హోమ్ / శక్తి వనరులు / గ్రామీణ ప్రయోగాలు / ఎలుకల బెడద నివారణకు ఒక కొత్త సాధనం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎలుకల బెడద నివారణకు ఒక కొత్త సాధనం

పంటలకు ఎలుకలు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా, వానాకాలం తర్వాత ఈ బెడద మరీ ఎక్కువ.

పంటలకు ఎలుకలు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా, వానాకాలం తర్వాత ఈ బెడద మరీ ఎక్కువ.

ఎలుకల బెడదనుంచి బయటపడడానికి రైతులు కొన్ని పద్ధతులు పాటిస్తుంటారు, అవి:

  • ఎలుకల మందును, జొన్న/సజ్జ పిండితో కలిపి, ఒక ప్లాస్టిక్ కవరులో వుంచి, దానిని చెట్టు మీద పెడతారు. ఎలుకలు , ఈ మిశ్రమాన్ని తిని చనిపోతాయి. అయితే, వానాకాలంలో ఈ విషపు ఎర అంతగా ప్రభావం చూపదు. innovative trap
  • వేయించిన వేరుశనగ పప్పు పొడి, నువ్వులు, ధనియాలు, ఎలుకలమందు మిశ్రమాన్ని బట్టతో ఒక చిన్న మూట కట్టి, చెట్టుపై వుంచుతారు. అయితే, ఈ పద్ధతిలో, ఎలుకలతోపాటు పక్షులుకూడా ఆ మిశ్రమాన్ని తిన్న ఎలకలను తిని చనిపోతున్నాయి.
  • కొందరు రైతులు ఎలుకలుపట్టేవారిని ఇందుకు నియోగిస్తుంటారు. అయితే, వారు ఒక్కొక్క ఎలుకకు 25-30 రూపాయలు వసూలుచేస్తుండడంతో, ఇది చాలా ఖరీదైన ప్రత్యామ్నాయమవుతున్నది.

కొత్త రకం బోను

కర్ణాటక రాష్ట్రంలోని, తుంకూరు జిల్లాకు చెందిన శ్రీ అరుణ్ కుమార్, పొలాలలో ఎలుకల బెడద నివారణకు, పర్యావరణానికి హాని కలిగించని, ఒక కొత్తరకం బోనును రూపొందించారు. ఇందుకోసం ఒక పాత వెదురు బుట్టను ఉపయోగిస్తారు. ఆ బుట్ట నాలుగు మూలలకు ఒక తీగను (బైండింగ్ వైర్) కట్టి, ఆ తీగకు ఒక పొడవైన ప్లాస్టిక్ దారాన్ని ముడివేస్తారు. ఈ ప్లాస్టిక్ దారాన్ని పైకి, కిందకు లాగడానికి వీలుగా ఒక తాటి మట్టకు కడతారు.ఆ వెదురుబుట్టలో, ఎరనులాగగానే, తలుపు మూసుకుపోయే, మామూలు ఎలుకల బోనును వుంచి, దానిలో ఒక కొబ్బరి ముక్క పెడతారు.

ఆ కొబ్బరి ముక్కను తినడంకోసం వెళ్ళి , ఎలుకలు ఆ బోనులో చిక్కుకుని, బోనులోనే చనిపోతాయి. చచ్చిన ఎలుకలను చేతితో తీసి, పొలంలో పాతి పెట్టవచ్చు. ఈ బోనుద్వారా 3-4 ఎలుకలను పట్టి, చంపవచ్చు. అయితే, ఇది ఎలుకల బెడదకు శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే, చచ్చిన ఎలుకల శరీరంనుంచి వచ్చే వాసన (వెలువడే ఫెరోమోన్స్), మిగతా ఎలుకలకు ఒక హెచ్చరికలా పనిచేసి, అవి ఇక ఆ ప్రదేశానికి రావు. కాని, పొలంలో మిగతాచోట్ల హాని కలిగిస్తూనే వుంటాయి. శ్రీ అరుణ్ కుమార్ రూపొందించిన బోను 30-35 రూపాయల ఖరీదవుతుంది.

మరిన్ని వివరాలకోసం ఈ కింది చిరునామాను సంప్రతించండి:
శ్రీ ఎస్. ఆర్.అరుణ్ కుమార్ శెట్టికెరె,
చిక్కనైకనహళ్ళి, తుంకూరు జిల్లా- 572226,
టెలి ఫోన్: 08133 – 269564, మొబైల్: 09900824420

ఆధారము : ది హిందూ

2.99678456592
vinay kumar thakkella Feb 17, 2014 06:33 PM

బాగుంది మీ ఐడియా

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు