పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పునరుత్పాదక శక్తి

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రచారం పథకాలు మరియు స్కీములు ఈ విభాగంలో ఇవ్వబడింది.

సౌర లాంతరు పథకం

లక్ష్యాలు
  • కిరసనాయిలు లాంతర్లు, వత్తితో వెలిగే దీపాల స్థానంలో సౌర శక్తితో వెలిగే లాంతర్లను వినియోగించడం ద్వారా వెలుతురు కొరకు అయ్యే కిరసనాయిలు వాడకాన్ని తగ్గించడం.
  • శిలాజ ఇంధనాలు అవసరం లేని, కాలుష్యాలు విడుదల చేయని, ఆరోగయానికి హాని చేయని, అగ్ని ప్రమాదాల ముప్పు లేని, పర్యావరణానికి అనుకూలమైన కాంతి వ్యవస్థల వినియోగం ద్వారా గ్రామీణవాసుల జీవన స్థాయి మెరుగుపరచడం.
  • చిన్న చిన్న కాంతి అవసరాలకు ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని చూపించడం
ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంస్థలు

ఈ సౌర లాంతరు కార్యక్రమం రాష్ట్ర కేంద్ర సంస్థల ద్వారానూ, మరియు అక్షయ ఉర్జ దుకాణాల ద్వారా మాత్రమే అమలౌతోంది. తయారీదారులు లేక వారి సంఘాలు తెరిచిన / నిర్వహించే షాపులు ఈ పథకం కిందకి రావు. తమ దుకాణాలు ఈ లాంతరును అమ్మేందుకు తయారీదారులకు లక్ష్యాలను నిర్దేశించే అధికారం రాష్ట్ర కేంద్ర సంస్థలకు లేదు. అలాగే తయారీదారులకూ, వారి సంఘాలకూ, లేదా ప్రభుత్వేతర సంస్థలకూ సరాసరి అమ్మకం చేసేందుకు మంత్రిత్వ శాఖ కూడా ఎటువంటి లక్ష్యాలూ పెట్టదు.

అర్హత కలిగిన లబ్ధిదారులు
  • ప్రత్యేక కోవకు చెందిన రాష్ట్రాలలోని మరియు కేంద్ర పాలిత దీవులలోని, విద్యుత్ సదుపాయం లేని గ్రామాలలో అన్ని వర్గాలకు చెందిన వ్యక్తిగత లబ్ధిదారులు & లాభాపేక్ష లేని సంస్థలు ఈ పకం కింద సౌర లాంతర్లు పొందడానికి అర్హులు.
  • ఒక కుటుంబానికి ఒకటి కన్నా ఎక్కువ సౌర లాంతర్లు ఇవ్వబఢవు.
  • ఆడపిల్లల్లో విద్యను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఒక్కొక్క దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలో, 6 నుంచి 12 తరగతి చదివే ఒక అమ్మాయికి ఒక సౌర లాంతరు ఉచితంగా ఇస్తారు. అయితే ఇంక ఆమె స్కూలు చదువు పూర్తయ్యేవరకూ ఇంకొక సౌర లాంతరు పొందడానికి అర్హురాలు కాదు. ఆడపిల్లలకు ఈ సౌర లాంతర్లు పంపకం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర సంస్థలు చేపడతాయి. ఇందుకు గాను జిల్లా కార్యాలయం వారి సహకారంతో ఆ బాలిక చదువుతున్న తరగతి, పాఠశాల గురించిన వివరాలను, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల హొదాను తనిఖీ చేస్తారు. లబ్ధిదారులు గుర్తింపు కొరకు సంబంధిత సంస్థకు రేషన్ కార్డు, వోటరు గుర్తింపు కార్డు వంటివి చూపించవలసి ఉంటుంది.
  • ఎస్.సి. /ఎస్.టి. లబ్ధిదారులకు సౌర లాంతర్లు: ఈ కార్యక్రమాన్ని అమలు చేసే సంస్థలు, పంపకానికై ఇచ్చిన సౌర లాంతర్లలో కనీసం 15 % షెడ్యూలు కులాల వారికి, 10 % షెడ్యూలు తెగల వారికి అందేటట్లు చూడాలి.
  • సౌర లాంతరు పధకంలో స్త్రీల పాత్ర: ఈ సౌర లాంతర్లు ముందుగా ఆడపిల్లల వసతి గృహాలకూ, స్త్రీ వయోజన విద్యా కేంద్రాలకూ మరియు డ్వాక్రా కేంద్రాలకూ పంపిణీ చేయాలి. పాఠశాలకు వెళ్ళే ఆడ పిల్లలు ఉన్న కుటుంబాలకు కూడా ముందు ఇవ్వాలి.
  • సౌర లాంతర్ల పంపిణీ ఒకే కూటమి పద్ధతిలో చేపట్టినట్లయితే, దాని అమలు, నిర్వహణ, మరియు అమ్మకం అనంతరపు సేవలు, సౌర లాంతర్ల తనిఖీ సులభతరమౌతుంది.
ఆమోదింపబడ్డ సౌర లాంతర్ల నమూనాలు

స్వదేశీ సౌర లాంతర్లు

పూర్తీ విదేశీ సౌర లాంతర్లు ఈ పధకం పరిధి లోనికి రావు. కానీ విదేశీ బ్యాటరీలు మరియు ఇతర భాగాలు అనుమతింపబడతాయి. అయితే ఈ దిగుమతి చేసుకున్న భాగాలు ఎం.ఎన్.ఆర్.ఇ. నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోయేటట్లు ఉన్నాయో లేదో అని ఒక స్వతంత్ర పరీక్షా సంస్థ వాటి పని తీరును ధ్రువీకరించ వలసి ఉంటుంది.

ఈ పకాన్ని అమలుచేసే సంస్థలు కేవలం ఎం.ఎన్.ఆర్.ఇ. నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోయేటట్లు ఉండే సౌర లాంతర్లను మాత్రమే కొనుగోలు చేయాలి.

అక్షయ ఉర్జ షాపుల ద్వారా ఈ పధకం అమలుపరుచుట
  • రాష్ట్ర సంస్థలు, ప్రైవేటు వ్యాపార వేత్తలు మరియు ఎన్ జి.ఓలు పెట్టిన అక్షయ ఉర్జ దుకాణాలు సంబంధిత రాష్ట్ర సంస్థల నుండి లక్ష్యాలు పొంది ఎం.ఎన్.ఆర్.ఇ. నిబంధనలు మరియు మార్గసూచికలకు కట్టుబడి ఉండి అమ్మకాలు జరుపుకోగలరు.
  • పునః చెల్లింపు పద్ధతి పై అక్షయ ఉర్జ షాపులు రాష్ట్ర సంస్థల నుండి రాయితీ పొందవచ్చు. ఇందుకు గాను అవి పూర్తి చిరునామాలతో, అమ్మకపు తేదీలతో, అమ్మకపు వెలతో, నమూనాలు, ఉత్పత్తి దారుల పేరు, సమకూర్చబడిన వస్తువు మరియు పి.వి. భాగాల యొక్క క్రమ సంఖ్య, కొనుగోలుదారుల గుర్తింపు వివరాలు (రేషను కార్డు, టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, పాస్ పోర్టు, బాంక్ అక్కౌంట్) వంటి వివరాలతో కూడిన కొనుగోలుదారుల జాబితా ను సంబంధిత రాష్ట్ర సంస్థలకు సమర్పించవలసి ఉంటుంది.
  • ప్రైవేటు వారు మరియు ఎన్.జి.ఓ. ల వారు పెట్టుకున్న అక్షయ ఉర్జ దుకాణాలు కు రాయితీ మొత్తాన్ని, వారు పంపిణీ చేసిన సౌర లాంతర్లలో 20 % వాటిని యాదృచ్చిక పద్ధతిలో తనిఖీ జరిపిన తరువాత సంబంధిత రాష్ట్ర నోడల్ సంస్థ /ఎం.ఎన్.ఎ. ఎస్. ప్రాంతీయ కార్యాలయము వారు తిరిగి చెల్లిస్తారు.
కేంద్ర ఆర్ధిక సహకారం

రాష్ట్ర కేంద్ర సంస్థలు మరియు అక్షయ ఉర్జ దుకాణాలు ద్వారా అర్హత కలిగిన లబ్ధిదారులకు మంత్రిత్వ శాఖ ఒక సౌర లాంతరుకు Rs. 2,400 చొప్పున కేంద్ర ఆర్ధిక సహకారంను అందచేస్తుంది.

  • మంత్రిత్వ శాఖ సర్వీసు చార్జీల నిమిత్తం రాష్ట్ర కేంద్ర సంస్థలకు మరియు అక్షయ ఉర్జ దుకాణాలకు ఒక సౌర లాంతరుకు రూ. .100 చొప్పున అందచేస్తుంది. అక్షయ ఉర్జ దుకాణాలలో మరియు ఎన్.జి.ఓ.లు నడిపే షాపులలో అమ్మే సౌర లాంతర్లను తనిఖీ చేసేందుకు ఎం.ఎన్.ఆర్.ఇ., రాష్ట్ర కేంద్ర సంస్థలకు లాంతరుకు రూ. .100 చొప్పున అందచేస్తుంది. రాష్ట్ర కేంద్ర సంస్థలు నడిపే దుకాణాలకు వేరే సర్వీసు చార్జీలు ఇవ్వబడవు.
  • ఎం.ఎన్.ఇ. ఎస్. ఇచ్చే కేంద్ర ఆర్ధిక సహకారంలో 50 % ఎస్.ఎన్.ఏ.లకు అడ్వాన్సుగా ఇస్తారు. మిగిలిన 50 % కేంద్ర ఆర్ధిక సహకారం మరియు సర్వీసు చార్జీలు పధకం పూర్తయిన తర్వాత ఇస్తారు.

అక్షయ్ ఊర్జా దుకాణాలు

భారతదేశపు నవ్య మరియు పునరుత్పత్తి శక్తి మంత్రత్వ శాఖ, పెద్ద నగరాలలో ఆదిత్య సౌర దుకాణాలను ఏర్పరచడాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ దుకాణాలు ఇప్పుడు అక్షయ్ ఊర్జా దుకాణాలు (Akshay urja shopa) గా పిలవబడుచున్నాయి. ఇవి అన్ని రకాల పునరుత్పత్తి శక్తి సాధనాలు మరియు వ్యవస్ధలను, సౌర శక్తి ఉత్పత్తులతో సహా అమ్మకాలకు మరియు, నిర్వహణకు ఉద్దేశించబడ్డాయి. ఈ దుకాణాలు, దిగువ పేర్కొన్న విధులను నిర్వహిస్తాయి.

  • వివిధ రకాలైన పునరుత్పత్తి శక్తి మరియు శక్తి సామర్ధ్యం గల సాధనాల అమ్మకం
  • పునరుత్పత్తి శక్తి సాధనాలను మరమ్మతు చేయుట, నిర్వహణ లోపాలను సరిచేయుట
  • పునరుత్పత్తి శక్తి సాధనాలు మరియు వ్యవస్ధల గురించిన సమాచారం ప్రచారం చేయుట, మరియు
  • వ్యక్తులు / సంస్ధలు ( కంపెనీలు) పునరుత్పత్తి శక్తి సాధనాలను వినియోగించుటకై ప్రోత్సహించుట
ఆర్ధిక సహాయం తీసుకొనుటకు అర్హత కలిగిన సంస్ధలు

రాష్ట్ర కేంద్ర సంస్ధలు ( state nodal agencies) , వ్యాపారులు ( private enterprenaurs) మరియు సేవా సంస్ధలు ( ngos) , దేశంలోని అన్ని జిల్లాలలో ఈ దుకాణాలను స్ధాపించి నిర్వహించగలవు.

ధన సహాయము
  • అభ్యర్ధులు, ఏర్పాటు చేసే సంస్ధ యొక్క వ్యయంలో 85 శాతం పరిమితి వరకూ రుణాలు, నిర్ధేశిత బ్యాంకుల నుండి, 10 లక్షలకు మించకుండా 7 శాతం వడ్డీ రేటు తో పొందడానికి అర్హులు. ఇది, ఐదు సంవత్సరాల కాల పరిమితితో తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
  • రాష్ట్ర కేంద్ర సంస్ధల ( state nodal agencies) ద్వారా ప్రభుత్వం నిర్ణీత సమయానికి విడుదల చేసే గ్రాంటులు ( మంజూరు చేసే ధనం) ప్రోత్సహకాలు ( నియమిత ఆదాయాన్నీనుసరించి)
  • కార్మికులకు, విద్యుత్తు, టెలిఫోన్ బిల్లులు మరియు యితర రకాలైన ఖర్చులకు, నెలకు 5000 చొప్పున ప్రభుత్వం యిచ్చే గ్రాంటు.
  • ఈ దుకాణాల నిర్వహణలో నెలకు కనిష్టంగా 50,000 రూపాయల ఆదాయం, మొదటి సంవత్సరములో ఉన్నప్పుడు మరియు నెలకు కనిష్టంగా 1,00,000 రూపాయల ఆదాయం రెండవ సంవత్సరములో ఉన్నప్పుడు ప్రోత్సాహకంగా (incentive) 5,000 రూపాయలు నెలకు అందుతుంది.
  • ఈ పకం , రాష్ట్ర కేంద్ర సంస్ధలు మరియు ireda ల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది.
ఈ దుకాణాల స్ధాపనకు అనుసరించవలసిన సూచనలు
  • ప్రతీ జిల్లాలో కేవలం ఒక్క దుకాణమే ఏర్పాటు చేయాలి. ఇప్పటికే, ఈ దుకాణాలు ఏర్పాటు చేసిన జిల్లాలలో మరికొన్ని దుకాణాలు ఏర్పాటు చేయుటకు అర్హత లేదు.
  • ఈ దుకాణమునకు కనీసం 200 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన స్ధలం అవసరం. ( గిడ్డంగి నిలువ ఉంచే స్ధలాన్ని మినహాయించి). ఈ దుకాణములు నిర్మించాలి లేదా కొనాలి లేదా పునరుద్దరించబడాలి. బాడుగకు తీసుకున్న దుకాణాలు, ప్రభుత్వ సహకారానికి అర్హత పొందవు.
  • ఈ దుకాణం నగరంలోని ముఖ్యమైన ప్రదేశంలో ఉండి, అక్కడకి చేరడానికి అనువైన సౌకర్యాలు కలదై ఉండాలి.
  • ఈ దుకాణం యొక్క పేరు దేశం మొత్తం మీద ఒకటే ఉండాలి. అక్షయ్ ఊర్జా షాప్ (Akshay urja shop) అన్న పేరు కనీసం 8 x 3 సైజు కల కాంతి వంతమైన ఫలకం (board) పై వ్రాయబడి ప్రదర్శించబడాలి. దుకాణం యొక్క పేరు ఆరంభంలో వేరే పదంతో ఉండవచ్చు. ఉదాహరణకు దుకాణ యజమాని పేరుతో ఉండి, తరువాత .............. అక్షయ్ ఊర్జా షాప్ అని ఉండాలి.
  • ఈ దుకాణం, అందంగా, ఆకర్షణీయంగా, విద్యుదీపాలంకరణతో, వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉండాలి.
  • ఈ దుకాణంలో కనీసం ఇద్దరు ఉద్యోగులు ఉండాలి. అందులో ఒకరు సాంకేతిక నిపుణుడై ( టెక్నిషియన్ ), పునరుత్పత్తి శక్తి సాధనాలను బాగు చేసి, నిర్వహించగలవాడై ఉండాలి.
  • నవ్య మరియు పునరుత్పత్తి శక్తి మంత్రత్వ శాఖ, దుకాణాలలో నియమింపబడిన ఉద్యోగుల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండరు.
  • ఈ దుకాణం, సాధారణ వ్యాపార దుకాణాల వలెనే పని చేయాలి. ఆ విధంగా ఆదాయం కూడ ఆర్జించగలిగి ఉండాలి.
  • దుకాణంలో అమ్మే వస్తువుల, సాధనాలకు, మరమ్మత్తు, సంరక్షణ సౌకర్యం, కేవలం తాము అమ్మినవాటికే కాక, వేరే సంస్ధల నుండి తయారైన శక్తి ఉత్పత్తులు, అమర్చబడిన సాధనాలకు కూడ సరసమైన ధరలో మరమ్మత్తు చేయాలి.
  • ఈ దుకాణం, వినియోగదారుడితో స్నేహపూర్వకంగా మెలిగే సంస్ధగా ఉండాలి. కఠినంగాగాని, అనువుగాని వేళల్లో వ్యాపారం గాని, నిర్లక్ష్యధోరణి గాని అవలబించకూడదు.
  • ఈ దుకాణం అనేక మంది ఉత్పత్తిదారుల ఉత్పత్తిచేసిన పునరుత్పత్తి శక్తి సాధనాలను వివిధ నమూనాల్లో ప్రదర్శిస్తుంది. ఆ విధంగా, వినియోగదారుడు తనకు కావలసిన వస్తువులను ఎన్నుకోగలుగుతాడు.
  • ఈ దుకాణంలో అమ్మే వస్తువుల ధరల పట్టిక తగిన విధంగా ప్రజలకు తెలిసే విధంగా ప్రకటించాలి. అంతే కాకుండా, తమ వద్దకు వచ్చే వ్యక్తులకు ( వినియోగదారులకు) ఈ సాధనాల గురించి సమాచారం వివరించాలి.
  • ఈ సౌర దుకాణాలు వ్యాపారపరంగా తగిన గుర్తింపు పొందడానికి, శక్తి - సామర్ధ్యం కలిగిన వస్తువులను ఉదాహరణకు, చిన్నవైన ఫ్లోరోసెంట్ దీపాలు ( cfl – compact fluor escent lamps) విద్యుద్దీపాలకు కావలసిన అదనపు హంగులు, అధిక సామర్ధ్యం కల కిరోసిన్ స్టవులు మొదలైన వాటిని, తాము అమ్మే పునరుత్పత్తి శక్తి సాధనాలకు సంబంధించిన వస్తువులతో పాటు అమ్మవచ్చు.
  • వినియోగదారుల సౌకర్యార్ధం, దుకాణం, బ్యాంకుల సహకారంతో వివిధ పునరుత్పత్తి శక్తి ఉత్పత్తులను కొనడానికి సులభమైన రుణ ఏర్పాట్లు కూడ చేస్తుంది.

జాతీయ జీవ ఇంధన పాలసీ

నూతన మరియు తరగని ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ జీవ ఇంధనము మీద ఒక జాతీయ పాలసీ తయారు చేసింది. 11 తేదీ సెప్టెంబరు 2008 న కేంద్ర కేబినెట్ కమిటీ దానిని ఆమోదించింది.

జాతీయ జీవ ఇంధన విధి పాలసీలో ముఖ్యమైన అంశములు
  • బయో ఇథనాల్ మరియు బయో డీజిల్ వంటి జీవ ఇంధనాలను 2017 నాటికి 20% వరకు కలపాలనే లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతిపాదించబడ్డాయి.
  • బయోడీజిల్ ఉత్పత్తిని ఆహారంగా ఉపయోగించబడని నూనె విత్తనములు, బీడుగానున్న / పనికిరాని /సాగు చేయని భూములలో పండించవలెనని ప్రతిపాదించబడ్డాయి.
  • బయోడీజిల్ ఉత్పత్తికి కావలసిన మొక్కలను స్వదేశీయంగా పెంచుకొనుట మీద ప్రణాళికలు కేంద్రీకరించ బడ్డాయి. పామ్ మరియు నూనె ఆధారిత ఫ్రీ ఫ్యాట్ ఆసిడ్ మొక్కల దిగుమతి చేసుకోడాన్ని నిరాకరించ బడ్డాయి.
  • బయోడీజిల్ మొక్కలను ప్రజల / ప్రభుత్వ / వ్యర్థ అటవీ భూములలో పెంపకాన్ని ప్రోత్సాహించుట అదే సమయంలో సారవంతమైన సాగు భూములలో పెంపకాన్ని ప్రోత్సహించకుండుట.
  • కనీస మద్ధతు ధర, నియమిత కాలంలో బయోడీజిల్ విత్తనాల సవరించిన ధరలను ప్రకటించుట ద్వారా రైతులు చౌకగా విత్తనములు పొందుట. కనీస మద్ధతు ధర వివరముల సంవిధానం, జాతీయ జీవ ఇంధన పాలసీలో సంరక్షించబడి, జాగ్రత్తగా పరిశీలించబడి ఆ తరువాత బయో ఫ్యూయల్ స్టీరింగ్ కమిటీచే ఆమోదించబడుతుంది.
  • కనీస కొనుబడి ధర, ఆయిల్ మార్కెటింగ్ కమిటీల ద్వారా బయోడీజిల్ కొనబడడమనేది వాస్తవంగా ఉత్పత్తికి అయ్యే ఖర్చు మరియు బయోడీజిల్ ఎగుమతి ధర మీద ఆధారపడిఉంటుంది. బయో డీజిల్ విషయంలో కనీస కొనుబడి ధర డీజిల్ చిల్లర ధరపై ముడిపడి ఉంటుంది.
  • జాతీయ జీవ ఇంధన పాలసీ, జీవఇంధనాలైన బయో ఇథనాల్ మరియు బయో డీజిల్ ప్రభుత్వము ద్వారా “ప్రకటితమైన వస్తువుల” పరిధి క్రిందకు తీసుకునిరాబడి రాష్ట్రాల లోపల మరియు రాష్ట్రాల వెలుపల స్వేచ్ఛగా రవాణా చేయబడుటకు, ప్రభుత్వం పరిశీలన చేస్తుంది.
  • ఈ విధి, పాలసీలో బయోడీజిల్ పై ఎటువంటి పన్నులు మరియు సుంకములను వేయకూడదని స్పష్టం చేయబడింది.
  • జాతీయ జీవ ఇంధన సమన్వయ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
  • జాతీయ జీవ ఇంధన నిర్దేశిత కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షులుగా ఉంటారు.
  • జీవ ఇంధనములపై పరిశోధన విషయములపై ఒక ఉప కమిటీ, స్టీరింగ్ కమిటీ క్రింద ఏర్పాటు చేయబడి ఆ సబ్ కమిటీ బయోటెక్నాలజీ విభాగము, వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల అధ్వర్యములో నడుపబడి మరియు జాతీయ ఇంధనవనరుల మంత్రిత్వ శాఖల ద్వారా సమన్వయముచే పని చేస్తుంది.
  • ప్రాధాన్యత అంశములైన పరిశోధన, ఆభివృద్ధి మరియు ప్రదర్శనవంటి వాటికి తగిన విలువనిస్తూ మొక్కల పెంపకము, ప్రోసెసింగ్ మరియు సాంకేతిక ఉత్పత్తులు తరువాత తరాల సెల్యులోజిక్ జీవ ఇంధనాలతో కలిపి వాటి మీద ధృష్టిని కేంద్రీకరిస్తుంది.

విద్యుచ్ఛక్తి చట్టం 2003 లోని పువరుత్పాదక శక్తికి సంబంధించిన చట్ట నిబంధనలు.

సంప్రదాయ బద్ధంకాని శక్తి వనరులు గురించి విద్యచ్ఛక్తి చట్టంలో ఉన్న నిబంధనలు క్రింద పేర్కోనబడినవి.
విభాగము 3 (1) మరియు 3 (2) :- విభాగము 3 (1) మరియు 3 (2)ల ననుసరించి కేంద్ర ప్రభుత్వం సమయానికి జాతీయ విద్యుత్ పథకం మరియు సుంకాల పట్టికను పరిశీలించి, తయారు చేసి, ప్రచురిస్తుంది. ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుచ్ఛక్తి వ్యవస్థ అభివృద్ధి సంస్థ యొక్క సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విద్యుచ్ఛక్తి వ్యవస్థ అభివృద్ధి సంస్థ, తను ఆధారపడే వనరులైన బొగ్గు, సహజ వాయువు, అణు పదార్థాలు, జలవిద్యుత్తు మరియు పునరుత్పాదక శక్తి వనరులు వంటి వాటి పూర్తి వినియోగం పొందగలిగేటట్లు కార్యాచరణ సాగిస్తుంది.
విభాగము (4) :- విభాగము (4) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరునాత ఒక జాతీయ కార్యచరణ విధానాన్ని ఏర్పరచి, గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన విద్యుత్ వ్యవస్థలను ప్రకటిస్తుంది. (శక్తి వనరుల పునరుత్పాదకత మరయు సంప్రదాయ బద్ధం కాని శక్తి వనరులను కూడ కలుపుకుని ఈ పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.)
విభాగం (61) :- విభాగం 61, 61 (h) 61 (i) ప్రకారం ఒక ప్రత్యేకమైన అధికార సంఘం, ఈ చట్టంలోని నిబంధనలనమసరించి, సుంకం విధింపు (Tariff policy) ని నిర్ణయించడంలో కొన్ని షరతులు, నియమాలను స్పష్టీకరిస్తుంది. ఈ పని చేయడంలో, విద్యుదుత్పత్తి, విద్యుత్తు సహకార ఉత్పత్తి, (శక్తి పునరుత్పాదక వనరుల నుండి) ల తోడ్పాటు; మరియు జాతీయ విద్యుత్ కార్యాచరణ విధానం, (Electricity Policy) సుంత విధానం (Tariff policy) ల సహకారం, మార్గనిర్దేశికత్వం స్వీకరిస్తుంది.
విభాగం 86 (i) :- విభాగం 86 (i) మరియు 86 (i) (c) ల ప్రకారం రాష్ట్ర అధికార సంఘాలు క్రింద పేర్కొనబడిన విధులను నిర్వహించాలి. శక్తివనరుల పునురుత్పాదన ద్వారా విద్యుదుత్పత్తి, సహాకార విద్యుత్ ఉత్పత్తి అభివృద్ధి పరచడం, విద్యుదుత్పత్తి కేంద్రం (గ్రెడ్) కు, విద్యుత్తును ఎవరైనా వ్యక్తికి గాని, అమ్మే ప్రక్రియలో సరైన విధంగా అనుసంధానించడం, ఇటువంటి అమ్మకపు విధానంలో అప్రాంతపు అనుమతించబడిన పంపిణీ కేంద్రం నుండి వినియోగింపబడే మొత్తం విద్యుత్తులో ఆ వ్యక్తికి యివ్వవలసిన శాతం నిర్ణయించడం.

వివిధ పునః సృష్టి కాగల శక్తి పథకాలు/ప్రోగ్రాముల క్రింద ఇచ్చే కేంద్ర ఆర్థిక సహాయం (సి ఎఫ్ ఏ)

సోలార్ ఫోటో వోల్టాయిక్ (ఎస్ పి వి) సిస్టమ్ కు సంబంధించి సవరించిన పెట్టుబడి సబ్సిడీ, బెంచ్ మార్క్ వెల

01.04.2011 నుంచి వర్తించే విధంగా సవరించిన ఫోటో వోల్టాయిక్ బెంచ్ మార్క్ వెల: రూ. 270 / డబ్ల్యు పి.( బ్యాటరీ వుంటే) ; బ్యాటరీలు లేకుంటే: రూ.190 / డబ్ల్యు పి. ( 08.07.2010వ తేదీనాటి అడ్మినిస్ట్రేటివ్ అప్రువల్ -5/23/2009-10/పి& సి లోని 5.3 పేరాలో సూచించిన విధంగా ).

సాధారణ క్యాటగిరీ రాష్ట్రాలలో , సి ఎఫ్ ఏ 30 %. బ్యాటరీ వున్నవాటికి రూ.81 / డబ్ల్యు పి , బ్యాటరీలేనివాటికి రూ.57 కు మించకుండా. ప్రత్యేక వర్గీకరణకు చెందిన రాష్ట్రాలు / ఈశాన్య రాష్ట్రాలలో, సి ఎఫ్ ఏ 90 %. బ్యాటరీ వున్నవాటికి రూ.243 / డబ్ల్యు పి , బ్యాటరీలేనివాటికి రూ.171 కు మించకుండా.

మూలం: నూతన, పునర్వినియోగ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

సూర్యశక్తి కుక్కర్లకు కేంద్ర ఆర్థిక సహాయం

a) సూర్యశక్తి కుక్కర్ల పై దృ,ష్టి

సూర్యశక్తి కుక్కర్ రకం వినియోగదారులకు సహాయం రాష్ట్రస్థాయి భాద్యతా సంస్థలకు ఇచ్చు సేవా రుసుం
పళ్ళెం లాంటి సూర్యశక్తి కుక్కర్ (వైశాల్యపు కొలతలు 1.4 మి, కనిష్టం) మొత్తం ధరలో 30%,ఒక్కో కుక్కర్ కు గరిష్ట పరిమితి రూ.1500/- లు. ఒక్కో కుక్కర్ పై రూ.250/-లు. సేవారుసుం
ఇంటిలోపల వంటచేసే నిమిత్తం సామాజిక సూర్యశక్తి కుక్కర్ (కుక్కరు లోపలి చుట్టుకొలత 7 చ.మీ.,కనిష్టం) అర్హత కలిగిన మూలధనంలో 30% ధర, ఒక్కో కుక్కర్ కు గరిష్టంగా రూ 15000/- లు ఒక్కో కుక్కర్ పై రూ.2500/-లు. సేవారుసుం

b) రాష్ట్ర భాద్యతాయుత సంస్థలకు (State Nodal Agencies (SNAs)) మరియు వారితో కలసి సూర్యశక్తి కుక్కర్ల అమ్మకాలు పెంచే వారికి ప్రోత్సహకాలు

అమ్మిన సూర్యశక్తి కుక్కర్ రకము యస్.యన్.ఏ తన స్వంత ఉత్పత్తులు అమ్మే దుకాణం ద్వారా అమ్మినందులకు గాను ఒక్కో కుక్కర్ కు చెల్లించే ప్రోత్సహక రుసుం (రూ.) యస్.యన్.ఏ తనతో పాటు కలసి అమ్మకాలు చేస్తున్న వారి ద్వారా అమ్మినందులకు గాను ఒక్కో కుక్కర్ కు చెల్లించే ప్రోత్సహక రుసుం (రూ.)
యస్.ఎన్.ఏ కలసి అమ్మకాలు పెంచే వారు
ఐ.యస్.ఐ ముద్ర తో ఉన్న పెట్టె కలిగిన సూర్యశక్తి కుక్కర్ I 200 100 100
ఐ.యస్.ఐ ముద్ర లేనివి, యస్.ఇ.సి. సూర్యశక్తి కుక్కర్ /ఆర్.టి.సి వారి ఆమోదం పొందిన కుక్కర్ లు. 100 50 50

ఆధారం : www.mnre.gov.in

వరుస నెంబరు

పథకాలు/ రంగం

రాయితీ

1

కుటుంబ తరహా బయోగ్యాస్ ఉత్పత్తి యంత్రాగారాలు

సిక్కింతో సహా ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు (అస్సాంలో సమతల ప్రదేశములు మినహా)

ఒక ఘనపు మీటరుకి రూ.14,700

అస్సాంలో సమతల ప్రదేశములు

ఒక ఘనపు మీటరుకి రూ. 9,000 ( 2-4 ఘ.మీ.కిరు. 10,000/- పరిమితం చేయబడింది. స్థిరమైన డోమ్ రకం

జమ్మూ. & కాశ్మీరు, హిమచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ ( కొండ ప్రాంతములు మినహాయించి), తమిళనాడులో నీలగిరి లు, సాదర్ కుర్సూంగ్ మరియు డార్జిలింగ్ యొక్క కలీమ్క్ పాంగ్ సబ్ డివిజన్ల, సుందర్ బన్స్, అండమాన్ & నికోబార్ దీవులు

రూ. 4,000 (2-4 ఘ.మీ.కిరు. 10,000/- పరిమితం చేయబడింది. స్థిరమైన డోమ్ రకం)

ఇతరులందురు

రూ.4,000 (స్థిరమైన గుమ్మటము తరహా కర్మాగారా నికి, ఒక ఘనపు మీటరుకి రూ. 8,000/- వరకు)

 

 

2

బయోమాస్ తో గ్యాస్ తయారు చేసే ఉపకరణలు

i

గ్రామీణ ప్రాంతాలకు బయోమాస్ తో గ్యాస్ తయారు చేసే ఉపకరణలు

ప్రతి 100 కిలోవాట్ కి రూ. 1.50 లక్షలు-థెర్మల్ మరియు ఎలక్ట్రోమెకానికల్ ఉపయోగాలకు (రెండు ఇంధనాలతో నడిచే ఇంజిన్తో). ప్రతి 100 కిలోవాట్ కి రూ. 15.00 లక్షలు – 1 మెగావాట్ వరకూ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేవాటికి (100 % ( వంద శాతం) గ్యాస్ ఇంజిన్ ఉత్పత్తితో) ప్రత్యేకమైన కేటగిరీ రాష్ట్రాలు & దీవులకి 20% ( 20 శాతం) ఎక్కువ రాయితీ.

ii

పారిశ్రామిక ఉపయోగాలకు బయోమాస్ తో గ్యాస్ తయారు చేసే ఉపకరణలు

ప్రతి 300 కిలోవాట్ కి రూ.2.00 లక్షలు థెర్మల్ ఉపయోగాలకు, రెండు ఇంధనాలతో నడిచే ఇంజిన్ తో ప్రతి 100 కిలోవాట్ కి రూ. 2.50 లక్షలు, 100% గ్యాస్ ఇంజిన్ ఉత్పత్తితో ప్రతి 100 కిలోవాట్ కి రూ. 10.00 లక్షలు. సంస్థ లలో 100% గ్యాస్ ఇంజిన్ ఉత్పత్తితో ప్రతి 100 కిలోవాట్ కి రూ. 15.00 లక్షలు.

3

పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాల నుండి శక్తి పథకాలు

సాంకేతిక విధానాన్ని బట్టి, మెగావాట్ కి రూ. 50.00 లక్షల నుండి రూ.1.00 కోటి వరకు (ప్రత్యేకమైన కేటగిరీ రాష్ట్రాలు & దీవులకి 20% ఎక్కువ రాయితీ.)

4

సోలార్ ఫోటోవాల్ టైక్ (ఎస్ పి వి)

 

ఎస్ పి వి లాంతర్లు

 

ఎస్ పి వి ఇంటి లైట్ల విధానాలు.

 

 

ఎస్ పి వి వీధి లైట్ల విధానాలు.

 

ఒక కిలోవాట్ కన్నా ఎక్కువ సామర్ధ్యం గల ఒకే ఎస్ పి వి విద్యుత్ కర్మగారం

 

10 కిలోవాట్ల కన్నా ఎక్కువ సామర్ధ్యం గల ఒకే ఎస్ పి వి విధ్యత్ కర్మగారం

ఈశాన్య మరియు ప్రత్యేకమైన ప్రాంతాలకు రూ. 2,400; ఇతర ప్రాంతాలకు ఏమీ లేవు

ఈశాన్య మరియు ప్రత్యేకమైన ప్రాంతాలకు రూ. 4500 నుండి 8,600 వరకు, మరియు మోడల్ ని బట్టి మామూలు ప్రాంతాలకు రూ. 2500 నుండి 4,800 వరకు
ఈశాన్య మరియు ప్రత్యేకమైన ప్రాంతాలకు రూ. 17,300, మామూలు ప్రాంతాలకు రూ. 9,600

ఈశాన్య మరియు ప్రత్యేకమైన ప్రాంతాలకు రూ. 2,25,000/కిలోవాట్, మామూలు ప్రాంతాలకు రూ.1,25,00/కిలోవాట్
ఈశాన్య మరియు ప్రత్యేకమైన ప్రాంతాలకు రూ. 2,70,000/ కిలోవాట్, మామూలు ప్రాంతాలకు రూ. 1,50,000/ కిలోవాట్

5

పట్టణ ప్రాంతాలలో సోలార్ ఫోటోవాల్ టైక్ (ఎస్ పి వి) ఉపయోగాలు

ఎస్ పి వి వీధిలైట్ల నియత్రించు విధానాలు
ఎస్ పి వి వీధి / ప్రజా ఉద్యాన వనముల కొరకు లైట్లు (74/75 వాట్ల మోడ్యూళ్ళు)

 

ఎస్ పి వి కాంతి వంతమైన వ్యాపార ప్రకటనలు (1 కిలోవాట్ వరకు ఎస్ పి వి మోడ్యూల్ తో)
ఎస్ పి వి రోడ్ స్టడ్ లు

ఎస్ పి వి బ్లింకర్లు (కనీసం 37 వాట్ల మోడ్యూల్)
ఎస్ పి వి ట్రాఫిక్ సిగ్నళ్ళు (కనీసం 500 వాట్ల మోడ్యూల్)
ఎస్ పి వి పవర్ ప్యాక్ లు (1 కిలోవాట్ వరకు మోడ్యూల్)

25 % ( శాతం) వరకు ఖర్చు రూ. 5000/- వరకు

 

50% వరకు ఖర్చు – 11 వాట్ల సి ఎఫ్ ఎల్ కి రూ. 10,000/- వరకు మరియు 18 వాట్ల సి ఎఫ్ ఎల్ కి రూ. 12,000/- వరకు.
50% వరకు ఖర్చు, 100వాట్ మోడ్యూల్ కి రూ. 15,000 వరకు

 

50% వరకు ఖర్చు,రూ. 1000/- వరకు

50% వరకు ఖర్చు,రు. 7,500/- వరకు

 

50% వరకు ఖర్చు,రూ. 2.5 లక్షల వరకు

50% వరకు ఖర్చు, ఒక కిలోవాట్ కి రూ. 1.00 లక్షల వరకు

6

ఎస్ పి వి నీటిని పంపుచేసే విధానములు

ప్రతి ఎస్ పి వి వాట్ ఏర్పాటు వాడకానికి రూ.30, ప్రతి విధానానికి రూ. 50,000 వరకు.

7

సోలార్ థెర్మల్ విధానములు /పరికరాలు

బాక్సు తరహా కుక్కర్లు:
ఎస్ ఎన్ ఏ కి ప్రోత్సాహకాలు :
- ఐ ఎస్ ఐ బ్రాండ్ కుక్కర్ కి రూ. 200
- ఐ ఎస్ ఐ బ్రాండ్ కాని కుక్కర్ కి రూ. 100
- పబ్లిసిటీ/వర్క్ షాపు మొదలైన వాటికి రూ.1.50 లక్షలవరకు
- తయారు చేయువారికి సహకారం: బి ఐ ఎస్ ఆమోదం పొందడానికి కావలసిన ఫీజులో 50% (శాతము) సహకారం.

సోలార్ ద్వారా నీటిని వేడిచేసే విధానములు:
-ఇంటిలో ఉపయోగించేవారికి 2 శాతము చొప్పున, సంస్థల కు 3% చొప్పున మరియు సంఘంలో ఉపయోగించే వారికి 5% చొప్పున ఋణములో రాయితీ. అంతే కాకుండా ప్రోత్సహించేవారికి ఇన్సెంటివ్ రూపంలో ప్రతి చదరపు మీటరు కలెక్టరు ప్రాంతానికి రూ.100
- వ్యాపార సంస్థలకి/ సంస్థలకి, ప్రతి చదరపు మీటరుకి రూ. 825/1100.
సోలార్ ద్వారా గాలి ఉష్ణోగ్రతని పెంచే/ఆవిరిని ఉత్పత్తిని చేసే విధానములు:
పెట్టుబడి ఖర్చులో 35-50% చొప్పున రాయితీ, కొన్ని పరిమితుల వరకు.
డిష్/కమ్యూనిటీ తరహా కుక్కర్లు:
డిష్ తరహా కుక్కర్లకు ఖర్చులో 50%, రూ. 2,500 వరకు మరియు షెఫ్లర్/ కమ్యూనిటీ తరహా కుక్కర్ల కి రూ.25, 000.

8

అక్షయ్ ఉర్జా అంగడులు

రూ. 10 లక్షల వరకు 7% చొప్పున రాయితీ, మరియు నిర్వహణ ఆధారంగా నెలకి రూ. 10,000 వరకు సహాయం & ఇన్సెంటివ్.

9

మారుమూల గ్రామాల విద్యుద్ధీకరణ

విద్యుత్తు ఉత్పత్తి విధాన ఖర్చులో 90%, ముందుగా నిర్దేశించిన మరియు ఈ క్రింద ఇచ్చిన పరిమితుల వరకు:
- డిస్ట్రిబ్యూటెడ్ ఉత్పత్తి విధానాలకి, ఒక ఇంటికి రూ.18,000, మరియు
- ఎస్ పి వి ఇంటి- లైటింగు విధానాలకి, ఒక ఇంటికి రూ.11, 250.

ఆధారము: http://mnre.gov.in/

జాతీయ బయోగ్యాస్‌, సేంద్రియ ఎరువుల నిర్వహణా కార్యక్రమం(ఎన్‌బిఎంఎంపి)

ఈ జాతీయ బయోగ్యాస్ అభివృద్ధి పథకం అనేది 1981-82లో ఆరంభం అయ్యింది.

లక్ష్యాలు
  • కుటుంబాలకోసం ఉద్దేశించిన బయోగ్యాస్ ప్లాంట్లద్వారా గ్రామీణ కుటుంబాలకు వంటగ్యాసును, సేంద్రియ ఎరువులనుఅందించడం.
  • గ్రామీణ మహిళల వంటచెరకుకోసం పడే కష్టాలను తొలగించడం. అడవులలో చెట్లనునరికే పనుల తగ్గించడం, సామాజిక లాభాలుపెంచడం.
  • గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యతను మెరుగుపరచడం. దానికి సురక్షిత మరుగుదొడ్లనునిర్మంచి వాటిని బయోగ్యాస్ ప్లాంట్లతో అనుసంధించడం.
విడి భాగాలు
  • పూర్తిస్వదేశీయంగా అభివృద్ధి చేసిన బయోగ్యాస్ ప్లాంట్ నమూనాలనిప్రోత్సాహించడం జరుగుతుంది.
  • వీటిని అమలు చేయడానికి రాష్టాలు కొన్నినోడల్ శాఖలను, నోడల్ ఏజన్సీలను ఏర్పాటు చేసింది. ఖాదీ గ్రామపరిశ్రమల కమీషన్, ముంబై జాతీయ పాల సేకరణ అభివృధ్ధి, ఆనంద్(గుజరాత్)తోబాటు పలు జాతీయ, ప్రాంతీయప్రభుత్వేతర సంస్థలు అమలుచేయడంలో నిమగ్నమైఉన్నాయి.
  • ఈ ప్రాజెక్ట్ కింద పలురకాలైన ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. వీటిలోకేంద్ర ఆర్ధిక సాయం, వినియోగ దారులకు టర్న్ కీ పనుల ఫీజు, రాష్ట్ర నోడల్ శాఖలకు. ఏజన్సీలకు సేవా ఛార్జీలు, ఇంకా శిక్షణ, ప్రచారాలకు తగిన సాయం ఉన్నాయి.
  • వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలనుసమర్థించడం జరుగుతుంది. బయోగ్యాస్ అభివృద్ధి, శిక్షణాకేంద్రాలు 9 ప్రధాన రాష్ట్రాలలోనిర్వహించడం జరుగుతోంది. ఇవి రాష్ట్ర నోడల్ శాఖలకు, సంస్థలకు సాంకేతికతను, శిక్షణా సాయాన్నిస్తాయి.
  • వ్యవసాయ ప్రాధాన్యతగల ప్రాంతాల్లోబయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వ్యాపార, సహకార బ్యాంకులు అప్పులుఇస్తున్నాయి.నాబార్డు(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) వివిధబ్యాంకులకుఆటోమేటిక్ రీఫైనాన్సింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది.
ఆమోదించిన గృహరకమైన బయోగ్యాస్ ఎరువు కర్మాగారముల నమూనాలు

1. ముందుగా అమర్చి, సిద్ధంచేసిన బయోగ్యాస్ కర్మాగారాల నమూనా

  • రి ఇన్‌ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్ సి సి)తో తయారుచేసి,ముందుగా అమర్చి, సిద్ధంచేసిన , స్థిరంగా ఉండే పైకప్పు నమూనా
  • ముందుగా అమర్చి, సిద్ధంచేసిన, ఆర్ సి సి డైజెస్టర్ కె వి ఐ సి రకం బయోగ్యాస్ కర్మాగారం
  • ఎక్కువ సాంద్రతగల పోలి ఎథిలీన్ (హెచ్ డి పి ఇ) తో తయారుచేసి, ముందుగా అమర్చి, సిద్ధంచేసిన, పూర్తిగా దీనబంధు బయోగ్యాస్ కర్మాగారాన్ని పోలిన, నమూనా.
  • ఫైబర్ గ్లాస్ రి ఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ (ఎఫ్ ఆర్ పి) తో చేసిన, ముందుగా అమర్చి, సిద్ధంచేసిన, బయోటెక్ తయారీ బయోగ్యాస్ కర్మాగారం
  • ఎక్కువ సాంద్రతగల పోలి ఎథిలీన్ (హెచ్ డి పి ఇ) తో తయారుచేసి, ముందుగా అమర్చి సిద్ధం చేసిన , కె వి ఐ సి రకం , కదిలే పై కప్పు బయోగ్యాస్ కర్మాగారం
  • శక్తి - సురభి - ఎఫ్. ఆర్. పి. ఆధారంగా గల బయోగ్యాస్ వ్యవస్ధ. వివేకానంద కేంద్రం, కన్యాకుమారి, వారిచే అభివృద్ధి పరచబడిన.ముందే నిర్మించబడిన, ఎక్కడికైనా తీసికెళ్ళగల కదులుతూ ఉండే డోమ్ గల కే. వి. ఐ. సి. నమూనా.
  • సింటెక్స్ వాడి తయారు చేసిన, ప్లాస్టిక్ ఆధారంగా గల, కదిలే డోమ్ తో కే. వి. ఐ. సి. రకం బయోగ్యాస్ వ్యవస్ధ. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కలోల్ (గుజరాత్) వారిచే అభివృద్ధి పరచబడినది

2. కదిలే పైకప్పు బయోగ్యాస్ కర్మాగారాలు

  • లోహంతో తయారుచేసిన, కదిలే పైకప్పుగల, కె వి ఐ సి రకం బయోగ్యాస్ కర్మాగారం
  • ఫెర్రో సిమెంట్ డైజెస్టర్, ఎఫ్ ఆర్ పి గ్యాస్ హోల్డర్ కలిగిన కె వి ఐ సి రకం కర్మాగారం
  • ప్రగతి రకం బయోగ్యాస్ కర్మాగారం

3. సంచి లాంటి బయోగ్యాస్ కర్మాగారం (ఫ్లెక్సి మోడల్)

4. స్థిరమైన పైకప్పుగల బయోగ్యాస్ కర్మాగారాలు

  • ఇటుకల నిర్మాణంతో దీనబంధు నమూనా.
  • సహజసిద్ధమైన ప్రదేశ పద్ధతితో దీనబంధు ఫెర్రోసిమెంట్ నమూనా.
  • ముందుగా తయారుచేసిన హెచ్ డి పి ఇ మెటీరియల్ ఆధారితమైన, దీనబంధు నమూనా కుటుంబ పరిమాణ బయోగ్యాస్ కర్మాగారములకి ముందుగా తయారుచేసిన కప్పు.
  • సాలిడ్ - స్టేట్ దీనబంధు డిజైన్ స్ధిరమైన డోమ్ గల నమూనా, ఐ.సి.ఎ ఆర్. వారిచే అభివృద్ధి పరచబడినది.
ఆమోదం పొందిన బయోగ్యాస్ ప్లాంట్స్ - అభివృధ్ధి పరచడానికి అనుమతి పొందినవి

నమూనా

ఆమోదం పొందినసామర్థ్యం(ఘన మీటర్లలో రోజువారీ గ్యాస్ ఉత్పత్తి)

తేలియాడే డ్రమ్ము రకపు బయోగ్యాస్ ప్లాంట్ -కేవిఐసి మాడల్

1 నుంచి 10

కేవిఐసి నమూనా ఫెర్రో సిమెంట్ జీర్ణకారితో / లేదా ఫైబర్ గ్లాస్ తో రీఇన్ఫోర్స్ చేసిన ప్లాస్టిక్(ఎఫ్ఆర్పి) గ్యాస్ హోల్డర్స్

1 నుంచి 10

దీనబంధునమూనా

1 నుంచి 6

దీనబంధునమూనా ఇన్-సిటు నమూనా ఫెర్రో సిమెంటుతో-1

1 నుంచి 6

ప్రగతినమూనా-1

1నుంచి 6

రబ్బరైజ్డ్ నైలానుగుడ్డతో తయారైన సంచీజీర్ణకారి - బాగ్ డైజిస్టర్

1నుంచి 6

గ్రామీణ శక్తి కార్యక్రమాలను అమలుచేయడానికి నోడల్ శాఖలు, నోడల్ ఏజెన్సీలు

ప్రాంతాల్లొ ఈ ఎన్ బి ఎంఎంపి కింద ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహకాలు

తరగతి

ఒక ప్లాంటుకు ఇచ్చేకేంద్ర సబ్సిడీ

ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, సిక్కిం(అస్సాం మైదాన ప్రాంతాలుమినహా)

రు.14,700/-

అస్సాం సాధారణప్రాంతాలు

రు.9,000/- ( 2-4 ఘ.మీ.కిరు. 10,000/- పరిమితం చేయబడింది. స్థిరమైన డోమ్ రకం

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్(కొండలోతట్టుప్రాంతాలు మినహా), తమిళనాడు లోని నీలగిరి, సదర్ కుర్సూండ్, కలింపాంగ్, డార్జిలింగ్ జిల్లా ఉపమండలాలు(పశ్చిమ బెంగాల్), సుందర్బన్స్, అండమాన్ నికోబార్ ద్వీపాలు

రు. 4,000/-
( 2-4 ఘ.మీ.కిరు. 10,000/- పరిమితం చేయబడింది. స్థిరమైన డోమ్ రకం

మిగిలిన ప్రాంతాలు

రు.4,000/-
( 2-4 ఘ. మీ.కిరు. 8,000/- పరిమితం చేయబడింది. స్థిరమైన డోమ్ రకం

(ii) బయోగ్యాస్‌ ప్లాంట్‌లతోఅనుసంధించిన సురక్షిత మరుగుదొడ్లు : సురక్షితమరుగుదొడ్లను అనుసంధించడానికోసం ప్లాంటుకు 1000 రు.చొప్పునకేంద్ర రాయితి లభిస్తుంది.

(iii) 5 ఏళ్ల ఉచిత నిర్వహణా వారంటీతో టర్న్‌ కీ జాబ్‌ ఫీజు: 1500 రు.

(iv) పాతవి పని చేయనిప్లాంట్ల రిపేరుకు ఆర్థిక సాయం : కేంద్ర సబ్సిడీలో 50 శాతానికి పరిమితమైన ఆర్థికసాయాన్ని వివిధ వర్గాలలబ్దిదారులకుప్రాంతాలకు అందివ్వడం జరుగుతుంది. కుటుంబాల్లోవాడే కనీసం5 ఏళ్లు దాటిన ప్లాంటులు ఏవైతే సరిగ్గాపనిచేయకుండా మూలన పడ్డాయో, వాటి రిపేరీలకు ఈసాయాన్నివ్వడం జరుగుతుంది.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00847457627
షైక్ జకీర్ Aug 29, 2017 06:57 AM

బైయో గ్యాస్ ను ఏ విధముగా నిర్వహించాలి .
దాని నుండి వచ్యే వెర్ధాలను ఏ విధముగా తేసివేయాలి .దేని వలన వెరీవారికీ అటువంటి నాస్థలు ఉన్నాయి తెలుపగలగు .మరియు జి .ఓ నెంబర్ తెలుపగలరు.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు