పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

శక్తి సామర్థ్యం

శక్తి సామర్థ్యం ప్రోత్సహించే టెక్నాలజీస్ ఇక్కడ సిద్ధం ఉన్నాయి.

బయో మాస్ అంటే ఏమిటి?

కిరణజన్యసంయోగ క్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని అందుకొని బయోమాస్ను తయారు చేసుకొంటాయి. ఇది వివిధదశల్లో, వివిధరూపాల్లో శక్తి స్థావరాలుగా మారినా పనికొస్తూ ఉంటుంది . ఉదాహరణకు పశువులదాణా.పశువులకు తిండిగా వాడే దాణా,ఆ తర్వాత అది పేడగా వినియోగిస్తుంది .వ్యవసాయ వ్యర్థాలు వంటచేయడానికి పనికొస్తుంది .భారతదేశంలో వ్యవసాయ, అరణ్య అవశేషాలన్నీ కలిసి సాలుకి 120-150 మిలియన్ మెట్రిక్ టన్నుల బయోమాస్ ఉత్పత్తి అవుతుంది . దీన్ని సక్రమంగా వినియోగిస్తే, 16000 మెగా వాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది .

వాడకం
బయోమాస్  ఒక ముఖ్యమైన శక్తి స్థావరం. భారతదేశ మొత్తం ఇంధన వినియోగంలో  దీని వాటా 30 శాతం,ఇది గ్రామీణ గృహావసరాల్లో దాదాపు 90 శాతంగా ఉంది. బయోమాస్ను ఇళ్ళలో వంట చేసుకోవడానికి,వేడి చేసుకోవడానికి విస్తృతంగా వాడుతున్నారు. వ్యవసాయ వ్యర్థాలు, కొ్య్య,బొగ్గు,ఎండిన పేడ వంటివి వివిధ బయోమాస్ వనరులు.

లాభాలు

 • స్థానికంగా దొరుకుతుంది.. కొంతమేరకు సమృద్ధి గా   దొరుకుతుంది .
 • మృత కళేబరాలతో కూడి న ఇంధనాలకంటే బయో ఇంధ నాలెంతో పరిశుభ్రమైనవి. అంతే కాదు.కార్బన్ డైయాక్సైడ్ ని అరికట్టడం వల్ల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతుంది .

నష్టాలు

 • ఇంధన సేకరణకు చాలా కష్టపడాలి
 • ఇళ్లలో వంట చేసేపుడు, గది లో సరైన కిటికీలు లేదా వెంటిలేటర్లు లేకుంటే అది  వాతావరణ కాలుష్యానికి దారి తీయవచ్చు. అది  ప్రాణాపాయానికి దారి తీయవచ్చు.
 • భరించలేని,చాలీచాలని బయోమాస్ వాడకం అనర్థదాయకం. సరైన రీతిలో వాడ కపోతే,అది  ఒక్కోసారి పచ్చద నాన్ని,వాతావరణాన్ని నష్టపర్చవచ్చు.

ఫలకరమైన బయోమాస్ వాడకం కోసం టెక్నాలజీలు
గ్రామీణ ప్రాంతాల్లో బయోమాస్ను సమర్ధవంతంగా వాడుకొనే వీలునిచ్చే టెక్నాలజీలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి.

సమర్థవంతమైన ఇంధన వాడ కానికి

 • మెరుగైన డిజైన్లలో లభ్యమౌతున్నపొయ్యిని వాడ టంవల్ల ఎంతో సమర్ధవంతంగా పనిచేసే పొగరానివ్వని పొయ్యి కన్నా రెట్టింపు ఇంధన సామర్ధ్యాన్ని సాధించవచ్చు.
 • బయోమాస్ను  అణిచి చిన్నఇటుకల్లా తయారుచేసి ఉంచుకోవడం వల్ల వాటిని దాచుకొనె స్థలం ఆదా కావడమే కాక మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది .
 • మృతకళేబరాలవంటి కర్బన రసాయన పదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా బయోమాస్గా మార్చుకోవడం వల్ల తగు ఇంధన సామర్ధ్యాన్ని పొందడమే కాక, సేంద్రీయ ఎరువులను కూడా పొందవచ్చు.
 • బయోమాస్ను కొంతమేర మండించి బయోగ్యాస్గా మార్చుకోవచ్చు.

బయో ఇంధనాలు
బయో ఇంధనాలు బయోమాస్లనుంచి పరిశ్రమల్లో వ్యవసాయ ఉత్పత్తులు లేదా తిండి పదార్థాల ఉత్పత్తులు తయారయ్యేటపుడు వచ్చే వ్యర్థాలనుంచి లేదా వంటనూనె,వెజిటబుల్ ఆయిల్ లను తిరిగి ప్రాసెస్ చేయడం వల్ల ఎక్కువగా తయారౌతాయి. బయో ఇంధనాల్లో ఎలాంటి పెట్రోలియం పదార్థాలు లేకపోయినా, వాటిని ఏ మోతాదుల్లొనైనా పెట్రోలుతో కలిపి ఒక బయో ఇంధన మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. అలా తయారుచేసుకొన్న మిశ్రమాన్ని మనయంత్రాల్లో ఎలాంటి మార్పులవసరం లేకుండానే  వాటిని డీజిల్ ఇంజన్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు. బయో ఇంధనాలని వాడటం సులభం,వదిలించుకోవడం సులభం. దీనిలో గంధకం ఉండదు. పైగా ఇది వాసన లేనిది కూడా.

బయోమాస్‌ బొగ్గుతో బ్రికెటింగ్‌

బయోమాస్ బొగ్గుతో బ్రికెటింగ్
ప్రతి గ్రామంలోనూ, ప్రతి పంటనూర్పిడి అయ్యాక ఎంతో వ్యవసాయ వ్యర్థాలు తయారౌతాయి.  వీటిని ఎక్కువగా పొల్లాలో బయటనే కాల్చి వేయడం జరుగుతుంది.  ఐతే, బయోమాస్ బొగ్గుతో ఇటుకలు చేసే పరిజ్ఞానంతో ఈ వ్యర్థాలను సరసమైన ధరలకు ప్రత్యామ్నాయ ఇంధనాలుగా మార్చుకోవచ్చు. అంతేకాదు. ఇది పర్యావరణానికి మిత్రునిగా పనిచేస్తుంది. కుటుంబాలకు ధనాన్ని సంపాదించిపెడుతుంది.

బ్రికెటింగ్ అంటే ఏమిటి
తక్కువ సాంద్రత ఉండే బయోమాస్ ను ఎక్కువ సాంద్రత ఉండి, శక్తివంతమైన బొగ్గు ఇటుకలుగా చేయడాన్ని బ్రికెటింగ్ అంటారు.

తయారుచేసే పద్ధతి
బయోమాస్ తో బొగ్గును చేయడానికి రెండు విభిన్న పద్ధతులున్నాయి.
1. ప్రత్యక్ష పద్ధతి
ప్రత్యక్ష పద్ధతిలో  ఉన్న రసాయన వ్యర్థాలను వేడిచేసి, అసంపూర్తిగా కాల్చడం, తద్వారా బొగ్గునేర్పరచడం జరుగుతుంది.
2. పరోక్ష పద్ధతి
పరోక్ష పద్ధతిలో  బాహ్యంగా  గాలి చొరని అరగల  మూత వేసిన ఒక పొయ్యిలో  రసాయన వ్యర్థాలను కాలుస్తారు. దీనివల్ల హెచ్చు నాణ్యతగల బొగ్గు, తక్కువ కాలుష్యాలతో, తక్కువ పొగతో ఏర్పడుతుంది.

ఎంసిఆర్ సి పద్ధతిలో బొగ్గును తయారుచేయడం
కావలసినవి.

1. స్థానికంగా లభ్యమయ్యే బయోమాస్( చవుకుమాను నుంచి రాలిన ఆకులు, చెరుకు పిప్పి,  వడ్లు నూర్చాక మిగిలిన గడ్డి, పీచు, వేరుశనగ తొక్కలు వగైరా)
2. కార్బొనైజింగ్ ఛాంబర్(కొలిమి లేదా పొయ్యి)
3. కలపడానికి వీలునిచ్చే గంజిపిండి లేదా కస్సవ పిండి
4. చిన్న ఇటుకల తయారీ యంత్రం(గంటక 10 కిలో గ్రాములు)

అంచెలవారీగా బొగ్గు తయారీ
1.    బయోమాస్ ను సేకరించడం
స్థానికంగా లభ్యమయ్యే  బయోమాస్ ను సేకరించి దానిని  వివిధ రకాలుగా విడదీయాలి.  పెద్ద ఆకారంలో ఉన్నవాటిని చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. అలా చేసిన దానిని సూర్యరశ్మిలో ఎండబెట్టాలి.

2. కర్బనీకరించడం
2.i.  కొలిమిని తయారు చేయడం

 • బయటి డ్రమ్ము - ఒక 200 లీ. లోహపు నూనె డ్రమ్ముని తీసుకోవాలి. దానిపైభాగాన్ని  కత్తిరించాలి. కింది భాగాన 12"   నిడివి   x 10" ఎత్తు ఉన్న రంధ్రాన్ని ఏర్పాటుచేసుకోవాలి.
 • రెండు ఇనుప కడ్డిలు(8”) లను ఆ లోహపు డ్రమ్ కిందభాగాన ఒక వేపునించి మరొక వేపుకు వెళ్లేలా రెండిటిని సమాంతరంగా బిగించాలి. ఇవి మనం లోపలివేపుకు ఉంచే  స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్కు సపోర్టునిస్తుంది.
 • లోపలి డ్రమ్ము - ఒక 100 లీ. స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ము సరైన మూతలుండేది. దీనికి కిందిభాగాన ఆరు(3/8")   రంధ్రాలుండాలి.
 • ఈ లోపలి డ్రమ్మును పెద్ద డ్రమ్ములోపల ఉంచాలి.


2.ii.  బయోమాస్ ను కర్బనీకరించడం

 • బయోమాస్ ను లోపలి డ్రమ్ములోపల గట్టిగా కుక్కాలి. ఆ తర్వాత బయోమాస్ ను బట్టి 45 నిమిషాలనుంచి 1 గంట వరకు దాన్ని బయోమాస్ తోనే మండించాలి.
 • అలా మండించాక, లోపలి డ్రమ్ములో ఉన్న కర్బనీకరించబడిన బయోమాస్ ను సేకరించి బరువు చూడాలి. ఈ పద్ధతిలో 30 శాతం కర్బనీకరించిన బొగ్గు లభిస్తుంది.


3.  కలపడానికి వీలునిచ్చే గంజిపిండి లేదా కస్సవ పిండిని తయారుచేయడం
ఈ ఇటుకలను గట్టిగా ఉండేలా చూడటానికి కలిపే బైండింగ్ పదార్థాన్ని వాడతారు.
ప్రతి 100 కిలోల కర్బనీకరించిన బొగ్గుపొడికి 5 లేదా 6 కిలోల గంజిపిండి లేదా   కస్సవ పిండి తీసుకొని దానిని 60 - 100 లీటర్ల నీళ్లలో (వ్యర్ధ పదార్ధాల బరువుని బట్టి)కలపాలి.

4.  కలపడం

కర్బనీకరించిన బొగ్గుపొడిని బాగా బైండింగ్ పదార్థాన్ని వేసి కలపాలి. ప్రతి కణము ఈ బైండింగ్ పదార్థంలో కలిసే విధంగా చేస్తే,  అన్ని ఇటుకలు ఒకే రకంగా తయారవుతాయి.

5.   ఇటుకల తయారీ
బొగ్గుపొడిని చేత్తోగానీ యంత్రాలతోగానీ చిన్న ఇటుకలుగా చేసుకోవాలి. ఇటుకల అచ్చుల్లోకి / యంత్రాల్లోకి నేరుగా ఈ పిండిని వేసి అన్ని ఇటుకలూ ఒకే పరిమాణంలో వచ్చేలా చూసుకోవాలి.

6.   ఆరబెట్టడం, ప్యాకింగ్
తయారైన ఇటుకలను ఒక పళ్లెంలో  సేకరించి, వాటిని ఎండలో బాగా ఎండేలా చూడాలి. ఆ తర్వాత ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి సిల్ చేయాలి.

ఈ ఇటుకల సాధారణ లక్షణాలు :

తేమ                   :  7.1%-7.8%
కరిగే పదార్థాలు        :  13.0%-13.5%
స్థిర కార్బన్            :  81.0%-83.0%
బూడిద                 :  3.7%-7.7%
గంధకం                 :  0.0%
వేడిమి విలువ          :  7,100-7,300 kcal/kg
సాంద్రత                 :   970kg/m 3

సాంకేతిక శాస్త్ర ఉపయోగాలు
1. పొగ ఉండదు : ఈ బొగ్గు ఇటుకలను మండించేటప్పుడు ఎలాటి పొగ వెలువడదు.
2. బూడిద తక్కువ: అతి కనిష్ట స్థాయిలో బూడిద ఏర్పడుతుంది(బొగ్గు యదార్థ బరువులో 5 శాతం కన్నా తక్కువ).
3. హెచ్చు స్థిర బొగ్గు, కెలోరిఫిక్ విలువ :  సాధారణంగా స్థిర కర్బన సారం 82 శాతంగా ఉంటుంది. ఈ ఇటుకల కెలోరిఫిక్ విలువ ఒక కిలోకు 7500 కి.కేలరీలుగా/కిలో గ్రాములు ఉంటుంది.
4. వాసన ఉండదు : బయోమాస్ బొగ్గు ఇటుకల్లో ఆవిరయ్యే పదార్థాలు అతి తక్కువ. అందువల్ల ఎలాటి వాసనా ఉండే ఆస్కారం లేదు.
5. ఎక్కువ సేపు మండుతుంది:  మామూలు బొగ్గు కాలేదానికన్నా బయోమాస్ బొగ్గు ఇటుకలు రెండింతలు ఎక్కువసేపు మండుతాయి.
6. నిప్పుల రవ్వ ఉండదు : మామూలు బొగ్గు మాదిరి కాక, బయోమాస్ బొగ్గు ఇటుకలు వాడటంవల్ల మిణుకుమనడం ఉండదు.
7. తక్కువ పగుళ్లు, ఎక్కువ పటిష్టత : తక్కువ పగుళ్లు ఏర్పడటం, ఎక్కువ పటిష్టతగా ఉండటంవల్ల బయోమాస్ బొగ్గు ఇటుకలు ఎక్కువసేపు మండుతాయి.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా :
డైరెక్టరు/సంచాలుకులు
శ్రీ ఏఎంఎం మురుగప్ప చెట్టియార్ పరిశోధనా కేంద్రం

తక్కువ ఖర్చు సాంకేతిక పరిజ్ఞానం

హే బాక్స్ - చవకైన ఇంధన పొదుపు పరిజ్ఞానం

హే బాక్స్ తయారీ

కావల సిన వస్తువులు:Hay Box 1. ఒక పెట్టె , కింది ఆకారంలో కావాలి ,పొడవు : 45 సెంమీ, వెడల్పు : 45 సెంమీ, లోతు : 45 సెం.మీ. ఈ పెట్టె చెక్కతోకానీ, కార్డుబోర్డుతోకానీ, వెదురుబుట్టతోకానీ చిన్న సిమెంటుముక్కలతోకానీ ఉండొచ్చు.
2. ఉష్ణనిరోధక పదార్థం
ఉష్ణనిరోధకాలైన ఎండుగడ్డి / వరిపొట్టు / చెక్కపొడి / రంపపు పొట్టు
జనుపనారతో చేసిన సంచి

తయారీ:

ఒక పెట్టెను సిద్ధంగా ఉంచుకోవాలి, ఆ పెట్టెని ఎండుగడ్డితో నింపాలి
బాక్సు పరిమాణంలో జనపనార దిండును తీసు కొని దాన్ని పూర్తిగా ఎండుగడ్డితో నింపాలి

వండే పద్ధతి

వండేపద్ధతి(ఉదా. అన్నం)

ఒక గిన్నెలో బియ్యం తీసుకొని దాన్ని బాగా కడిగి శుభ్రం చేసి ఉంచండి.


బియ్యానికి రెండింతల నీళ్లు కలపండి.

దాన్ని మంటపై 10 నిమిషాలుంచండి

హే బాక్స్ మధ్యలో దానికి సరిపడా స్థలాన్ని ఏర్పరచండి.


ఆగిన్నెని మంటపైనించి తీసి హేబాక్స్లో ఉంచండి

దానిపై ఎండు గడ్డి డిండును పెట్టండి.

45 నిమిషాలలో అన్నం ఉడుకుతుంది(అందులొ ఉన్న వేడిమితోనే).

(ఇది 5 - 6 గం. దాకా వేడిగా ఉంచుతుంది.)

హే బాక్స్ అనేది ఒక సులభమైన, చవకైన ఇంధనాన్ని పొదుపు చేసే సాధనం. దీన్ని గృహ విజ్ఞాన శాస్త్ర విభాగ విస్త్రతి, గృహ విజ్ఞాన శాస్త్ర కళాశాల మరియు పరిశోధన , తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, మధురై అభివృద్ధి చేసింది . ఇది ఉష్ణవాహక నిరోధక డబ్బా. లోపలినించి ఉష్ణం బయటకు రానీయదు. తద్వారా ఉష్ణశక్తిని ఆదా చేస్తుంది. ఆ శక్తిని నిలవచేసి వంటచేయడానికి, వేడిచేయడానికి వాడే వీలునిస్తుంది. ఈ హే బాక్స్ అనేది స్థానికంగా దొరికే వ్యవసాయ వ్యర్థాలైన ఊక, ఎండుగడ్డి వంటివాటిని వాడుకొంటుంది.

వ్యయం తగ్గుదల-ప్రయోజనం-విశ్లేషణ

వివరణ గ్యాస్ స్టౌహేబాక్స్
వంటకు పట్టే సమయం రోజుకు 2 గం. రోజుకు 1 గం.
ఇంధన ఖర్చు రోజుకు రూ.5 రోజుకు  .50 పై

అందువల్ల దాదాపు 50 % ఇంధనం , ఇంధన ఖర్చుల్లో ఆదా అవుతుంది

నిర్వహణ

హే బాక్స్ నిర్వహణ అనేది చవకే.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 • హే బాక్స్ లో ఊకను పరిశుభ్రంగా , పొడిగా ఉండేలా , వండిన పదార్థాలందులో పడకుండా చూసుకోవాలి
 • హే బాక్స్ లో ఉండే ఊక లేదా గడ్డిని ప్రతి 15 రోజులకోసారి ఎండలో పెట్టి అవి పొడిగా ఉండేలా చూడాలి.

ఉపయోగాలు

క్షేమకరమైంది , వాడటం సులభం 
 • సరసమైన ధర , నిర్వహణ సులభం.
 • తక్కువ వ్యయం,సులభ నిర్వహన ఈ పద్ధతిలో నీరు తెర్లడానికి , పదార్థాలు ఉడకడానికి అతి తక్కువ సమయం పడుతుంది.
 • ఉష్ణోగ్రతని నిలపడం - పదార్థాలు ఉడకడానికి కావలసిన ఉష్ణోగ్రతను 6 గం. వరకు నిలవ ఉంచగలదు. వండిన అన్నం 61 ° సె. వద్ద వేడిగా 5 గంటల దాకా నిలవ ఉంచగలదు.   బాక్సు బయట ఉంచితే అది కేవలం    35° సె వద్దే ఉంటుంది .
 • మేలైన , నాణ్యమైన ఆహర పదార్థాలు  -ఈ సాధనంతో తయారైన పదార్థాలు వాసన , రంగు , రుచి ,  వంటి అంశాలలో మిగిలిన పద్ధతుల కన్నా ఈ పద్ధతిలో నాణ్యమైన , మేలైన పదార్థాలు తయారుచేసుకోవచ్చు.
 • పోషక విలవల అతి తక్కువ నష్టం -ఈ సాధనంలో    వండిన పదార్థాలలో పోషక విలవలు అతి తక్కువగా నష్టపోతాయి.
 • వనరుల ఆదా -ఈ పరిజ్ఞానం వాడటం వల్ల మనం ఇంధనం , ధనం , శ్రమ , సమయం - అన్నీ ఆదా చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యలుండవు 58 శాతం వండే సమయం , 44 శాతం ఇంధనంపై పెట్టే ఖర్చు ఆదా ఆవుతున్నట్టు కనుగొన్నారు.
ఆధారం : గృహ విజ్ఞాన శాస్త్ర విభాగ ఎక్స్టెన్షన్ , గృహ విజ్ఞాన శాస్త్ర కళాశాల , పరిశోధనా సంస్థ , తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం , మధురై - 625 104

హరిత భవనాలు

‘ హరిత భవనం’ అంటే ఏమిటి?

హరిత భవనం, నిర్మాణదశలోగాని, నిర్వహణలో గాని ప్రకృతి వనరులను అతి తక్కువగా వృధా చేస్తుంది. హరిత భవనం నమూనా యొక్క లక్ష్యం ఏమిటంటే

 • పునరుత్పాదక శక్తి లేని వనరులను అతి తక్కువగా ఉపయోగించడం. మరియు ఒక వేళ ఉపయోగిస్తే వాటి ప్రయోజన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం
 • అందుబాటులో ఉన్న వనరులను మరల, మరల ఉపయోగించుట మరియు పునరావృతం చేయుట
 • పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించడం

నాణ్యమైన భవన నిర్మాణ సామాగ్రిని, నిర్మాణ పద్ధతులను సంపూర్ణంగా ఉపయోగిస్తుంది. భవన నిర్మాణ స్థలం వద్ద అందుబాటులో ఉండే వనరులను పూర్తిగా వాడుకుంటూ, వాతావరణ పరిస్థితులకు అత్యంత అనుకూలమైన నిర్మాణ శైలిని అనుసరిస్తుంది. అతి తక్కువ శక్తి ని ఉపయోగించి తన విద్యుత్ అవసరాలను తీర్చుకుంటుంది. సమర్థవంతమైన సాధనాలను ఉపయోగించి, తన విద్యుద్దీపాలను, శీతలీకరణకు, మరియు యితర అవసరామను తీర్చుకుంటుంది. పునరుత్పాదక శక్తి వనరులను అత్యంత అధికంగా ఉపయోగించుకుంటుంది. వ్యర్థాలను మరియు నీటిని సమర్థవంతంగా నిర్వపించుకునే పద్ధతులను పాటిస్తుంది. ఆరోగ్యవంతమైన మరియు సౌకర్యవంతమైన సదుపాయాలను భవనం లోపల సమకూరుస్తుంది.

క్రింద పేర్కొన్న అంశాలు, హరితభవనం నమూనాలో సమగ్రంగా చూడబడినవి:

 • స్థల నివేశన ప్రణాళిక (site planning)
 • భవన ఆవరణ నమూనా (Building develop design)
 • భవన వ్యవస్థ నమూనా - Hvac (heating veutication - ఉష్ణోగ్రత ను బయటకు పంపే ఏర్పాటు (మరియు) and conditioning - భవన శీతలీకరణ, విద్యుద్దీపాలు, విద్యుత్ కు సంబంధించిన మరియు నీటిని వేడి చేయుట.
 • పునరుత్పాదక శక్తి వనరులను సమగ్రంగా వినియోగించుకుని, భవన నిర్మాణ స్థలంలో శక్తిని ఉత్పత్తి చేయుట
 • నీరు మరియు వ్యర్థాల నిర్వాహణ
 • పర్యావరణానికి మేలు చేసే ముడి పదార్థాల ఎంపిక ( అధికంగా పునరుత్పాదకం (పునరావృతం) మయ్యే పదార్థం తక్కువగా వ్యర్థాలను విడిచే, వేగంగా పునరుత్పత్తి చేసే వనరులు మొదలైనవి)
 • భవనం లోపలి వాతావరణ శ్రేష్టత (లోపలి ఉష్ణ మరియు కాంతి సంబంధమైన సౌకర్యాలు మరియు శుద్ధమైనగాలి)

హరిత భవనాల శ్రేష్టతను కొలిచే ప్రమాణమేమిటి?

గ్రిహ, (griha – green rating for integrated hathat assessment) ( సమగ్ర నివాసస్థల హరిత శ్రేష్టత అంచనా) భారతదేశం యొక్క జాతీయప్రమాణ వ్యవస్థ, యొక్క సంక్షిప్త నామం ద్వారా ఏర్పాటు చేయబడి, భారతదేశపు నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖతో కలిగి ( new and reveable energy – govt of India) అభివృద్ధి చేయబడుతోంది. ఇది, హరిత భవానాల నమూనా ను విలువ కట్టే వ్యవస్థ, దేశంలోని వివిధ రకాల వాతావరణ ప్రాంతాల అన్ని రకాల భవనాలకు ఇది వర్తిస్తుంది.

హరిత భవానాలకు ఉదాహరణలున్నాయా ?

హరిత భవానాలకు కొన్ని ఉదాహరణలు

 • గుర్ గావ్ లోని ( టెరి రిట్రీట్ ) teri retreat భవనం
 • Cese ( center for environmental sciences and engineering ) building ( సి. ఇ. ఎస్. ఇ భవనం, ఐఐటి. కాన్పూర్, ఉత్తరప్రదేశ్.
 • సుజలోన్ వన్ ఎర్త్ ( suzlon one earth), సుజలోన్ ఎనర్జీ లిమిటెడ్ ( suzlon energy limited), వన్ ఎర్త్ (one earth), హదప్సార్ , పూనె - 411028

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

2.97247706422
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు