పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వయో వృద్ధులు

ఇండియాలో పెద్ద వయసులో ఉన్న మగవారిలో మూడింట రెండువంతులు మంది, మరియు పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో 90 నుండి 95 శాతం మంది నిరక్షరాస్యులు, మరియు వారిలో ఎక్కువమంది, ప్రత్యేకంగా ఆడవారు ఒంటరిగా ఉంటున్నారు.

వయో వృధ్ధులు : సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య ప్రభావాలు

ఇండియాలో పెద్ద వయసులో ఉన్న మగవారిలో మూడింట రెండువంతులు మంది, మరియు పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో 90 నుండి 95 శాతం మంది నిరక్షరాస్యులు,  మరియు వారిలో ఎక్కువమంది, ప్రత్యేకంగా ఆడవారు ఒంటరిగా ఉంటున్నారు. అలా పెద్ద వయసులో ఉన్నవారు  ఆర్థికంగా ఇతర కుటుంబసభ్యులపై ఆధారపడడం ఇండియాలో చాలా ఎక్కువ. 2001 సంవత్సరంలో, సుమారు 18 మిలియన్ల పెద్దవారైన మగవారికి మరియు 3.5 మిలియన్ల పెద్దవారైన ఆడవారికి ఉద్యోగములు అవసరమౌతాయని అంచనా వేసారు. ఈ అంకెలు ప్రస్తుతం పనిచేస్తున్నవారి సంఖ్య  ఆధారంగా కట్టినవి. అంటే భవిష్యత్తులో వారికి ఉద్యోగములు సృష్టించడానికి పెద్ద మొత్తంలో వనరులు కావాలి, వారిలో చాలామంది బహుశా కుటుంబ సహాయం కొరకు తగినంత పొదుపు చేసిఉండరు. 2001 సంవత్సరములో, సుమారు 27 మిలియన్ల మంది పెద్దవారికి ఏ సమయంలోనైనాగాని వైద్య సదుపాయాలు అవసరముంటుందని కూడా అంచనా వేసారు. అటువంటి వైద్య సదుపాయాలు లేనప్పుడు వారి అవసరాల కోసం ఎక్కువ ఖర్చుని సంస్థాపన సౌకర్యాల నిమిత్తం చేయవలసి ఉంటుంది. వయస్సు మళ్ళే విధానంలో భౌతికంగా వైకల్యం కలగడం మరొక ముఖ్యమైన విషయం. 2001 సంవత్సరంలో సుమారు 17 మిలియన్ల అంగవైకల్యంగల పెద్దవారు ఇండియాలో ఉన్నారు, అందులో సగం మంది దృష్టి లోపం ఉన్నవారు ఉండవచ్చు. ఇందులో ఎక్కువ మంది పని చేయలేని స్థితిలో ఉండి ఆర్థికంగా ఇతరులపై ఆధారపడి ఉన్నా రు. కుటుంబ సహకారం లేక, వారు ప్రభుత్వ సహాయంకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వికలాంగులకు లేదా దిక్కులేని వారికి ఆర్థిక సహాయం చేయడానికి పథకాలు ప్రవేశ పెట్టినా గానీ, ఆ ఫింఛను మొత్తం నెలకి 30 రూపాయల నుండి 60 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. అంతే కాకుండా, నిధుల కొరత వలన చాలా తక్కువ మంది అర్హత గలిగిన వారికి మాత్రమే ఫింఛను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇండియాలో పెద్దవారిని పోషించే విషయాలలో ముఖ్యమైనది ఏమిటంటే, కుటుంబ సభ్యులు పెద్ద వారితో కలసి ఉండాలనే తాపత్రయం ఒకటి. పెద్దవారిని చూసే విషయంలో భాధ్యతల్ని విస్మరించే వారి మీద సామాజిక ఒత్తిడి నిరంతరంగా ఉంటుంది. అలా, పెద్దవారిని జాగ్రత్తగా చూడడంలో ఉండే సమస్య ల్ని తీర్చడానికి నైతిక  విలువలని మరియు కుటుంబ సామర్ధ్యాన్ని పటిష్టం చేయడం చాలా ముఖ్యం. పెద్దవారిని మానవ వనరులుగా పరిగణించి వారి విస్తృతమైన అనుభవాన్ని మరియు మిగిలిఉన్న సామర్ధ్యాన్ని జాతీయ అభివృధ్ధికి తగిన విధంగా ఉపయోగపడేలా చేసుకోవాలి. ఆరోగ్య వంతమైన మరియు ఫలవంతమైన జీవనాన్నిసాగించే వారి సామర్ధ్యం కొనసాగేలా ప్రభుత్వం చూడాలి.

జాతీయ సామాజిక సహాయ పథకం ( ఎన్ ఎస్ ఎ పి )

1995 ఆగస్టు 15వ తేదీనుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ పథకం ( ఎన్ ఎస్ ఎ పి), రాజ్యాంగంలో ఆర్టికల్ 41 లో ఉన్న ఆదేశిక సూత్రాల  నునెరవేర్చడంలో ఒక ముఖ్యమైన కార్యసాధనంగా తెలియచేస్తుంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పేదవారికి, సంపాదించే వారు మరియు తల్లి మరణించిన వారికి సామాజిక సహాయం చేయడానికి జాతీయ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో మూడు విభాగాలు ఉన్నాయి. అవి

  • జాతీయ వృద్ధాప్య ఫింఛను పథకం ( ఎన్ ఒ ఎ పి ఎస్  )
  • జాతీయ కుటుంబ సహాయ పథకం ( ఎన్ ఎఫ్ బి ఎస్ )
  • జాతీయ మాతృత్వ సహాయ పథకం ( ఎన్ ఎమ్ బి ఎస్ )

1998 సంవత్సరములో వివిధ మూలాల నుండి ఇచ్చిన సలహాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కూడా ఈ పథకాల్ని, పాక్షికంగా మార్చారు. ఈ పథకాల ముఖ్యమైన ఆకర్షణలు ప్రస్తుతము మార్చిన నమూనాలో ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఈ పథకం క్రింద, జాతీయ వృద్ధాప్య ఫింఛను పథకానికి, కేంద్ర సహాయం ఈ క్రింద  ఇచ్చిన సూత్రము ప్రకారము లభిస్తుంది .

  • ధరఖాస్తుదారుని వయస్సు(మగ లేదా ఆడ) 60  సంవత్సరములు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.
  • ధరఖాస్తుదారుడు, అతని/ఆమె స్వంత ఆదాయం లేదా కుటుంబ సభ్యుల లేదా ఇతర వనరుల ఆర్థిక సహాయంతో జీవనము సాగక దిక్కులేనివాడై ఉండాలి.
  • వృద్ధాప్య ఫింఛను అర్హత నెలకి 200 రూపాయలు(Rs.500 for above 80 Years).

ఆధారం: భారతదేశంలో వయస్సు మళ్ళి న వారు : సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్యం : హెచ్ బి ఛానన మరియు పి పి తల్వార్, ఇంప్లికేషన్ ఏసియా పసిఫిక్ పాప్యులేషన్ జొర్నల్, రెండవ సంపుటి 337వ నంబరు.

3.04109589041
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు