పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంట్లో వెలుతురు మరియు ఉష్ణం

ఈ విభాగంలో ఇంట్లో వెలుతురు మరియు ఉష్ణం సంబంధించి శక్తి పరిరక్షణ చర్యలు గురించి వివరించడం జరిగింది.

ఇంట్లో శక్తి వినియోగం ప్రధానంగా వెలుతురు మరియు ఉష్ణం కోసం జరుగుతుంది. వీటిలో ఇంధన శక్తిని ఆదా చేసే సాధారణ చిట్కాలు క్రింద చర్చించబడ్డాయి.

ఇంట్లో వెలుతురు

నేడు భారతదేశంలోని గృహలలో కనీసం 80 శాతం విద్యుత్తు వృథా అవుతుంది. దీనికి కారణం మనం ఇంట్లో వెలుతురు కోసం వాడుతున్న దీపాలు మరియు బల్బులలోని రకాలు. కింది సాధారణ చిట్కాలు అనుసరించడం ద్వారా, అపారమైన శక్తి ఇంట్లో వృథా కాకుండా చూడవచ్చు.

 • ఉపయోగించనప్పుడు లైట్లను ఆర్పేయండి.
 • క్రమం తప్పకుండా ట్యూబ్ లైట్లు, బల్బులు మరియు వాటి ఫిక్సర్ల దుమ్మును శుభ్రం చేయండి.
 • ఐఎస్ఐ మార్కు ఉన్న విద్యుత్ గృహోపకరణాలను మరియు పరికరాలను ఉపయోగించండి.
 • ఐఎస్ఐ మార్కు ఉన్న విద్యుత్ గృహోపకరణాలను మరియు పరికరాలను ఉపయోగించండి.
 • శక్తిని పొదుపు చేసే CFLs మరియు LED లను ఉపయోగించండి. కాండిసెంటు బల్బులతో పోలిస్తే తక్కువ శక్తిని తీసుకుంటాయి మరియు అదే వెలుతురును అందిస్తాయి.
 • వెలుతురును పెంచడానికి లేత రంగు, వదులు నేత కర్టెన్లను కిటికీలకు ఉపయోగించండి.
 • శక్తిని ఆదా చేయడానికి సంప్రదాయ ట్యూబ్ లైట్ల స్థానంలో T5 లైట్లను ఉపయోగించవచ్చు.

CFL ఉపయోగించటం వలన ప్రయోజనాలు

కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైట్స్ (CFLs) ఉపయోగించటం వలన ప్రయోజనాలు

 • తక్కువ విద్యుత్ తిసుకొని మరియు వేడిని తక్కువ ఉత్పత్తి చేసే CFLలను వాడి విద్యుత్ ఖర్చులను తగ్గించుకొండి.
 • ఒక CFL బల్బు సంప్రదాయ విద్యుత్ బల్బుల కంటే ఐదు రెట్లు ఎక్కువ కాంతి ఇస్తుంది.
 • సిఎఫ్ఎల్ బర్నింగు గంటలు సాధారణ బల్బుల కంటే 8 రెట్లు ఎక్కువ ఉంటాయి.
 • 60 W బల్బులకు బదులుగా మీరు 15 W సిఎఫ్ఎల్ బల్బుల ఉపయోగిస్తే; మీరు గంటకు కనీసం 45 W విద్యుత్ వినియోగాన్ని ఆదా చేయవచ్చు. నెలకు మీరు 11 యూనిట్ల వినియోగాన్ని ఆదా చేయవచ్చు. దానిద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చు. సిఎఫ్ఎల్ బల్బులు కనీసం 5 నుండి 8 నెలల దాకా ఉంటాయి.

కాంతి ఉద్గార డయోడ్ల (LED) ఉపయోగించటం వలన ప్రయోజనాలు

 • ఒక సాధారణ బల్బు 5% విద్యుత్తు తీసుకొని దానిని కాంతిగా మార్చటంలో చాలా అసమర్థంగా పనిచేస్తుంది. కాంతి ఉద్గార డయోడ్ (LED) వంటి సమర్థవంత కాంతి బల్బులు సాధారణ బల్బ్ ఉపయోగించే శక్తిలో 10వ వంతు శక్తిని వాడి అంతే కాంతిని లేదా అంతకంటే ఎక్కువ కాంతిని ఉత్పత్తి చేస్తాయి. సంవత్సరానికి ప్రతి LED బల్బుకు కన్స్యూమర్స్ విద్యుత్ బిల్లు రూ. 160-400 ఆదా అవుతుంది. ఆ విధంగా ఒక సంవత్సరం లోపే ఖర్చు తిరిగి వస్తుంది. ఇది విద్యుత్తు పొదుపుకు మరియు శిలాజ ఇంధనాల తక్కువ వినియోగానికి దారి తీస్తుంది దీనివలన వాతావరణానికి లాభం చేకూరుతుంది.
 • మండే బల్బుల లాగా కాకుండా, LEDలలో కాంతి కోసం వేడిని సృష్టించే ఫిలమెంటు లేదు. ఇవి ఒక సెమీ కండక్టర్ పదార్థం (డయోడ్)లో ఎలక్ట్రాను కదలిక ద్వారా వెలుగుతాయి. విద్యుత్ నేరుగా కాంతిగా మారుతుంది కనుక, LED లు వేడివల్ల జరిగే శక్తి వృథాను తగ్గిస్తాయి .
 • జ్వలించే బల్బ్ వర్సెస్ LED ల్యూమన్ తీవ్రత – LEDలలో ఎలాంటి వాయువులు, తంతువులు లేదా కదిలే భాగాలు లేవు. చాలా సందర్భాలలో ఒక 7W LED బల్బు 60W జ్వలించే బల్బు కంటే ఎక్కువ వెలుతురును ఇస్తుంది. ఒక 60 వాట్ మండే బల్బ్ ల్యూమన్ ఉత్పత్తి 450ల్యూమన్ ఉంటుంది. అయితే, ఒక 7 వాట్ LED బల్బ్ ల్యూమన్ ఉత్పత్తి 600 ల్యూమన్లు ఉంటుంది. ఒక LED కాంతి మూలం నుండి ఒక ప్రాంతంలో పడే ల్యూమన్ నిష్పత్తి ఒక సంప్రదాయ కాంతి మూలం కంటే ఎక్కువ.
 • LEDల భద్రత – ఇవి పూర్తిగా సురక్షితంగా ఉంటాయి మరియు మానవ కంటికి ఏ ఆపదను కలిగించవు. CFLతో పోల్చితే, LED లు పాదరసాన్ని కలిగి ఉండవు అందువలన, పర్యావరణం పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. DELP పథకం కింద ఉత్పతైన LED లపై కఠినమైన నాణ్యత పరీక్షలను అమలు చేస్తారు.
 • ఒక LED మూడు నుండి ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది. ఎక్కువ కాలం ఉండటం వలన పెట్టు-మర్చిపో ఫిక్సర్లను వాడి నిర్వహణ మరియు మార్చే ఖర్చు ఆదా చేసుకోవచ్చు.

LED లు, CFL మరియు ICLల పోలిక

పారామీటర్లు LEDCFL ICL
వాట్ 7 14 60
శక్తి సామర్థ్యం 88.00% 50.00% 0.00%
విద్యుత్ బిల్లులో వార్షిక ఖర్చు ఆదా (బల్బ్ ప్రతి) రూ 160-400 రూ 85,50 nil
ఆయుర్దాయం (Hrs) 25000 8000 1200
ఉచిత వారంటీ 3 సంవత్సరాల 1 సంవత్సరం nil

లైటింగ్ విభాగంలో శక్తి సమర్థ ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ నుండి మద్దతు

 • కాంతి ఉద్గార డయోడు (LED)లు అత్యంత ఇంధన-సామర్థ్యం కలిగినవిగా ఆవిర్భవిస్తున్నాయి. LED బల్బులు ఒక సాధారణ బల్బ్ ఉపయోగించే శక్తిలో 1 / 10th శక్తిని మాత్రమే ఉపయోగించుకుంటాయి. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లాంప్ (CFL) ఉపయోగించే శక్తిలో సగం మాత్రమే ఉపయోగించుకుంటాయి. అయితే, పెద్ద సవాలు ఏమిటంటే దీని ధర అధికం.
 • EESL (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, 4 శక్తి రంగాల కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉమ్మడి కార్యక్రమం) BEE విద్యుత్ పంపిణీ సంస్థలతో కలిసి ఒక వ్యాపార నమూనాను రూపొందించింది. దీనిలో EESL పెద్దమొత్తంలో LED బల్బులను ఉత్పత్తి చేసి వాటిని మార్కెట్ ధర Rs.400 కు బదులుగా 10 రూపాయలకు ప్రతి ఇంటికి అమ్మడానికి ప్రయత్నిస్తుంది.

మరింత సమాచారం కోసం: PIB

మూలం : పోర్టల్ కంటెంట్ టీమ్

3.02083333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు