు. వ్యవసాయ వ్యర్థాలు, కొ్య్య,బొగ్గు,పిడకలు వంటివి వివిధ జీవపదార్థం(బయోమాస్) వనరులు.

లాభాలు

  • స్థానికంగా దొరుకుతుంది. కొంతమేరకు సమృద్ధిగా దొరుకుతుంది.
  • శిలాజ ఇంధనాలకంటే జీవ ఇంధనమెంతో స్వచ్చమైనది. అంతే కాకుండా కార్బన్ డైయాక్సైడ్ని అరికట్టడం వల్ల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతుంది.

నష్టాలు

  • ఇంధన సేకరణకు చాలా కష్టపడాలి
  • ఇళ్ళల్లో వంట చేసేటపుడు, గదిలో సరైన కిటికీలు లేదా వెంటిలేటర్లు లేకుంటే అది వాతావరణ కాలుష్యానికి దారి తీయవచ్చు. అది ప్రాణాపాయానికి దారి తీయవచ్చు.
  • జీవపదార్థం సక్రమ వినియోగమం లేని కారణంగా వృక్ష సంపద వినాశనానికి తద్వారా వాతావరణ కాలుష్యం జరుగుతుంది.

జీవద్రవ్య ఉత్పత్తుల వినియోగానికి సాంకేతిక అధ్యయనాలు

గ్రామీణ ప్రాంతాల్లో జీవపదార్థని సమర్ధవంతంగా వాడుకొనే వీలునిచ్చే సాంకేతిక పరికరాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి.

సమర్థవంతమైన ఇంధన వాడకాన్ని పెంచడానికి

  • మెరుగైన డిజైన్లలో లభ్యమౌతున్నపొయ్యిని వాడటంవల్ల ఎంతో సమర్ధవంతంగా పనిచేసే పొగరాని పొయ్యి కన్నా రెట్టింపు ఇంధన సామర్ధ్యాన్ని సాధించవచ్చు.
  • జీవపదార్థం(బయోమాస్) చిన్నఇటుకలుగా తయారై ఉండడం వల్ల స్థలం ఆదా కావడమే కాక మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • మృతకళేబరాలవంటి కర్బన రసాయన పదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా జీవపదార్థం గా మార్చుకోవడం వల్ల తగు ఇంధన సామర్ధ్యాన్ని పొందడమే కాక, సేంద్రీయ ఎరువులను కూడా పొందవచ్చు.
  • జీవపధార్థంను(బయోమాస్ను) పాక్షికంగా మండించి బయోగ్యాస్ గా మార్చుకోవచ్చు.

జీవ ఇంధనాలు

జీవ ఇంధనాలు బయోమాస్ ల నుంచి పరిశ్రమల్లో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఆహార పదార్థాల ఉత్పత్తులు తయారయ్యేటపుడు వచ్చే వ్యర్థాల నుంచి లేదా వంటనూనె, వనస్పతులను తిరిగి ఉప ఉత్పత్తులుగా పెట్రోలియం తయారవుతాయి. జీవ ఇంధనాల్లో పెట్రోలియం లేకపోయినా, వాటిని ఏ మోతాదుల్లోనైనా కలిపి ఒక జీవ ఇంధన మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. అలా తయారు చేసుకొన్న మిశ్రమాన్ని మన యంత్రాల్లో పెద్ద మార్పులు అవసరం లేకుండానే వాటిని డీజిల్ యంథ్రం వంటి వాటిల్లో వాడుకోవచ్చు. బయో ఇంధనాలని వాడటం సులభం, వదిలించుకోవడం సులభం, విష రహితం. దీనిలో గంధకం ఉండదు, పైగా ఇది వాసన లేనిది.

జల, భూఉష్ణ శక్తి వనరులు

జల వనరులు అనేవి మానవులకు ఉపయోగపడే లేదా మూలాధార నీటి సముదాయాలు. వ్యవసాయక, పారిశ్రామిక, గృహ, పునరుత్పాదక మరియు పర్యావరణ సంబంధిత కార్యకలాపాలు సహా నీటి వల్ల పలు ప్రయోజనాలున్నాయి. నిజానికి అన్ని రకాల మానవ అవసరాలకు స్వచ్ఛమైన నీరు అవసరం.

అన్నిటికన్నా ముఖ్యమైన వనరు నీరు దిని గురించి మరింత సమాచారం కోసం ఈ పి.డి.ఎఫ్ ను క్లిక్ చేయండి.

పారే నీరు, సముద్రపు అలలు కుడా శక్తి వనరులే. 2005లో మన విద్యుత్ సెక్టారులో 26 శాతం నీటిశక్తిని వాడటం జరిగింది. హెచ్చుస్థాయిలో పెద్ద ప్రాజెక్టులపై పెట్టుబడిపెట్టడం కూడా జరిగింది. ఇటీవల సంవత్సరాల్లో నీటి శక్తిని వాడి విద్యుదీకరణ కాని గ్రామాలకు చిన్న నీటి శక్తి ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ను అందించడం జరిగింది. ఒక చిన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కు 15000 మెగావాట్ల సామర్థ్యం ఉంది. గత 10-12 ఏళ్లలో చిన్న హైడ్రో 3 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ సామర్థ్యం 4 రెట్లు అంటే, 63 మెగావాట్లనుండి 240 మెగావాట్లకు చేరింది. 25 మెగావాట్ల సామర్థ్యం గల 420 స్టేషన్లు ఆరంభించడం జరిగింది. ఇవి మొత్తం మీద 1423 మెగావాట్ల సామర్థ్యాన్నిస్తాయి. 521 మెగావాట్ల సామర్థ్యాన్నిచ్చే మరో 187 ప్రాజెక్ట్ లు నిర్మాణంలో ఉన్నాయి.

భూఉష్ణ శక్తి

భూఉష్ణ శక్తి అంటే భూమినించి పుట్టిన ఉష్ణ శక్తి. ప్రకృతిలో ఉండే వేడి జలాలు భూఉష్ణ శక్తి వనరుల ఉనికిని సూచిస్తాయి. భారథదేశంలో అలాంటి వేడి జలాలు దాదాపు 300 ఉన్నాయి. వీటినించి వచ్చే శక్తిని వాడుకలోకి ఇంకా  తేవాల్సి ఉంది.

అణు శక్తి

ప్రతి అణువులో నిబిడీకృతమైన శక్తే అణు శక్తి. అణు సంవిలీనము (ఫ్యూజన్ ...అణువుల కలయిక), లేదా అణు విచ్ఛేదము (ఫిజ్జన్...అణువులను వీడదీయడం) ప్రక్రియలలో దేనిద్వారానైనా, అణు శక్తిని వెలికి తీయవచ్చు. అయితే, అణు విచ్చేద ప్రక్రియనే విస్తృతంగా అనుసరిస్తున్నారు.

ఆణు శక్తి ప్రధాన ముడిపదార్ధం యురేనియం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో యురేనియం ఖనిజం (గనులనుంచి తవ్వి తీసేది) లభిస్తుంది. ఈ ఖనిజంలోని ఇతర పదార్ధాలను తొలగించి, అణుధార్మిక ఐసోటోప్‌గా శుద్ధిచేసిన (ఎన్‌రిచ్‌డ్) యురేనియంను చిన్న చిన్న గుళికల (పెల్లెట్స్) రూపంలోకి మారుస్తారు. ఈ గుళికలను పొడవైన కడ్డీలలో నింపి, వాటిని అణువిద్యుత్ కేంద్రం రియాక్టర్లలో వుంచుతారు. రియాక్టర్‌లో, ఒక దాని వెంట మరొకటి అంతర్ చర్యగా (గొలుసు చర్య ) సాగే అదుపుతో కూడిన ప్రక్రియలో , ఈ యురేనియం అణువులు విచ్ఛేదం చెందుతాయి.

ప్లుటోనియం, థోరియం ఇతర అణు విచ్ఛేద పదార్ధాలు

గొలుసు చర్యగా సాగే ప్రక్రియలో, విచ్ఛేదంచెందిన ఒక అణువు శకలాలు , మరో యురేనియం అణువును ఢీకొని , దానిని విచ్ఛిన్నం చేస్తాయి. ఇలా, ఒకదానివెంట మరొకటిగా అన్ని అణువులు విచ్ఛిన్నమవుతాయి. అణు విచ్ఛేదం మరీ వేగంగా జరగకుండా క్రమబద్ధం చేయడంకోసం , అణు విద్యుత్ కేంద్రాలలో అదుపుచేయగలిగే కడ్డీలను ( కంట్రోల్ రాడ్స్ ) ఉపయోగిస్తారు. అందుకే, వీటిని మోడరేటర్లు (సమన్వయ సాధనాలు) అంటారు.

ఈ గొలుసు చర్యలో ఉష్ణశక్తి వెలువడుతుంది. రియాక్టర్‌లో అణు ఇంధన పదార్థాలను వుంచే అరలోని (న్యూక్లియర్ కోర్) భార జలాన్ని వేడిచేయడానికి ఈ ఉష్ణశక్తిని ఉపయోగిస్తారు. అంటే, ఉష్ణశక్తి కోసం వేరే ఇంధనాన్ని మండించడానికి బదులుగా, అణు విద్యుత్ కేంద్రాలు గొలుసు చర్యలో విడుదలయ్యే శక్తిని ఉపయోగించుకుని, అణు శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తాయి. న్యూక్లియర్ కోర్‌లో వేడెక్కిన భార జలాన్ని అణు విద్యుత్ కేంద్రంలోని మరొక విభాగానికి పంపుతారు. ఈ భారజలం అక్కడ నీటితోనిండిన గొట్టాలను వేడెక్కించి, నీటి ఆవిరి వెలువడేలా చేస్తుంది. ఈ రెండవ విభాగంలోని గొట్టాలనుంచి వెలువడే నీటి ఆవిరి , టర్బైన్ తిరగడానికి తోడ్పడి, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

అణుశక్తి అనుకూల, ప్రతికూలాలు

అణు విద్యుత్ ఉత్పత్తి ప్రయోజనాలు

  • అణు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ (సి ఓ2) చాలా తక్కువ పరిమాణంలో వెలువడుతుంది . అందువల్ల భూగోళం వేడెక్కడంలో (గ్లోబల్ వార్మింగ్)  అణు విద్యుత్ కేంద్రాల పాత్ర చాలా స్వల్పమన్నమాట.
  • కేవలం ఒక విద్యుత్ కేంద్రంలో కూడా, చాలా ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది

అణు విద్యుత్ ఉత్పత్తి లో ఇబ్బందులు

  • అణుధార్మిక వ్యర్ధ పదార్ధాన్ని నిరుపయోగకరంగా పారవేయడం ఇంకా సమస్యగానే వుంది
  • ఎంతో అపాయకరమైన ప్రక్రియ. ప్రమాదం జరిగితే , నష్టం తీవ్రంగా వుంటుంది.
  • ముడిపదార్థమైన యురేనియానికి ఎంతో కొరత వుంది. దాని వాస్తవిక అవసరం దృష్ట్యా చూస్తే, యురేనియం నిల్వలు ఇక 30-60 సంవత్సరాలకు మించి రాకపోవచ్చు.

ఆధారము: edugreen.teri.res.in

పునరుత్పాదక ఇంధన శక్తి

అణు రియాక్టర్లు గుండెల పై కుమ్పట్లనీ అణు విద్యుత్తు చౌక కాదని అణు ధూళిప్రమాదకరమని అన్నాం. నిజమే మనకు సంప్రదాయ ఇంధనాలున్నాయి అవే బొగ్గు, ఖనిజ తైలం, సహజ వాయువు. వీటి వల్ల విద్యుత్తు ను తయారు చేసుకొంటూనే ఉన్నాం. జల విద్యుత్తు సరే సరి. అయితే చాలా కాలం గా జలాశయాలు కళ తప్పాయి. అందులోంచి వచ్చే విద్యుత్తు బోటా బోటీ గా ఉంది. తెర్మల్ విద్యుత్తుకు ఫాక్టరీలు పని చేసే గంటలకు కరెంట్ సప్ప్లై ఉండాలి. అంత సేపు విద్యుత్తు ఇచ్చే దమ్ము మనకు లేదు. ఇటీవలి కాలం లో రోజుకు నాలుగు గంటలు కూడా రైతులకు ఇవ్వ లేక ప్రభుత్వం చేతు లేత్తేసింది. ఇక ఫాక్టరీల గోడు వినే దేవడు? కేంద్రం కూడా ఏమీ చేయలేక ”మీ ఎడుపేదో మీరేడవండి మాకు చెప్పకండి” అనే స్తితిలోకి వచ్చింది. ఈ మధ్యనే భారత దేశపు అన్ని రాష్ట్రాలూ చీకటిలో మగ్గిపోయిన సంఘటన మనకు తెలిసిందే.

మన రాష్ట్రం సంగతి అంతా ”దైవాదీనం మోటారు సర్వీసు” లా ఉంది. ఇది వరకు ప్రజలు ”అన్నమో రామ చంద్రా” అనే వారు. ఇప్పుడు ”కరెంటోక (కి)రుణ కుమారా!” అంటున్నారు. వసతులు పెంచుకోన్నాం. వాడకం పెరిగింది. యంత్రాలు పెరిగాయి. సుఖాలు పెరిగాయి. వీటన్నిటికి కావలసిన విద్యుత్తు ఉత్పత్తి కావటం లేదు. ఇదేదో మన సమస్య మాత్రమె కాదు ప్రపంచం లో చాలా దేశాల పరిస్తితి ఇంతే. ఉన్న బొగ్గు అంతా తవ్వి తీసేస్తున్నాం. దీనికి తోడు పర్మిషన్ తీసుకొన్న దాని కంటే ఎక్కువ బొగ్గు తవ్వి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కళ్ళు కప్పి విదేశాలకు ఎగు మతి చేసి బిలియనీర్లై ”నల్లచక్రవర్తులై” మన ముందే పళ్ళు ఇకిలిస్తున్న వారిని చూస్తున్నాం. అట్లాగే దొంగ విద్యుత్  వాడకం దారులను అరి కట్ట లేక పోతున్నాం.

సహజ వాయువు పై అనేక ఆంక్షలు ఉన్నాయి. అదీ ప్రైవేట్ పరమై శూన్యం అయింది. ఈ సమస్యలకు పరిష్కారం తెలీక ఇంజినీర్లు శాస్త్ర వేత్తలు తల పట్టు కుంటున్నారు. ఈ సహజ వనరులన్నీ ఖాళీ చేస్తే మళ్ళీ కొత్త వాటిని మనం సృష్టించలేము. ఇవి పునరుత్పాదకాలు కావు. అందుకని పునరుత్పాదక లేక  సాంప్ర దాయేతర  ఇంధనాల పై దృష్టి సారించారు. అందులో సోలార్ ఎనర్జీ, తరంగశ, గాలి మరలు, భూగర్బ్ఘ విద్యుత్తు వంటివి అనేకం ఉన్నాయి. వీటి పై సరిగ్గా దృష్టి పెడితే అవన్నీ తరగని సంపద లా మన అవసరాలను తీరుస్తాయి. వాటిని గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం.

గాలి శక్తి (విండ్ పవర్)

గాలి మరల నుండి శక్తిని యూరప్ లో చాలా దేశాలు తయారు చేసి వినియోగించుకొంతున్నాయి. ఈ శక్తి కాలుష్య రహితం. ఆర్ధికం గా బాగా గిట్టు బాట వు తుంది. ఇది చాలా సాధారణ టెక్నాలజీ తో పని చేయటం ఒక ఆకర్షణ. సంక్లిష్ట న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం కంటే బాగా గాలి వీచే ప్రాంతా లలో వీటిని నేల కొల్పటం తేలిక. ఖర్చు బాగా కలిసి వస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం 2000 వ సంవత్సరం లో వాడిన మొత్తం విద్యుత్తు కంటే నలభై రెట్లు అధిక విద్యుత్తు అంటే సుమారు 72టెర్రా వాట్ల విద్యుత్తు అన్ని ఖండాల  లోని 8000గాలి మరల వల్ల  లభించి రికార్డు సాధించింది. ఇది ఇరవై శాతం. దీనినే మనం సాధించ గలిగాము అంటే, ప్రపంచం మొత్తానికి కావలసిన శక్తిని సాధించ గలం అనే నమ్మకం కలుగు తోంది అంటారు శాస్త్ర వేత్తలు ఒక టెర్రా వాట్ విద్యుత్తు 100 వాట్ల బల్బులను 10 బిలియన్ లను వెలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ శక్తి వనరులు యూరప్ లోని ఉత్తర సముద్ర ప్రాంతంలో, అమెరికా లోని గ్రేట్ లేక్స్ ప్రాంతం లో దక్షిణ అమెరికా దక్షిణ భాగంలోను ఉన్నాయి. గాలి వల్ల వచ్చే విద్యుత్తు ఏటా 34% పెరుగు తోందని లెక్క వేశారు. గత పదేళ్లుగా దీని ఉత్పాదన వేగ వంత మైంది. అయితే ప్రపంచ విద్యుత్తుతో పోలిస్తే ఇది ఒక అర శాతమే ఉంది.

1970 లో ఆయిల్ సంక్షోభం వచ్చిన సంగతి మనకు తెలుసు. అప్పుడు డెన్మార్కు దేశం గాలి శక్తిని ఉపయోగించే ప్రక్రియను ఉధృతం చేసింది. 1988 చేర్నోబిల్ ప్రమాదం తర్వాత, ఆ ప్రభుత్వ న్యూక్లియర్ పవర్ ప్లాంటులను నిర్మించ రాదనీ చట్టం చేసింది. ఇప్పుడు డెన్మార్క్ నాలుగవ జెనెరేషన్ విండ్ టర్బైన్లను నిర్మించి అందరికి ఆదర్శవంతంగా ఉంది. దీని టెక్నాలజీ బాగా తెలిసిన దేశంగా గుర్తింపు పొందింది. అక్కడి ఒక పౌరుడు ”I wanted my children to have five fingers., we made a choice-no nucear energy”. అని స్పష్టంగా చెప్పాడట. ఇంకో విషాదకర విషయం ఏమి టంటే డెన్మార్కు లోని ఆహారపదార్ధాలలో ఇంకా రేడియో ధార్మికత ఉందిట. పాతిక సంవత్సరాలైనప్పటికీ ఆ రేడియో ఆక్టివ్ దెయ్యం వదలక పీడిస్తూనే ఉంది పాపం.

అమెరికా లో విండ్ పవర్ బాగా ప్రాచుర్యం లో ఉంది. రాకీ పర్పర్వతాలు మిస్సి సిపి మధ్య ఉన్న భాగాన్ని ”soudi arebia of the wind” అని ముద్దు గా పిలుస్తారు. ఈ ప్రయరీ ప్రదేశం లో గాలులు ధారాళం గా, నిరంతరం గా వీచటమే దీనికి కారణం. టెక్సాస్, కాన్సాస్, నార్త్ డకోటా కలిసి అమెరికా కు కావలసిన విద్యుత్తు ను నూటికి నూరు శాతం అందించ గలవు. అయితే గ్రేట్ లేక్స్, ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో ఇంకా విండ్ పవర్ ను టాప్ చేయటం తక్కువ గానే ఉంది. 1990 నుండి మిన్నే సోటా  రాష్ట్రం లో వందలాది గాలి టర్బైన్లు పని చేసి పవర్ తయారు చేసి రైతులకు బాగా అందిస్తున్నాయి. పెద్ద పెద్ద కార్పో రేషన్లు రైతులకు రెండు వేల నుంచి అయిదు వేల దాలర్లవరకు ధన సహాయం చేసి వింద మిల్స్ ను ఏర్పరుస్తున్నాయి. కొందరు రైతులు తామే వీటిని తయారు చేసుకొని ఉప యోగించటం ఒక ముందడుగే. విండ్ టర్బైన్లున్న వ్యవ సాయ క్షేత్రాలను ”combines in the sky” అని పిలుస్తారు. దీని వల్ల  పంటలు బాగా పండుతున్నాయి కాలుష్యం దూర మైంది. అందుకే దీన్ని ”గ్రీన్ ఎనర్జి” అంటారు. అయితే వీటి వల్ల  తయారయ్యే విద్యుత్తు గ్రిడ్ లకు చేరాలంటే కష్టం గా ఉంది. గ్రిడ్లు వీటికి చాలా దూరం లో ఉంటున్నాయి. ఇంకో శుభ వార్త ఏమిటంటే, జాన్ డీన్ కా ర్పోరేషన్ దీనికి కావలసిన పెట్టు బడి పెట్ట టానికి సిద్ధం గా ఉంది. దీనితో నాణ్యమైన శుద్ధ విద్యుత్ లభిస్తుంది.

చైనా దేశం లో విద్యుత్ వాడకం ఎక్కువే. దీని కోసం విండ్ పవర్ ను ఉప యోగిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తోంది. ”huitengxile” అనే మంగోలియా ప్రాంతం లో 68 మెగా వాట్ పవర్ ల  విండ్ ఫారం ను ఏర్పాటు చేశారు. ఇది 2008 నాటికి 400మెగా వాట్ల ను తయారు చేసింది. జన సంఖ్య బాగా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో వీటి సంఖ్యను బాగా పెంచింది. ఆ దేశం లో బొగ్గు నిల్వలు చాలా ఎక్కువ గా ఉండటం తో దాని వల్ల  ఉత్పత్తి అయ్యే విద్యుత్తు202౦ నాటికి 20 000మెగా వాట్ల కు చేరి అవసరాలు తీరుతాయని భావిస్తున్నారు. విండ్ పవర్ తయారు చేసే వారికి పన్ను రాయితీ లను ప్రభుత్వం కల్పిస్తోంది. సాంప్రదాయేతర ఇంధనాల నుండి  వచ్చే విద్యుత్తు ను కోనా లను కొన్న రాష్ట్రాలకు ఆర్ధిక సాయం చేస్తోంది.

సౌర శక్తి (సోలార్ ఎనేర్జి)

ఇరవై ట్రిలియన్ వాట్ల విద్యుత్తు ను ఫోటో వోల్టాయిక్ సేల్స్ నుండి తయారు చేస్తున్నారు. అయితే ఇది ఇంకా అభి వృద్ధి చెందటానికి కావలసిన యంత్ర సామగ్రి అందరికి అందు బాటు లో లేదు. వీటి వాళ్ళ నాన్య మైన విద్యుత్తే వస్తోంది. ఆ సెల్లుల జీవిత కాలం ముప్ఫై ఏళ్ళు మాత్రమే. ఇది తయారు చేసే విద్యుత్తు వల్ల  98 శాతం కాలుష్య రహితం, ఆరోగ్య కరం. వీటిని అమర్చ టానికి తగిన ప్రదేశం కావాలి అదే దీని తో వచ్చిన చిక్కు. అంతే కాక దీని పై తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అందుబాటు లోకి పూర్తిగా రాలేదు. అమెరికా లోని సిలికాన్ వాలీ లో ”క్లీన్ టేక్” పేరుతో సోలార్ శక్తిని నీటి శుద్ధికి, ఇతర ఆటోమోటివ్ ఇంధనాలను వాడుతున్నారు. ఇది ఒక గొప్ప బై ప్రాడక్ట్ గా భావిస్తున్నారక్కడ. వీటికోసం ప్రభుత్వాలు సబ్సిదీ లనిస్తున్నాయి.

మూడు లక్షల ఇళ్ళ లో సౌర శక్తిని విని యోగిస్తున్నారని అంచనా. వాటి సామగ్రి 500 మిలియన్ డాలర్ల అమ్మకం చేసింది. ఇది గతం కంటే 28% ఎక్కువట. అయినా  దీన్ని నేల కొల్పతా నికి ఖర్చు చాలా అవుతోంది. అమెరికా లోని న్యుజెర్సి లో దీనికి 50 వేల డాలర్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రతి వాట్కు అయిదున్నర డాలర్లు ఇస్తుంది. ఇది ముప్ఫై అయిదు వేలు అవుతుంది. మిగిలిన పది హీను వేల డాలర్లను బిల్లులు కట్టి తీర్చుకొంటారు.

ఇప్పుడు జెర్మని కధ తెలుసుకొందాం. 2025 నాటికి జెర్మని న్యూక్లియర్ పవర్ కు స్వస్తి చెప్పాలని నిర్ణ యించు కొన్నది. కనుక ఇతర శక్తి వనరుల పై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఎనిమిది శాతం విద్యుత్తు  ను విండ్ పవర్ తో సాధించింది. 2050 కి తన అవసరాలకు సరి పడ ప్రత్యా మ్నాయ ఇంధన శక్తిని విని యోగించాలి తీర్మానించుకొంది. అప్పటికి కార్బన ఉద్గారాలను అయిదు శాతం మాత్రమే ఉండేట్లుచేసుకొనే ఆలోచన లో ఉంది. ఇంగ్లాండ్ కూడా ఇదే ధోరణి లో ఆలోచిస్తోంది. 2005 లో అమెరికా ఆఫ్గనిస్తాన్ ఇరాక్ యుద్ధాల కోసం 50 బిలియన్ డాలర్లను కేటాయించింది. దీనికి కారణం ఆయిల్ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవటమే. ఆయిల్ ను విపరీతంగ వాడటం  వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని ఆ డబ్బు లో సగ మైనా విండ్ పవర్, సోలార్ పవర్ మీద పెట్టు బడి పెడితే జనానికి భద్రత, ఆర్ధిక వెసులు బాటు కలుగు తుందని నిపుణుల అభి ప్రాయం.

ఆధారము: సరస భారతి వుయ్యూరు.కామ్

పునరుత్పత్తి కాని వనరులు

బొగ్గు, నూనె, సహజ వాయువు వీటన్నిటినీ ఒక్కసారే వాడగలం. ఇవి వేలాది ఏళ్ల క్రితం జీవించి అంతరించిపోయిన చెట్లు మొదలైన వాటినుంచి భూగర్భంలో ఏర్పడిన శిలాజ ఇంధనాలు. ప్రస్తుతం అత్యధికంగా వాడుతున్న ఇంధన వనరులివే. ప్రపంచ బొగ్గు నిల్వలో 7 శాతం భారథదేశంలో ఉంది. దేశంలోని ఇంధనావసరాల్లో 50 శాతంపైగా బొగ్గువల్లే తీరుతోంది. దేశంలో సాలుకు 114 మిలియన్ టన్నుల నూనె అవసరమౌతోంది. దానిలో 75 శాతం దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఐతే,శిలాజ ఇంధనాలు వాడటం వల్ల అధిక మొత్తం లో వాతావరణం కాలుష్యం అవుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.06106870229
vutukuru nageswara rao Apr 01, 2015 01:17 PM

శక్తీ వనరులు వ్యాసం చాల బాగుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు