హోమ్ / శక్తి వనరులు / పర్యావరణం / వాతావరణ మార్పులు ఎదుర్కోవడం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వాతావరణ మార్పులు ఎదుర్కోవడం

ఈ విభాగంలో వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి మీరేమి చేయొచ్చు గురించి వివరించడం జరిగింది.

వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి మీరేమి చేయొచ్చు :

సమర్ధవంతమైన దీపాలను ఉపయోగించండి

ఫిలమెంట్ దీపాలను తీసేసి కంపాక్ట్ ఫ్లోరసెంట్ బల్బులను(సీఎఫ్ ఎల్) అమర్చండి. ఇవి నాలుగురెట్లు తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటాయి...మరియు ఎనిమిది రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అందువల్ల మీ విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడమే కాకుండా బల్బులు కొనకుండా మీకు డబ్బులు ఆదా అవుతాయి.

ఇంధనాన్ని తక్కువ వినియోగించుకునే విద్యుత్ ఉపకరణాలను వాడండి.

అవి పని చేయడానికి రెండునుంచి పది రెట్లు తక్కువ విద్యుత్ ఉపయోగించుకుంటాయి...మరియు శ్రేష్ఠమైన ఉత్పత్తులు చవకబారువాటికంటే ఎక్కువకాలం మన్నుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నాణ్యమైన పరికరాలు మీకు ఇంధనాన్ని, డబ్బును ఆదా చేస్తాయి. భారత దేశంలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలవంటి ఉపకరణాల సామర్ధ్యం తెలిపేందుకు 1 నుంచి 5 వరకూ స్టార్లతో రేటింగ్ లేబుల్స్ ఇస్తున్నారు. ఎంత ఎక్కువ రేటింగ్ ఉంటే అంత ఎక్కువ సామర్ధ్యం ఉన్నట్లు.

తక్కువ ఇంధనాన్ని ఉపయోగించే కంప్యూటర్ వినియోగించండి.

డెస్క్ టాప్ కంప్యూటర్ కంటే ల్యాబ్ టాప్ కొనుగోలు చేయడం మంచిది. ఇది ఐదురెట్లు తక్కువ విద్యుత్ ఉపయోగించుకుంటుంది. డెస్క్ టాప్ కొనాలనుకుంటే ఎల్ సీ డీ స్క్రీన్ ఉన్నది తీసుకోండి. కంప్యూటర్ లోపల విద్యుత్ ఆదా అయ్యే విధంగా సెట్టింగ్స్ పెట్టుకోండి. స్క్రీన్ సేవర్లు విద్యుత్ ఆదా చేయవు. బాగా విద్యుత్ ఆదాచేసే అధునాతన స్పీడ్ స్టెప్ పవర్ మేనేజ్ మెంట్ మీ కంప్యూటర్ లో ఉందో లేదో తెలుసుకోండి. కొన్ని అపోహలకు భిన్నంగా కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేయడం దాని జీవితకాలాన్ని పెంచుతుంది. ప్రింటింగ్ తగ్గించండి. కాగితం రెండువైపులా ప్రింట్ చేయండి. ఇంక్ జెట్ ప్రింటర్లకంటే లేజర్ ప్రింటర్లు ఎక్కువ విద్యుత్ ఉపయోగిస్తాయి.

కార్లను తక్కువ వాడండి

నడవండి, బైక్ వాడండి, ఒక బృందంగా ఏర్పడి ఒకే కారులో ప్రయాణించండి లేదా ప్రభుత్వ రవాణా వాహనాలలో ప్రయాణించండి. మీరు కారును వాడని ప్రతి ఐదు కిలోమీటర్లకు 1.5 కిలో గ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల కాకుండా ఆపినవారవుతారు. సీఎన్ జీ మరియు ఎల్ పీజీ వంటి స్వచ్ఛమైన ఇంధనాలతో నడిచే కార్లను వాడండి. రెండు నిమిషాలకంటే ఎక్కువ ఆగవలసివస్తే కారు ఇంజను ఆపండి. కారు టైర్లలో గాలి సరిగా ఉండేటట్లు చూడటంవలన ఇంధన వినియోగాన్ని తగ్గించినవారవుతారు. మీరు ఆదాచేసే ప్రతి లీటరు పెట్రోలుకుగానూ వాతావరణంలోకి 2.5 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ రాకుండా చేసినవారవుతారు. రేడియల్ టైర్లను వాడటంవలన 3 నుంచి 7 శాతం ఇంధనం ఆదా చేసినవారవుతారు.

టైర్లను చెక్ చేస్తూ ఉండండి

కారు టైర్లలో గాలి సరిగా ఉండేటట్లు చూడటంవలన ఇంధన వినియోగాన్ని తగ్గించినవారవుతారు. మీరు ఆదా చేసే ప్రతి లీటరు పెట్రోలుకుగానూ వాతావరణంలోకి 2.5 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ రాకుండా చేసినవారవుతారు. రేడియల్ టైర్లను వాడటంవలన 3 నుంచి 7 శాతం ఇంధనం ఆదా చేసినవారవుతారు.

నీటిని జాగ్రత్తగా వాడండి

నీటని వృధా చేయవద్దు. పళ్ళు తోమేటప్పుడుగానీ, గడ్డం చేసుకునేటప్పుడుగానీ, చేతులు, ముఖం కడుక్కునేటప్పుడుగానీ మగ్గుతో నీటిని వాడండి. షవర్, స్నానపు తొట్టిలకు బదులుగా బకెట్ వాడండి. మీరుండే ప్రాంతంలో వాననీటి సంరక్షణకు చర్యలు చేపట్టండి. నీటిని వేడి చేయడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది... వేడినీటిని తక్కువ వాడండి మరియు నీటిని వేడిచేసే పరికరాలను నాణ్యమైనవాటిని వాడండి.

ప్లాస్టిక్ వద్దని చెప్పండి

షాపింగుకు వెళ్ళేటప్పుడు ఒక గుడ్డ సంచి తీసుకెళ్ళండి. రీసైకిల్డ్ కాగితాన్ని ఉపయోగించండి. ఎక్కువ ప్యాకేజింగు ఉండే ఉత్పత్తులను వాడకండి.

ఎయిర్ కండిషనింగ్ ధర్మోస్టాట్ రెండు డిగ్రీలు పెంచండి

ఈ చిన్న మార్పు ద్వారా సంవత్సరానికి 900 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల కాకుండా చేయగలుగుతారు. గదిలోని ఎయిర్ కండిషనర్ ధర్మోస్టాట్ ఉష్ణోగ్రతను 25డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఉంచడం వలన తక్కువ ఖర్చులోనే అత్యంత సౌకర్యాన్ని పొందవచ్చు.

పునరుత్పాదక ఇంధనాన్ని వాడండి

ఇంధనాన్ని ఆదా చేయడానికి సూర్యకాంతిని ఎన్నోరకాలుగా వాడవచ్చు. విద్యుత్ గీజర్ కంటే సౌరశక్తితో పనిచేసే నీటి హీటర్ వాడండి. ఒక వందలీటర్ల సోలార్ వాటర్ హీటర్ ఏడాదికి 1500 యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తుంది. దీపాలను వెలిగించడంకోసం సౌరశక్తితో ఛార్జి అయ్యే బ్యాటరీలను వాడండి. సోలార్ కుక్కర్ ద్వారా అన్నాన్ని, కూరగాయలను అవసరమైన పోషకాలు కోల్పోకుండానే వండవచ్చు. వంట చేయడానికి మీరు చేయవలసిందల్లా సోలార్ కుక్కర్ను ఆరుబయట సూర్యకాంతిలో పెట్టడమే. మీరు గ్రామంలో నివసిస్తుంటే ఆవుపేడనుంచి తయారయ్యే సేంద్రియ ఇంధనాన్ని వాడడం ద్వారా ఇంధనం ఆదా చేయవచ్చు.

మొక్కలను ఎక్కువగా నాటండి

ఒకే ఒక్క చెట్టు తన జీవితకాలంలో ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ ను తనలోకి పీల్చుకుంటుంది.

ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపుతూ ఉండండి

మీ టెలివిజన్, స్టీరియో, కంప్యూటర్, ఫ్యాన్లు, లైట్లను వాడనప్పుడు అపేస్తుండండి. దీనివలన ఏటా ఎన్నో వేల కిలో గ్రాముల కార్బన్ డయాక్సైడ్ బయటకు రాకుండా చేసినవారవుతారు.

రీ సైకిల్ చేయండి, మళ్ళీ మళ్ళీ వినియోగించండి

కాగితం, సీసాలు వంటి ఉత్పత్తులను రీసైకిల్ చేయడం వలన, మళ్ళీ వినియోగించడం వలన పర్యావరణాన్ని పరిరక్షించినవారవుతారు. రీ సైకిల్ చేసిన కాగితాన్ని వాడండి. మీ కార్యాలయంలోనూ, ఇంట్లోనూ వ్యర్ధ పదార్ధాలను రీసైకిల్ చేయండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.06422018349
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు