పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇతరములు 

ఈ విభాగం పథకాలు మరియు శక్తి మరియు కమ్యూనిటీలకు సంబంధిత చర్యలు వ్యవహరిస్తుంది.

రాజీన్ గాంధీ గ్రామీణ ఎల్.పి.జి (L.P.G) విట్రాక్

“రాజీవ్‌ గాంధీ గ్రామీణ ఎల్.పి.జి L.P.G విట్రాక్ (RGGLV)” అక్టోబరు 16, 2009 న ప్రారంభింపబడింది. ఈ పథకం యొక్క లక్ష్యం, చిన్న తరహా ఎల్.పి.జి. పంపిణీ సంస్థలను ఏర్పాటు చేసి, సుదూర గ్రామాలలో కూడ లభించేటట్లు చేయడం. అంతేకాకుండ, తక్కువగా వినియోగింపబడే ప్రాంతాలలో (నెలకూ రీఫిలింగ్‌ చేయించబడే సిలి సిలిండర్లు 600 మాత్రమే కల ప్రదేశాలలో) కూడ అధికంగా సరఫరా చేయగలగడం.

అందుబాటు (కవరేజి)

ఈ పథకం ముందుగా, ఎనిమిది రాష్ట్రాలలో ఎల్.పి.జి. తక్కువగా లభించే ప్రాంతాలను 1200 ప్రదేశాలు గా గుర్తించి ప్రవేశపెట్టబడింది.

క్రమ సంఖ్య

రాష్ట్రం యొక్క పేరు

రాష్ట్రంలోని ఆ ప్రదేశాల సంఖ్య

1.

మధ్యప్రదేశ్

97

2.

ఉత్తర ప్రదేశ్

290

3.

రాజస్థాన్

192

4.

పశ్చమ బెంగాల్

175

5.

బీహర్

251

6.

జార్ఖండ్

80

7.

ఛత్తీస్ గఢ్

39

8.

ఒరిస్సా

101

ఈ పథకంలోని ముఖ్యాంశాలు

 • ఈ RGGLV కు లోబడి పనిచేసే సంస్థలు ముఖ్యంగా చిన్న తరహాగా ఉండి, తక్కువ మూలధనం/సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ సంస్థలు, ప్రస్తుతం ఉన్న 2500 రీఫిల్ వినియోగం బదులు 600 రీఫిల్స్ మాత్రమే కలిగి ఉంటాయి.
 • ఈ సంస్థలు సుదూర ప్రాంతాలలో గల గ్రామీణ ప్రాంతాలకు చొచ్చుకుపోతాయి. అక్కడ సామాన్య పంపిణీదారుడు, పని, పెట్టుబడి స్థాయి తక్కువ అవడం వలన ఈ కార్యక్రమంచే పట్టకు. కాని RGGLV పంపిణీ దారులు చుట్టు ప్రక్కలో గ్రామాలన్నిటితో కలిపి 1500 వినియోగదారుల వరకు తమ సేవలను విస్తరించగలుగుతారు.
 • ఈ సంస్థలు  వ్యక్తిగతంగా పనిచేస్తాయి. పంపిణీ దారుడు, సంస్థను తన కుటుంబ సభ్యుల సహకారంతో, ఒకరిద్దరు ఉద్యోగులతో ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తాడు.
 • L.P.G. సిలిండర్ ను యింటి వద్దకు పంపే సౌకర్యంలేదు.
 • పంపిణీ దారుడి వయసు 21 సం|| 45 సం|| వరకు నిర్ణయించడమైనది. ఇందువలన గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించబడ్డాయి.
 • ఈ పథకం క్రింద పనిచేసే పంపిణీదారుడు, ఆ ప్రాంత పరిధిలోని గ్రామంలోనే స్థిర నివాసి అయిఉండాలి.
 • ఈ పథకంలో, సంస్థలు, భార్యా భర్తల ఉమ్మడి పేరుమీద ఉంటాయి. ఒకవేళ, అభ్యర్థి ఒంటరివాడైతే, వివాహం తరువాత భార్య యొక్క సభ్యత్వం తీసుకొనవచ్చు. ‘భార్య’ లేక ‘భర్త’ వెనువెంటనే భాగస్వామిగా తీసుకొనబడుతారు. గ్రామీణ స్త్రీల సాధికారతకు ఇది ఒక ముందడుగు.
 • ఒక క్రొత్త RGGLV పంపిణీ సంస్థను నెలకొల్పడానికి కావలసిన ధనం, 3.21 లక్షల రూపాయలు, మరియు కావలసిన స్థలం 20 మీటర్లు x24 మీటర్లు. అభ్యర్థి ఈ రెండూ కలిగి ఉండడం ప్రధాన అర్హత.
 • పంపిణీ దారుడు తన పెట్టుబడి ఖర్చును, 1800 క్రొత్త ఎల్.పి.జి. ఖాతాలను (కనెక్షన్లు) తెరవడం ద్వారా పొందగలుగుతాడు. అతడికీ రాగలిగే నికర ఆదాయం నెలకు సుమారు రు. 7500
 • ఈ మొత్తం పథకంలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పంపిణీ దారులను ఎంచుకునే క్రమంలో ఏ విధమైన మోకిక  పరీక్ష (Interview) జరగదు. ఆర్థిక సామర్థ్యం, విద్యార్హతలు ననుసరించి మొత్తం అభ్యర్థులలో 80% మార్క కంటే  ఎక్కువ తెచ్చుకున్న వారిని గుర్తించి, వారిలో నుండి లాటరీ తీసి, తద్వారా ఎన్నుకోబడుతారు.
 • ఆయా రాష్ రాష్రాలలో 25% ప్రాంతాలు SC/ST వర్గాలకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. సామాన్య వర్గీకరణలో, రక్షణ సిబ్బంది/సైనిక సిబ్బంది/అంగ వికలురకు/అత్యుత్తమ క్రీడాకారులకు, 25 శాతం కేటాయింతబడింది. ఒకవేళ సామాన్య వర్గీకరణలో ఏ అభ్యర్థీలభించక పోతే ఒపెన్ కేటగిరీ (అందరికి అనుమతించిన)లో తరువాత సారి ప్రకటన (advertisement) వెలువడుతుంది.

రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్.జి.జి.వి.వై)

రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్.జి.జి.వి.వై) గురించి తరచూ అడిగే ప్రశ్నల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామీణ ఇంధన ఉత్పత్తి కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఎన్.ఆర్.ఇ.డి.సి.ఎ.పి- నెడ్ క్యాప్) చేపడుతున్న గ్రామీణ ఇంధన ఉత్పత్తి కార్యక్రమాలు.

గ్రామీణ ఇంధన ఉత్పత్తి కార్యక్రమాలు-1

గ్రామీణ ఇంధన ఉత్పత్తి కార్యక్రమాలు-2

గ్రామీణ ఇంధన ఉత్పత్తి కార్యక్రమాలు-3

సోలార్ రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ఉపకరణాలు

సోలార్ రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ఉపకరణాలు - నెట్ మీటరింగ్ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

వర్మి బెడ్

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పై వర్మి బెడ్ మరియు వానపాములు పంపిణీ పథకం గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ  క్లిక్ చేయండి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0073800738
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు