హోమ్ / శక్తి వనరులు / పర్యావరణం / ఘన వ్యర్థ పదార్థాల ఉత్పాదనకు కారణాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఘన వ్యర్థ పదార్థాల ఉత్పాదనకు కారణాలు

ఘన వ్యర్థ పదార్థాల ఉత్పాదనకు కారణాలు

ఘన వ్యర్థ పదార్థాల ఉత్పాదనకు కారణాలు::

 1. అధిక జనాభా, అధిక జనసాంద్రత, పట్టణీకరణ
 2. హరితవిప్లవం (వ్యవసాయంలో రసాయనాల వాడకం)
 3. ప్లాస్టిక్, గాజు
 4. లెదర్, టైల్స్, కాగితపు పరిశ్రమ, టెక్స్టెయిల్ వంటి అనేక పరీశ్రమలనుంచి ఉద్ఘారమయిన వ్యర్థాలు

ఘన వ్యర్థ పదార్థాల ప్రభావాలు::

 1. ఏ రకమైన ఘనవ్యర్థ పదార్తాల నిర్వహణ లేని ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
 2. చిన్నారులు, శ్రామికులు, కర్షకులు హానికర వ్యర్థపదార్థాల ప్రభావానికి ఎక్కువ లోనవుతూ ఉంటారు.
 3. నేల నీటిలోకి ఘన వ్యర్థ అవశేషాలు అధిక మొత్తంలో చేరేకొద్ది బయోమ్యాగ్నిఫికేషన్ పద్ధతిలో ఆహాల శ్రుఖలాల ద్వారా మనవులలోకి చేరతాయి. ఇటీవల కాలం భార లోహాలు అనేకం మనిషిలో చేరుతున్నాయి.

ఉదా:

a. ఆర్సీనిక్ వలన క్యాన్సర్, పాదరసం వలన పక్షవాతం, దృష్టిలోపం,

b. మాంగనీస్ వలన కాలేయం ఊపిరితిత్తులు, వ్యంధత్వం,

c. ఆంటిమోని వలన స్త్రీలలో రుతుక్రమం, వ్యంధత్వo,

d. సీసం వలన హిమోగ్లోబిన్ తయారీకి అవరోధం, గుబడే జబ్బులు

e. క్యాడ్మియం వలన ఇటాయిటాయ్ అను కీళ్ళ నొప్పుల వ్యాధి మొదలయినవి.

ఇటీవల ప్యాకేజింగ్ పరిశ్రమ నుంచి విడుదల అవుతున్న ఘన వ్యర్థాలు మనిషిలోకి చేరి క్యాన్సర్, పిండశ్రావాలు, పిండ వైపరిత్యాలకు కారణం అవుతున్నాయి.

ఉదా:

బిస్మానాల్, డై ఈథయిల్ హాక్వేయిల్,

కొన్ని రకాల రసాయనాల అవశేశాలు జరావుయు దాటుకుని గర్భంలోని శిశువులోకి ప్రవేశిస్తున్నాయి.

బయో మెడికల్ వేస్ట్ వంటి ఘన వ్యర్థాల్ని మునిసిపల్ చెత్త కుండీలలో వేసినప్పుడు చెత్త ఏరుకునే వారు దాని ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. సూదుల ద్వారా హెపటైటిస్ B, హెపటైటిస్ C వైరస్ లు సులభంగా సంక్రమిస్తాయి.

మునిసిపల్ చెత్త మరియు గృహములనుండి విడుదల అయ్యే కుళ్ళుతున్న పదార్థాలలో అభివృఫ్డి చెందే హానికర సూక్ష్మజీవుల ప్రభావానికి కూడా ragpickers (చెత్త ఏరుకునేవారు) లోనయ్యే అవకాశం ఉంది.

ఘన వ్యర్థ పదార్తాలు పేరుకుపోవడం ద్వారా వరదనీటికి అవరోధం ఏర్పడి అనేకచోట్ల నీరు నిల్చిపోతుంది. ఇటువంటి నిలకడ నీటిలో మలేరియా డెంగీ వంటి జ్వరాల వ్యాప్తికి కారణమయ్యే దోమలు ప్రజలనం చెందుతాయి.

ప్లాస్టిక్ బ్యాగులు, పాలిథిన్ కవర్లు, గాజు సీసాలు వంటి పదార్థాల జీవితకాలం ఎక్కువగా ఉంటుంది కనుక అనేక తరాలు వీటి ప్రభావాలకు లోనవుతారు.

ఉదా:

a. తగారం, అల్యూమినియం జీవితకాల 100 సం.లు.

b. ప్లాస్టిక్ జీవితకాలం 10 లక్షల సం.లు.

b. గాజు జీవితకాలం అనంతం.

నిర్వహణా లోపాలు:

 • 1అతి ఉష్ణ భాస్మీకరణం (incineration) ప్లాంటును సరైన రీతిలో నిర్వహించకపోతే తీవ్రమైన వాయుకాలుష్యం జరుగుతుంది.

(చెత్తను నిర్వహించే ఒకానొక ప్రక్రియ)

 • ల్యాండ్ ఫిల్లింగ్ (లను సరైన రీతిలో నిర్వహించకపోతే ఎలుకలు, పండికొక్కులు, కుక్కలు చేరి వ్యాధి వ్యాప్తికి కారణం అవుతాయి.

(చెత్తను నిర్వహించే ఒకానొక ప్రక్రియ)

 • తడి పొడి చెత్తను మూలం వద్దనే వేరుచేయడంలో నిర్వహణా లోపాలు, అవగాహనా రాహిత్యం ఉండటం.

(Segregation at source)

 • వైద్యశాలల్లో క్రింద తెలిపిన విధంగా ఘన వ్యర్థాల నిర్వహణ లేకపోవడం.

పిండ శ్రావాలు, కణితులు - పసుపు డబ్బా

సిరంజి, ప్లాస్టిక్ బ్యాండేజ్ - నీలి రంగు డబ్బా

సూదులు ఇతరాలు - నలుపు డబ్బా

వ్యాసం: విష్వక్సేనుడు

2.98113207547
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు