బయోగ్యాస్
పునరావృతమయ్యే శక్తి వనరులలో బయోగ్యాస్ ఒకటి. దీనిని ఇంటి కొరకు, వ్యవసాయానికి వినియోగించుకోవచ్చును.
- Contents
బయోగ్యాస్ (జీవ సంబంధిత వాయువు)
పునరావృతమయ్యే శక్తి వనరులలో బయోగ్యాస్ ఒకటి. దీనిని ఇంటి కొరకు, వ్యవసాయానికి వినియోగించుకోవచ్చును.
బయోగ్యాస్ అంటే ఏమిటి?
ఇది ప్రధానంగా హైడ్రో కార్బన్‌ను కల్గి , మండే స్వభావం కలిగి ఉంటుంది. బయోగ్యాస్ మండేటప్పుడు వేడిమిని, శక్తిని ఇస్తుంది. జీవ రసాయన విధానం ద్వారా జీవ సంబంధిత వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయన పద్దతిలో ఒక రకమైన బ్యాక్టీరియాలు జీవ సంబంధిత వ్యర్ధాలను ఉపయోగ పడే వాయువుగా మార్చుతాయి. జీవ శాస్త్ర పద్ధతి ద్వారా పుట్టిన ఉపయోగపడే వాయువే జీవసంబంధిత వాయువు (బయోగ్యాస్) గా చెప్పడమౌతుంది. బయో గ్యాస్ లో ప్రధానమైన భాగం మీథేన్ వాయువు.
బయోగ్యాస్ ఉత్పత్తి విధానం
రెండు దశలలో సహజంగా ఎనరోబిక్ (ఆక్సీజన్ అవసరంలేకుండా శ్వాసించే) పద్ధ తిలో బయోగ్యాస్ ఉత్పత్తి విధానంలో జరుగుతుంది. ఇవి ఆమ్లం , మీథేన్ ఏర్పడే దశలుగా ఉంటాయి. ఆమ్లం ఏర్పడే దశలో ఆమ్లాన్ని ఏర్పరచే బ్యాక్టీరియా సమూహం పేడలో ఉంటుంది. ఇది వ్యర్ధ పదార్ధాలలో ఉండే సంశ్లిష్ట సేంద్రియ సమూహలతో చర్య జరపడంతో జీవ సంబంధిత పదార్ధము తగ్గుతుంది. ఈ దశలో సేంద్రియ ఆమ్లాలు ప్రధాన ఉత్పాదకాలుగా ఏర్పడతాయి. దీనినే ఆమ్లం ఏర్పడేదశ అంటారు. రెండవ దశలో, మిథనో జెనిక్ బ్యాక్టీరియా సమూహాలు సేంద్రియ ఆమ్లాల పై ప్రభావం చూపి మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి.
బయో గ్యాస్ ఉత్పత్తి కొరకు ముడి పదార్ధాలు
- పరిసరాలకు అనుకూలమైన ఇంధనం.
- బయోగ్యాస్ ఉత్పత్తికి కావలసిన ముడిపదార్ధాలు గ్రామాలలో విస్తారంగా అందు బాటులో ఉన్నాయి.
- బయో గ్యాస్ ఉత్పత్తి మాత్రమే కాక పంటల ఉత్పత్తికి ఉపయోగపడే సమృద్ధిగాగల పోషక ద్రవ మిశ్రణము కూడ ఇస్తుంది.
- అతి తక్కువగా గాలి, వెలుతురు ప్రసారమయ్యే (వెంటిలేషన్ ) గ్రామీణ ఇండ్లలో వంట కొరకు వినియోగించే పిడకలు, కట్టెలను మండించడం వలన వచ్చే పొగద్వారా ఆరోగ్యానికి హానీ కల్గించె విధానం నుంచి బయోగ్యాస్ వాడకం నిరోధిస్తుంది.
- ఈగలను, కీటకాలను ఆకర్షించి అంటు వ్యాధులను కల్గించే పరిసరాలలో కుప్పలుగా ఉండే పేడ, లేదా ఇతర వ్యర్ధ పదార్ధాలు లేకుండా చేసి పరిసరాల శుభ్రతకు ఇది స హాయ పడుతుంది.
- కట్టెల వాడకం తగ్గి, బయోగ్యాస్ అందుబాటులో ఉండడంతో చెట్లుకూడ రక్షింప బడతాయి.
బయోగ్యాస్ ఉత్పత్తి స్థాపనల్లో అంశీభూతాలు
ఇందులో రెండు ప్రధానమైన నమూనాలున్నాయి. స్థిరంగా గుమ్మటం (గుండ్రటి కప్పు)లా ఉండే రకం, అస్థిరమైన స్టూపాకరపు రకం.
పై రెండు నమూనాలకు కింది అంశీభూతాలుంటాయి.
- డైజిస్టర్ (పులియబెట్టే పాత్ర) : ఇది పులియబెట్టే తొట్టె. ఇది పాక్షికంగాలేదా పూర్తిగా భూగర్భంలో ఉంటుంది. ఇది సామాన్యంగా స్థూపాకరంలో ఉంటుంది. ఇటుకలు సిమెంటు మోర్టారుల (రాళ్ళను ఇటుకను అతకాడినికి ఉపయోగించే సున్నం, ఇసుక, నీరు మిశ్రణం) తో తయారవుతుంది.
- వాయువును పట్తుకునే పాత్ర : డైజిస్టర్ నుంచి విడుదలైన వాయువును పట్టుకునే సాధనం. బయోగ్యాస్ ఉత్పత్తి స్థాపన వర్గీకరణ ననుసరించి స్థిరంగా గుమ్మటం (గుండ్రటి కప్పు) లా ఉండే రకం, అస్థిరమైన (తేలియాడే) స్ధూపాకారపు రకంగా ఉంటుంది. ఈ వాయు సంగ్రహణ పాత్రకు పై భాగంనుంచి గ్యాస్ బర్నర్ వరకు లేదా ఇతర ప్రయోజనాలకు తగిన గొట్టాలను అనుసంధానం చేయడం.
- ద్రవ మిశ్రణ తొట్టె : డైజిస్టర్ లోపలి గొట్టం ద్వారా ఈ తొట్టె లోగల పేడ, నీరు మిశ్రణను పంపిస్తారు.
- వెలుపలి తొట్టె మరియు ద్రవమిశ్రణ గొయ్యిః స్థిరంగా ఉంచబడిన గుమ్మటం రకపు బయోగ్యాస్ స్థాపనకు సామాన్యంగా ద్రవ మిశ్రణ గోతి నుంచి గాని వ్యవసాయంలోగల ద్రవ మిశ్రణంగాని చేరడానికి వెలుపలి తొట్టె అందజేస్తుంది. రెండవరకపు అస్థిరమైన స్థూపాకారపు స్థాపనలో గోతినుంచి ప్రత్యక్ష పద్ధతుల ద్వారా పొలంలో పొడిగా ఉండే మిశ్రణాన్ని తీసుకుంటుంది.
బయోగ్యాస్ స్థాపన నిర్మాణానికి పరిగణించవలసిన అంశాలు
స్థల ఎంపిక : బయోగ్యాస్ స్థాపనకు అనుసరించవలసిన ముఖ్యాంశాలుః
- చుట్టు పక్కల నీరు నిల్వలేకుండా చేయడానికి ఉన్న స్థలం బాగా ఎత్తుగా ఉండి, చదునుగా ఉండేటట్లు చూడాలి.
- నేల వదులుగా ఉండకూడదు. 2కిలో గ్రాములు/సెంటీమీటరు దృఢత్వాన్ని కల్గి ఉండాలి.
- దేని వినియోగానికి బయోగ్యాస్‌ను వాడతామో దానికి దగ్గరగా జీవ సంబంధిత వాయు స్థాపనా స్థలం ( ఉదాహరణకు ఇంటి కొరకులేదా పొలానికి) ఉండాలి.
- పశువులశాలకు/ ముడి పదార్ధాలను సులభంగా తీసుకోవడానికి కూడా ఇది దగ్గరగా ఉండాలి.
- నేలలోగాని, చట్రంలోగాని నీరుపడే మట్టం-జలఉన్న మట్టం( వాటర్ టేబుల్) చాలా ఎత్తులో ఉండకూడదు.
- సరిపడినంత నీటిసరఫరా బయోగ్యాస్ స్థాపనా స్థలానికి అందాలి.
- రోజు మొత్తంలో ఎక్కువ భాగం సూర్యరశ్మి బాగా తగిలేటట్లు ఉండాలి.
- స్థాపనా స్థలానికి గాలిప్రసారం బాగుండాలి.
- ఏదైనా గోడ లేదా పునాది (నిర్మాణానికి), బయోగ్యాస్ స్థాపనకు మధ్య కనీసం 1.5 మీటర్ల దూరం ఉండాలి.
- ఏ చెట్టు యొక్క వేరు జోక్యం లేనంత దూరంగా ఉండాలి.
- మంచి నీటికి ఉపయోగపడే బావికి ఈనిర్మాణం కనీసం 15మీటర్ల దూరంలో ఉండాలి.
- అందుబాటులో గల ముడి (కావలసిన) పదార్ధాలుః అందుబాటులో గల ముడి (కావలసిన) పదార్ధాలనుబట్టి బయోగ్యాస్‌ని ఉత్పత్తిచేసే నిర్మాణ పరిమాణం నిర్ణయింప బడుతుంది. సరాసరిగా పశువుల పేడ రోజుకి 10 కిలోగ్రాములు ఉంటుంది. ఉదాహరణకు కిలోగ్రాము తాజాపేడకు 40లీటర్ల వాయువు సరాసరిగా ఉత్పత్తి అవుతుంది.మొత్తం పేడకు 3మి క్యూబ్‌ల బయోగ్యాస్ ఉత్పత్తి 75 కిలోగ్రాములు = 3/0.04 అవుతుంది. బయోగ్యాస్ ఉత్పత్తికి కావలసిన ఆవుపేడకొరకు కనీసం 4 ఆవులు అవసరమౌతాయి.
వినియోగ వనరులు
అత్యధిక బయోగ్యాస్ ఉత్పత్తికి భిన్నమైన సరఫరా నిల్వలు
వరుస సంఖ్య |
సరఫ రా నిల్వలు |
పొడి ద్రవ్యం |
మీథేన్ ఉండే |
1 |
పేడ |
350* |
60 |
2 |
మూత్రపురీషాలు |
400 |
65 |
3 |
పెంపుడుపక్షుల(కోళ్ళు,బాతుల) ఎరువు |
440 |
65 |
4 |
ఎండిన ఆకులు |
450 |
44 |
5 |
చెరకు పిప్పి |
750 |
45 |
6 |
మొక్కజొన్న చొప్ప |
800 |
46 |
7 |
ఎండుగడ్డి పొడి |
930 |
46 |
*40లీటర్లు/కిలోకి సరాసరి వాయువు ఉత్పత్తికి బయోగ్యాస్ స్థాపనలో ఉష్ణోగ్రతను నియంత్రణం చేయకుండా తాజా పేడ కొరకు తీసుకోవాలి. ఒక క్యూ.మి.గ్యాస్, 1000లీటర్లకు సమానం.
సరాసరి పేడనిచ్చేవి
వరుస సంఖ్య |
జీవజాలాలు |
పేడ పరిమాణం/మూత్రపురీషాల ఉత్పత్తి(కిలో/రోజుకి |
1 |
ఆవు, ఆవు పెయ్య |
10.0 |
2 |
ఎద్దు |
14.0 |
3 |
గేదె(బర్రె) |
15.0 |
4 |
చిన్నదైన ఎద్దు వంటి జంతువు |
5.0 |
5 |
గుర్రం |
14.0 |
6 |
గుర్రపు పిల్ల |
6.0 |
7 |
పందులు, తూకంలో 8కన్నా ఎక్కువ బరువు |
2.5 |
8 |
పందులు, తూకంలో8కన్నా తక్కువ బరువు |
1.0 |
9 |
ఆడ గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు |
1.0 |
10 |
గొర్రె పిల్లలు |
0.5 |
11 |
బాతు |
0.1 |
12 |
10కోళ్ళు |
0.4 |
13 |
మానవులు |
0.4 |
గమనికః స్వేచ్చగా గడ్డినిమేసే జంతువుల యొక్కఅందుబాటులోగల 50శాతం పేడను లెక్కించి ఇచ్చిన పట్టిక వివరాలు
వివిధ పరిమాణములలో ఉండే బయోగ్యాస్ స్థాపనలలో బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి కావలసిన పశువుల సంఖ్య
బయోగ్యాస్ పరిమాణం మీటరుక్యూబ్లలో |
అవసరమగు పశువుల కనీస సంఖ్య |
2 |
3 |
3 |
4 |
4 |
6 |
6 |
10 |
8 |
15 |
25 |
45 |
సామాన్యంగా వినియోగించే ఇంధనాల కెలోరిఫిక్ విలువ
సామాన్యంగా వినియోగించేఇంధనాలు |
కిలోకేలరీలలో కేలోరిఫిక్విలువ |
ఉష్ణతా సామర్ధ్యం |
బయోగ్యాస్ |
4713/మీ ||క్యూబ్ |
60శాతం |
పిడకలు |
2093/కిలోగ్రాములు |
11శాతం |
కట్టెలు |
4978/కిలోగ్రాములు |
17.3శాతం |
డీజిల్( హెచ్ ఎస్ డి) |
10550కిలోగ్రాములు |
66శాతం |
కిరసనాయిలు |
10850/కిలోగ్రాములు |
50శాతం |
పెట్రోలు |
11100/కిలోగ్రాములు |
--------- |
బయోగ్యాస్ అవసరాలు
వరుస సంఖ్య |
వినియోగము |
కావలసిన పరిమాణం |
1 |
వంటకు |
336-430 1/రోజుకి/వ్యక్తికి |
2 |
గ్యాస్ పొయ్యి |
330 1/గంటకు/5సెం||మీ|| బర్నర్ |
|
|
470 1/గంటకు /10సె||మీ||బర్నర్ |
3 |
బర్నర్ గ్యాస్ |
126 1/దీపపు కాంతి100వాట్ దీపం ఫిలమెంటుకు సరిసమానం |
4 |
డ్యుయల్ ఫ్యుయల్ |
425 1/హెచ్ పి/గంటకు |
అస్థిరపు-(తేలియాడే) స్థూపాకారపు(డ్రమ్) స్థాపన కొరకు చేయవలసినవి, చేయకూడనివి.
స్తూపాకారపు డ్రమ్ము కొరకు చేయవలసినవి చేయకూడనివి ఏమిటో, గోబర్ గ్యాస్ ప్లాంట్ బహిరంగ ప్రదేశం లో నిర్మించాలి. దీనికి సూర్యరశ్మి తగిలేలా ఉండాలి. ఇంకా దీని గురించిన సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శక్తి - సురభి - గృహావసరాలకనువైన బయో- గ్యాస్ పరిశ్రమ
శక్తి – సురభి వంట యింటి వ్యర్ధాలతో తయారు చేసే బయోగ్యాస్ పరిశ్రమ. సాంప్రదాయ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం అనుసరించే సిద్ధాంతాలపై ఆధారపడే ఈ పరిశ్రమ కూడ పని చేస్తుంది కాని పట్టణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయబడింది. ఈ ఉపకరణంలో, వ్యర్ధాలను లోపలికి పంపే గొట్టం, మరగించే పాత్ర, గ్యాస్ (వాయువు) ను నిలువ చేసే పాత్ర, నీటితో చల్లబరిచే యంత్రభాగం, గ్యాస్ ను విడుదల చేసే వ్యవస్ధ మరియు బయటకి పంపే గొట్టం ఉంటాయి. ఈ వ్యవస్ధ వివేకానంద కేంద్ర, ప్రకృతి వనరుల అభివృద్ధి సంస్ధ, కన్యాకుమారి, తమిళనాడు వారిచే అభివృద్ధి పరచబడింది.
సంప్రదాయబద్ధమైన బయో- గ్యాస్ ప్లాంట్ల కంటే, ఇది ఏ విధంగా ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా భావించబడుతోంది?
- సాంప్రదాయ యూనిట్లలో పశువుల పేడ ఒక ముఖ్యమైన ముడి సరుకు. అందువలన దానిని రోజూ ద్రవరూపంలోకి మార్చి గ్యాస్ తొట్టె లోనికి పోయాలి. కాని శక్తి - సురభికి పశువుల పేడ ప్రారంభ సమయంలో మాత్రమే అవసరం. తరువాత, వంట యింటి మరియు యితరములైన వ్యర్ధాలు - మిగిలిపోయిన వంట పదార్ధాలు ( శాకాహారం మరియు మాంసాహారం), కూరగాయలు తొక్కలు, పిండి మరలలో మిగిలిపోయే పదార్ధాలు, ఆహారంలో వినియోగించని నూనె గింజల వ్యర్ధాలు ( వేప, జట్రోపా మొదలైనవి) మాత్రమే కావలసిన గ్యాస్ ను ఉత్పత్తి చేయడానికి సరిపోతాయి.
- ఈ యూనిట్లు రెండు ఆకర్షణీయమైన రంగులలో, 500 లీటర్ల నుండి 1500 లీటర్ల సామర్ధ్యంతో లభిస్తాయి.
- దీనిని ఏర్పాటు చేయడం లేక స్ధాన మార్పిడి చేయడం సులభం. దీనిని విడిగా ఉండే ఇండ్లలో, పెరటిలో స్ధాపించవచ్చు. అదే ఫ్లాట్లలోనైతే, టెర్రస్ మీద కాని లేక సన్ - షేడ్ మీద కాని ఏర్పాటు చేసుకోవచ్చు.
- యూనిట్లోకి సరఫరా చేయవలసిన పదార్ధాలు
నిర్వర్తన
- ఒక క్యూబిక్ మీటరు ప్లాంట్ కి సుమారు 5 కేజీల వ్యర్ధాలు అవసరం. ఇది 0.43 కేజీల ఎల్ పిజి తో సమానం. వంద క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్, 5 కిలోవాట్ల శక్తి ని ఉత్పత్తి చేసి, ఒక గృహం యొక్క 20 గంటల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అంచనా.
- ఈ ప్రక్రియ పరిశుభ్రమైనది. దుర్వాసన రహితమైనది. మరియు ఈగలను దరిచేరనీయదు.
- వాతావరణ మార్పుల ప్రభావాలను నియంత్రించడంలో కూడా ఈ యూనిట్ దోహదకారిగా ఉండి గ్రీన్ హాస్ (విష) వాయువులను నిరోధిస్తుంది. మరియు గ్యాస్ ఉత్పత్తి కాగా మిగిలిపోయి బయటకు విడుదల అయ్యే ద్రవ పదార్ధం సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది.
మరికొంత సమాచారం కొరకు సంప్రదించండి
వివేకానంద కేంద్ర - నేచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, వి.కె. ఎన్.ఎ.ఆర్.డి.యి.పి, వివేకానందపురం, కన్యాకుమారి - 629702, తమిళనాడు)
ఈ మెయిల్ . vknardep@gmail.com
ఫోను: 04652 246296 and 04652 -247126.
ఆధారము: http://www.hindu.com
బయోగ్యాస్ మిశ్రణంలో పోషక స్థాయి
|
నైట్రోజన్(ఎన్) |
ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ (పి2ఒ5) |
పొటాషియమ్ ఆక్సైడ్(కె2ఒ) |
బయోగ్యాస్ స్లర్రీ |
1.4 |
1.0 |
0.8 |
వ్యవసాయభూమిలో గల ఎరువు(ఎఫ్ వై ఎమ్) |
0.5 |
0.2 |
0.5 |
టౌన్ కంపోస్టు |
1.5 |
1.0 |
1.5 |
బయో గ్యాస్ గరురించి మరియు ఫోటోలు చెప్పండి.