హోమ్ / సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం / ఆడపిల్లల రక్షణ పథకం ఆంధ్ర ప్రదేశ్
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆడపిల్లల రక్షణ పథకం ఆంధ్ర ప్రదేశ్

ఈ పథకం ద్వారా ఆడ పిల్లల హక్కులను రక్షించడంలో ప్రభుత్వాలు ప్రత్యక్ష పెట్టుబడులను పెడతాయి.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు ఆడపిల్లల రక్షణ పథకాన్ని లింగ వివక్ష నిరోధించడానికి ప్రవేశపెట్టాయి. ఈ పథకం ద్వారా ఆడ పిల్లల హక్కులను రక్షించడంలో ప్రభుత్వాలు ప్రత్యక్ష పెట్టుబడులను పెడతాయి.

లక్ష్యాలు

 • పాఠశాలలో ఆడపిల్లల నమోదును పెంచడం మరియు వారిని పాఠశాలు వదిలి వెళ్ళకుండా చూడటం, మరియు కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వరకు వారి చదువు కొనేలా చూడటం.
 • 18 సంవత్సరాల వయస్సు తరువాతే వివాహం చేసుకోనేలా అమ్మాయిలను ప్రోత్సహించటం.
 • ఇద్దరు ఆడ పిల్లలు కలవారు కుటుంబ నియంత్రణ చేసుకొనేలా తల్లిదండ్రులను ప్రోత్సహింటం.
 • ఆడ పిల్లల హక్కులు కాపాడటం మరియు వారికి సామాజిక మరియు ఆర్థిక సాధికారతను అందించటం.
 • అమ్మాయిలకు ప్రతికూలంగా ఉన్న సాంస్కృతిక వైఖరులు మరియు పద్ధతులు తొలగించటం.
 • ఆడపిల్లల స్థితిని మెరుగు పరచడంలో కుటుంబ పాత్రను బలోపేతం చేయటం.
 • అనాథ/దిక్కులేని మరియు వకలాంగులైన అమ్మాయిలకు ప్రత్యేక మినహాయింపును విస్తరింపచేయటం.

అర్హత నియమాలు

ఎ) ఈ క్రింది షరతులను పూర్తి చేసే వారికి మాత్రమే ఈ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీములో నమోదు చేసుకొనే అర్హత ఉంటుంది.

 • ఒకే అమ్మాయి లేదా ఇద్దరు అమ్మాయిలు కలిగిన కుటుంబాలకు అర్హత ఉంటుంది.
 • తల్లిదండ్రులలో ఒకరు 01-04-2005 తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకొని వుండాలి.
 • 03-01-2013 ముందు జన్మించిన అమ్మాయి కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో Rs.20, 000కంటే తక్కువ మరియు పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి Rs.24, 000 కంటే తక్కువ ఉండాలి.
 • 03-01-2013 తర్వాత జన్మించిన అమ్మాయి కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో Rs.40, 000కంటే తక్కువ మరియు పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి Rs.48, 000 కంటే తక్కువ ఉండాలి.
 • 0-3 సంవత్సరాల వయసు కల అమ్మాయిని కలిగిన కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
 • రెండవ ప్రాధాన్యత ఇద్దరు అమ్మాయి కల కుటుంబానికి ఇస్తారు. ఇందులో రెండవ ఆడ పిల్ల వయస్సు 01-04-2005 నాటికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
 • అప్లికేషన్ ఇచ్చె తేదీ నాటికి పిల్ల వయస్సును ముఖ్యాంశంగా ఈ పథకంలో నిర్ణయిస్తారు.
 • సూచించిన నియమాలను పూర్తి చేసిన వారు ఈ పథకం క్రింద ప్రయోజనాలను అందుకోవటానికి అర్హత కలిగి ఉంటారు.
 • ఆగస్టు 2009 తర్వాత పుట్టిన ఆడపిల్లలలు RBD చట్టం కింద నమోదు చేసుకోవాలి. మరియు సంబంధిత అధికారి అంటే విలేజ్ సెక్రటరీ / మున్సిపాలిటీ నుంచి పుట్టిన తేదీ దృవపత్రాన్ని జతచేయాలి.

B) అనాథ/దిక్కులేని, వకలాంగులు మరియు HIV/AIDS గల అమ్మాయిల వయసు మరియు విద్యార్హతలలో సడలింపు.

 • అనాథ అంటే తల్లిదండ్రులు ఇద్దిరూ లేని వారు. దిక్కులేని వారు అక్రమ రవాణా బాధితులు, హెచ్ఐవి / ఎయిడ్స్ బాధితులు, తలితండ్రులు వదిలేసివారు, ప్రభుత్వ అనాథాశ్రమాలలో లేదా NGO ల దగ్గర ఉంటున్నవారు.
 • మే, 2008 నాటికి 18 సంవత్సరాల దాటని ఇటువంటి దిక్కులేని లేదా వికలాంగ లేక అనాధ బాలికలకు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద లాభాలు పొందడానికి అర్హత ఉంటుంది.
 • ఏప్రిల్, 2005 ముందు పుట్టిన అనాథలు, ధిక్కులేనివారు మరియు వికలాంగ అమ్మాయిలకు విద్యా ర్హతలో సడలింపు ఉంటుంది. 8 వ తరగతి దాటి చదవని అమ్మాయిలు సహజంగా వార్షిక విద్యా ఉపకార వేతనాల కొరకు అనర్హులు. వారు 20 సంవత్సరాల పూర్తచేసుకున్న తరువాత గరిష్టంగా రూ .1 లక్ష లేదా రూ 30,000 / అందుకుంటారు
 • అందువలన, ఏప్రిల్, 2005 తర్వాత పుట్టిన అందరు అనాథ, దిక్కులోని మరియు వికలాంగ అమ్మాయిలు తప్పని సరిగా పాఠశాలలో చేరి XII తరగతి వరకు చదువుకోవాలి. అప్పుడే వీరు GCPS క్రింద సహాయం పొందడానకి అర్హులు అవుతారు.

గమనిక: నిరాశ్రయులైన మరియు అనాధ పిల్లల విషయంలో, వైద్య సర్టిఫికేట్ ఆధారంగా సంస్థ అధికారి పుట్టిన తేది రిజిస్ట్రేషను హామీని ఇస్తారు. ఇలాంటి సందర్భంలో పిల్లల కులాన్ని "కులరహితం" అని నమోదు చేస్తారు.

సి) తీవ్ర వికలాంగత కలిగిన బాలికల విషయంలో ఎడ్యుకేషన్, ఆదాయం, మరియు ఆడ తోబుట్టువుల విషయంలో సడలింపు: -

తీవ్రంగ వికలాంగత ఉన్న అమ్మాయిలకు మాత్రమే కింది ప్రత్యేక మినహాయింపు ఉన్నాయి: -

 • 80% కంటే ఎక్కువ వైకల్యం కల అమ్మాయిలు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీము ప్రయోజనాలను పొందవచ్చు. వారి తల్లిదండ్రుల/గార్డియన్ల సంవత్సర ఆదాయం, అన్ని మూలాల నుండి, Rs.1.00 లక్షలను మించి ఉండకూడదు.
 • తీవ్ర వికలాంగత గల బాలికలకు (80% వైకల్యం) ఒక్కరు లేదా ఇద్దరు అమ్మాయిల నిబంధన వర్తించదు. ఒకరు లేదా ఇద్దరు మగ తోబుట్టువులు ఉన్న అమ్మాయి కూడా గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు.
 • అలాంటి తీవ్ర వికలాంగత కలిగిన బాలికల విషయంలో విద్యా అర్హతలో కూడా సడలింపు ఉంటుంది.

పథకం కింద పొందే సహాయం

 • ఒకే అమ్మాయి అయితే ఆమె వయస్సు 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత Rs.1.00 లక్ష పొందుతుంది.
 • ఇద్దరు అమ్మాయిల విషయంలో, 20 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు రూ .30,000 పొందుతారు.
 • "ఒకే అమ్మాయి" మరియు "ఇద్దరు అమ్మాయిలు" విషయంలో, వారు 9వ తరగతి నుంచి 12 వ తరగతి (ఐటిఐ కోర్సు సహా) చదువుతున్న సమయంలో ఏడాదికి Rs1,200 / -స్కాలర్షిప్పును ఈ పథకం కింద పొందుతారు.
భీమా చేసిన వారి సహజ మరణించినప్పుడు Rs.30,000
మరణం లేదా ప్రమాదం కారణంగా మొత్తం శాశ్వత వైకల్యం కలిగినప్పుడు Rs.75,000
ప్రమాదం కారణంగా పాక్షిక శాశ్వత వైకల్యం కలిగినప్పుడు Rs.37,500

ఎలా దరఖాస్తు చేయాలి ?

ICDS ఏరియా

అర్హత ఉన్నవారు వారి అంగన్వాడీ కార్యకర్త నుండి అప్లికేషన్ ఫాం పొందవచ్చు. లేదా ఫాంను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని అంగన్వాడీ కార్మకర్తకు సమర్పించవచ్చు.

ICDS ఏరియా కానప్పుడు

ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంతాల్లో లేని దరఖాస్తుదారులు సంబంధిత చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) కు దరఖాస్తులు సమర్పించవచ్చు.

జపరిచవలసిన పత్రాలు

 • రెండు ఫోటోలు
 • MRO జారీ చేసిన ఆదాయపు సర్టిఫికేట్ .
 • ఫ్యామిలీ ప్లానింగ్ సర్టిఫికెట్.
 • అటెస్ట్ చేసిన బర్త్ సర్టిఫికెట్ .
 • అటెస్ట్ చేసిన తెల్ల రేషన్ కార్డ్ .
 • చీఫ్ మెడికల్ ఆఫీసర్ జారీచేసిన (ఆర్ఫన్/డిసేబుల్ విషయంలో) వైకల్యం సర్టిఫికెట్ .
 • మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ .

ఎప్పుడు దరఖాస్తు చేయాలి?

అర్హులైన దరఖాస్తుదారులు (రూరల్ ప్రాంతాల్లో ఏడాదికి రూ 20000 మరియు అర్బన్ ప్రాంతాల్లో ఏడాదికి రూ 24000 కంటే తక్కువ ఆదాయం గలవారు) ఒక కుమార్తె లేదా ఇద్దరు కుమార్తెలు కలిగి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెసుకున్నవారు తమ ఆడపిల్లలకు 3 సంవత్సరాల వయస్సు వచ్చే లోపు అంగన్వాడీ కార్యకర్త లేక చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసరుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మూలం : ఆడ పిల్లలు రక్షణ పథకం.

2.96774193548
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు