పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నీతి ఆయోగ్

ప్రణాళికా సంఘం స్థానంలో మరో కొత్త సంస్థ ఆవిర్భవించింది.

దేశాభివృద్ధికి ఇక నీతి ఆయోగ్

ప్రణాళికా సంఘం స్థానంలో మరో కొత్త సంస్థ ఆవిర్భవించింది. 65 ఏండ్ల పాటు దేశానికి దిశానిర్దేశం చేసి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రణాళిక సంఘానికి ఇక స్వస్తి పలికి .. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియాకు కొత్త సంవత్సరంలో స్వాగతం పలికారు.

- భారత ప్రధాని స్వాతంత్రదినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతమున్న ప్రణాళిక సంఘం స్థానంలో ప్రత్యామ్నాయ సంస్థను తీసుకురావాలని ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌కు శ్రీకారం చుట్టా రు. ఢిల్లీలో కేంద్ర కేబినేట్ తీర్మానం ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అనే కొత్త వ్యవస్థకు జనవరి 1న ఆమోదం తెలిపింది.

- నీతి ఆయోగ్.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫా ర్మింగ్ ఇండియా. దీని సంక్షిప్త రూపం నీతి (NITI). దీన్ని తెలుగులో భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాషలో నీతి అంటే విధానం, ఆయోగ్ అనగా కమిటీ. దీన్ని బట్టి నీతి ఆయోగ్ అంటే విధాన కమిటీ అని అర్థ్దం.

- నీతి ఆయోగ్‌కి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి, ఒక ఉపాధ్యక్షుడు, సీఈఓ ఉంటారు. దీనిలో అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత లెఫ్ట్‌నెంట్ గవర్న ర్లు, పాలకమండలిలో ఉంటారు. ఎక్స్‌ఆఫిషియో సభ్యులుగా ఉంటారు. ఇద్దరు పూర్తికాల సభ్యులు ఉంటారు. ఈ ఇద్దరిని విశ్వవిద్యాలయాల నుంచి లేదా పరిశోధన సంస్థల నుంచి తీసుకుంటారు. నలుగురు కేంద్ర మంత్రులు పదవీరిత్యా ఎక్స్‌ఆఫిషియో సభ్యులుగా ఉంటారు. పలు రంగాలకు చెందిన మేధావులు, నిపుణులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రధాని నియమిస్తారు. నీతి ఆయోగ్‌కి అనుబంధంగా ప్రాంతీయ మం డళ్లు ఉంటాయి. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పగారియ ను తొలి ఉపాధ్యక్షుడిగా, అతనితోపాటు పాటు ఇతర సభ్యులను జనవరి 5-2015న నియమించారు.

లక్ష్యాలు...విధులు

- సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ సాధికారత, సమానత్వమే లక్ష్యంగా ప్రజానుకూల, గతిశీల, సమ్మిళిత అభివృద్ధి అజెండాను అమలు చేసేందుకు, కేంద్ర రాష్ర్టాలకు ఒకేఎజెండా ఖరారు చేయడమే నీతి ఆయోగ్ లక్ష్యం.

- శక్తి వంతమైన రా ష్ర్టాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమై న విధాన నిర్ణయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహత్మకమైన సాంకేతిక పరమైన సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుంది.

- ఆర్థిక అంశాలతో పాటు, జాతీయ, అంతర్జాతీయ ప్రా ధాన్యం ఉన్న విషయాలపై సూచనలు ఇస్తుంది. జాతీ య లక్ష్యాల సాధన కోసం రాష్ర్టాలు చురుకైన పాత్రను పోషించేందుకు భాగస్వామ్యం కల్పిస్తుంది.

- గ్రామస్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూ పొందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.

- ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ ప్రయోజనాలు ఉండేలా చూస్తుంది. ఆర్థిక పురోగతి నుంచి లబ్ధిపొందలేకపోతున్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

- పౌరుల భాగస్వామ్యం పెంచడం, అందరికీ అవకాశాలు కల్పించడం, భాగస్వామ్యపాలన, సాకేంతిక విని యోగం పెంచడం వంటివి దీని ప్రధాన లక్ష్యాలు.

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనాగరియ

అరవింద్ పనాగరియ రాజస్థాన్‌లో సెప్టెంబర్ 30, 1952లో జన్మించారు. ఈయన ఇండియన్-అమెరికన్ ఆర్థికవేత్త, స్వేచ్ఛావాణిజ్య ఆర్థికవేత్త. గుజరాత్ అభివృద్ధి నమూనకు గట్టి మద్దతుదారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టాపొందిన తరవాత అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త. యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం ఆచార్యుడిగా, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఐక్యరాజ్యసమితి-అభివృద్ధి సంఘటన (ఆకటండ్)ల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

ఈయన ప్రస్తుతం అమెరికాలోని కొలంబియాలో అర్థశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్నారు. అరవింద్ పనాగరియ తనతో పని చేస్తున్న ఆచార్య జగదీష్ భగవతితో కలిసి భారత రాజకీయార్థిక వ్యవహారాలను అధ్యయనం చేసి వై గ్రోత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రాశారు. అరవింద్ పనాగరియ 2008లో ఇండియా ది ఎమెర్జింగ్ గైంట్ అనే పుస్తకంలో సమకాలీన భారత ఆర్థిక రంగాన్ని ఏఏ రంగాల్లో సంస్కరిస్తే బాగుంటుందో కూలంకుషంగా చర్చించారు. భారత దేశాన్ని ప్రగతి పథంలోనికి తీసుకపోవడం ఎలా అని దానిపై బ్లూమ్ బర్గ్ టీవీ ఇండియాలో ప్రత్యేక కార్యక్రమం నడిపారు. వేగవంతమైన సంస్కరణలు సత్వర ఫలితాలు ఇస్తాయని పనాగరియ అభిప్రాయం. రాజస్థాన్‌లోని వసుంధరా రాజే ప్రభుత్వానికి సలహాదారుడిగా, ఆ రాష్ట్రంలో కార్మిక సంస్కరణలకు గట్టి మద్దతుదారునిగా ఉన్నారు.

వికే సారస్వత్

విజయ్‌కుమార్ సారస్వత్ 1949లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన భారతీయ శాస్త్రవేత్త. గతంలో డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్‌గా, రక్షణశాఖ మంత్రికి చీఫ్ అడ్వైజర్‌గా పనిచేశారు. భారత క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, పృథ్వీ క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఈయన విద్యాభ్యాసం గ్వాలియర్‌లో ఇంజినీరింగ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎంటెక్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రోపల్షన్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌పై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందారు. 1998లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులు పొందారు.

పాలకమండలి

 • అధ్యక్షుడు : నరేంద్ర మోడీ (ప్రధాన మంత్రి)
 • ఉపాధ్యక్షుడు : అరవింద్ పనాగరియ
 • సీఈఓ : సింధు శ్రీ కుల్లార్
 • పూర్తికాల సభ్యులు : వివేక్ దేబ్రాయ్, వికే సారస్వత్
 • ఎక్స్‌ఆఫిషియో సభ్యులు : రాజ్‌నాథ్ సింగ్ (హోంశాఖ మంత్రి) అరుణ్ జైట్లి (ఆర్థ్దిక శాఖ మంత్రి), సురేష్ ప్రభు (రైల్వే శాఖ మంత్రి), రాధామోహన్ (వ్యవసాయ శాఖ మంత్రి)
 • ప్రత్యేక ఆహ్వానితులు : నితిన్ గడ్కారి (రవాణ మంత్రి) స్మృతి ఇరాని (మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి), తావరచంద్ గెహ్లాట్(సామాజిక న్యాయ మంత్రి)
 • పాలక న్యాయ మండలి సభ్యులు: అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు.

వివేక్ దేబ్రాయ్

వివేక్ దేబ్రాయ్ జనవరి 25,1955న జన్మించారు. ఈయన భారత ఆర్థిక శాస్త్రవేత్త. విద్యాభ్యాసం నరేంద్రపురంలోని రామకృష్ణ మిషన్‌లో, కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో, ఢిల్లీ స్కూల్ అఫ్ ఎకనామిక్స్‌లో, ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జికి చెందిన ట్రినిటీకాలేజీలో పూర్తిచేశారు. ప్రస్తు తం న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఈయన భారత ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో పని చేశారు. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌టెంపరీస్ స్టడీస్‌లో డైరెక్టర్‌గా, ఆర్థిక శాఖ విభాగానికి కన్సల్టెంట్‌గా న్యాయసంస్క రణలు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు లార్జ్ (లీగల్ అడ్జెస్ట్‌మెంట్ అండ్ రిఫామ్స్ ఫర్ గ్లోబలైజేషన్ ద ఎకానమీ) డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. మహాభారతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు.

ప్రణాళిక సంఘం

జార్ చక్రవర్తుల పాలనలో, రెండు ప్రపంచ యుద్ధాల వలన పతనమైన ఆర్థిక వ్యవస్థను, పక్కా ప్రణాళికలతో అనతికాలంలోనే అగ్రరాజ్యానికి దీటుగా అభివృద్ధి చెందిన రష్యాను భారత తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రు ఆదర్శంగా తీసుకున్నారు. కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు 1950 మార్చి 15న మొదటి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 12 పంచవర్ష ప్రణాళికలు, ఆరువార్షిక ప్రణాళికలను తెచ్చారు. వీటి విలువ రూ. 200 లక్షల కోట్లు. మొదటి పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నంద. 12వ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాటెంగ్‌సింగ్ ఉండగా, నీతి ఆయోగ్‌ను ప్రకటించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

- 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాను రచించిన planned Economy for India అనే గ్రంథంలో భారతదేశానికి ప్రణాళికలు అవస రమని పేర్కొన్నారు.

- సుభాష్‌చంద్రబోస్ మన దేశానికి ప్రణాళికలు అవసరమని 1938లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్పష్టంచేశారు.

గడిచిన పంచవర్ష ప్రణాళికలు

ప్రణాళిక కాలం ప్రాధాన్యత

 • మొదటి 1951-56 వ్యవసాయం
 • రెండవ 1956-61 పారిశ్రామిక అభివృద్ధి
 • మూడవ 1961-66 స్వయం సంవృద్ధి, స్వావలంబన
 • నాలుగో 1969-74 ఆర్థ్దిక స్థిరత్వం లేదా స్థిరత్వం కూడిన వృద్ధి
 • ఐదవ 1974-78 పేదరికం నిర్మూలన, ఆర్థ్దిక స్వావలంబన
 • ఆరవ 1980-85 ఉపాధికల్పన, పేదరిక నిర్మూలన
 • ఏడవ 1985-90 స్వావలంబన
 • ఎనిమిదవ 1992-97 మానవ వనరుల అభివృద్ధి
 • తొమ్మిదవ 1997-2002 సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి,
 • పదవ 2002-07 సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి
 • పదకొండవ 2007-12 సత్వరవృద్ధి, సమ్మిళిత ప్రగతి
 • పన్నెండవ 2012-17 సత్వరవృద్ధి, సమ్మిళిత, వేగవంతమైన వృద్ధి

నోట్: 1966-69 ల మధ్య చైనా, పాకిస్తాతో యుద్ధాల వల్ల 1990-1992 మధ్య కేంద్రంలో అనిశ్చితి వలన పంచవర్ష ప్రణాళికలకు బదులు వార్షిక ప్రణాళికలను అమలు పరిచారు.

సీఈఓగా సింధు శ్రీ కుల్లార్

ఇప్పటి వరకు ప్ర ణాళిక సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సింధుశ్రీ కుల్లార్, ఇక నుంచి కొత్తగా ఏర్పాట యిన నీతి ఆయోగ్‌కు కూడా సీఈఓగా వ్యవహరించనున్నారు. 1975 యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. సింధు శ్రీ కుల్లార్ 2012 ఏప్రిల్‌లో ప్రణాళిక సంఘానికి కార్యదర్శి భాధ్యతలు చేపట్టారు. 2013 మార్చి 31న పదవీ విరమణ చేసిన కుల్లార్ ప్రసుతం ఏడాదిపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రణాళికా సంఘానికి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆధారము: నమస్తే తెలంగాణా

2.94964028777
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు