పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కార్మిక చట్టాలు

ఈ విబాగం లో వెట్టిచాకిరి, వెట్టి చాకిరిపై అపెక్స్ కోర్టు చెప్పినవి/నిర్ణయాలు,బాల కార్మికులు, గురించి వివరించటం జరిగినది

వెట్టిచాకిరి

 • వెట్టిచాకిరి అంటే ఏమిటి? ఒక రుణగ్రహీత లేదా అతనిపై ఆధారపడినవారు రుణాన్ని చల్లంచే క్రమంలో వేతనం లేకుండా రుణదాత కోసం పని చేయటం. ఇది చట్టం ద్వారా నిషేధించబడింది.
 • బెగ్గరు లేదా నిర్బంధంగా పని చేయించటం లాంటిది వెట్టిచాకిరి వ్యవస్థ (నిర్మూలన) చట్టం, 1976 కింద నేరం.
 • అలాంటివి కనబడినప్పుడు దానిని జిల్లా మేజిస్ట్రేట్/సామాజిక కార్యకర్త/NGO/ఎస్సీ- ST ఆఫీసర్/స్థానిక విజిలెన్స్ కమిటీకి తెలియ చేయాలి.

వెట్టి చాకిరి వ్వవస్థ లక్షణాలు

 • వెట్టిచాకిరి వ్యవస్థ అంటే బలవంతంగా లేదా పాక్షికంగా నిర్బంధిత కార్మిక వ్యవస్థ. ఇందులో ఒక రుణగ్రహీత రుణదాతతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఉండవచ్చు. లేదా
 • అతని ద్వారా లేదా అతని కంటే పెద్దవారు లేదా వారసుల ద్వారా తీసుకున్నట్టు చెప్పే [అటువంటి ఏ పత్రం తార్కాణాలు లేదో] దానికి వడ్డీగా బదులుగా. లేదా
 • అతను స్వయంగా లేదా, తన కుటుంబం లేదా అతని మీద ఆధారపడిన ఏవరైనా వ్యక్తి ద్వారా కూలీ లేదా సేవను రుణదాతకు లేదా రుణదాత ప్రయోజనం కోసం, ఒక అనిర్దిష్ట కాలానికి లేదా ఎంతకాలానికైనా వేతనం లేకుండా లేదా నామమాత్రపు వేతనాలతో పని చేయించటం. లేదా
 • పేర్కొన్న కాలంలో లేదా ఒక అనిర్దిష్ట కాలంవరకు ఉద్యోగ లేదా ఇతర జీవనోపాధి చేసుకొనే స్వేచ్ఛ వదులుకోవాల్సి ఉండటం. లేదా
 • దేశంలో వేరే భూభాగాలలో స్వేచ్చగా తిరగడానికి వీలులేకపోవటం లేదా
 • తను లేదా అతని కుటుంబ సభ్యులు లేదా అతని మీద ఆధారపడి ఏ వ్యక్తి తన ఆస్తి లేదా ఉత్పత్తిని మార్కెట్ విలువకు అమ్మే హక్కును వదులుకోవాల్సి ఉండటం.

వెట్టి చాకిరిపై అపెక్స్ కోర్టు చెప్పినవి/నిర్ణయాలు

వెట్టిచాకిరి సమస్య ప్రజాప్రయోజన వ్యాజ్యాల రూపంలో సుప్రీం కోర్ట్ తీసుకుంది. సుప్రీం కోర్ట్ తీర్పులు కింది విధంగా ఉన్నాయి:

బంధు ముక్తి మోర్చా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎవరైతే ఒక కార్మికుడు కొంత ఆర్థిక సహాయం ముందగా పొంది నిర్భంధగా పని చేస్తారో వారిని వెట్టిచాకిరీ కార్మికులుగా (బంధు ముక్తి మోర్చా. భారతదేశ యూనియన్ మరియు ఇతరులు 1984 2 SCR) గుర్తించింది. వెట్టిచాకిరి బంధంలోఉన్న కార్మికులను గుర్తించి వారిని విడిపించావి మరియు వారికి వారి విడుదల తరువాత పునరావాసం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి (నిర్ములన) ఆక్ట్, I 976 ను అమలు పరచక పోతే అది ఆర్టికల్ 21 మరియు 23 భారతదేశ రాజ్యాంగం (నీజా చౌదరి V స్టేట్ MP. 1984 3 5CC 243) ఉల్లంఘించడమే అవుతుంది.

ఒక వ్యక్తికి వేతనం లేదా నామమాత్ర వేతనంతో పని చేయించుకుంటే దానిని వెట్టిచాకిరి అని పిలుస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం లేదా యజమాని వెట్టిచాకిరీ కాదని నిరూపించాలి (నిజా చౌదరి V. ఎంపి స్టేట్).

వెట్టిచాకిరీని గుర్తించేందుకు, కొన్ని ప్రశ్నలు, యజమానులను అడగవలసివని.
 • వివిధ లేబరు చట్టాలు మినిమమ్ వేజ్ ఆక్టు, వేజెస్ పేమెంటు అక్టు, మో. తీసుకున్నారా.
 • రీజిస్టరును ఉపయోగిస్తున్నారా
 • యజమాని కాంటాక్టు లేబరు ఆక్టు లేదా వేరే ఏదైనా చట్టానికి రిజిస్టరు అయ్యారా

బాల కార్మికులు

పిల్లలు స్వేచ్ఛ మరియు గౌరవం కలిగిన వాతావరణంలో పెరుగటం అవసరం. వారు మంచి విలువైన పౌరులుగా పెరగడానికి విద్యా శిక్షణ అవకాశాలు అందించవలసి వుంటుంది. దురదృష్టవశాత్తు పిల్లలు పెద్ద నిష్పత్తిలో వారి ప్రాథమిక హక్కులను కోల్పోయారు. వారు ముఖ్యంగా అసంఘటిత ఆర్థిక వ్యవస్థలలోని వివిధ రంగాల్లో పని చేస్తున్నట్టు తెలుస్తుంది. వారిలో కొంత మంది నిర్బంధించబడ్డారు, స్వేచ్ఛ లేకుండా మరియు బానిసలుగా పని చేస్తున్నారు. ఇందువల్ల బాల కార్మికుల సమస్య మానవ హక్కుల సమస్య మరియు అభివృద్ధి సమస్య గా మారింది.

బాల కార్మికుడు అంటే అర్థము

బాలల హక్కులపై యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆర్టికిల్ 1 పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరినైనా పిల్లలుగా నిర్వచిస్తుంది. చైల్డ్ లేబర్ (నిషేధం, నియంత్రణ) చట్టం 1986 " పద్నాల్గు సంవత్సరాల వయస్సు పూర్తి కాని వ్యక్తి" శిశువుగా నిర్వచిస్తుంది."

బాల కార్మికులంటే అర్థం

'బాల కార్మికులు'ను ఇంట్లోగాని బయటగాని ఏదైనా పని చేయటానికి సమయం, శక్తి, నిబద్ధతతో చేయవలసి ఉండి విశ్రాంతి, ఆట మరియు విద్యా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిల్లల సామర్థ్యాన్ని ప్రభావితం చెసేది అని నిర్వచించారు. ఇలాంటి పనులు చేసే పిల్లల ఆరోగ్యం మరియు అభివృద్ధి కుంటుపడుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం, "బాల కార్మికులు ముందుగానే వయోజన జీవితాన్ని గడుపుతారు అలాగే ఎక్కువ గంటలు తక్కువ జీతాలకు పని చేస్తారు. దాని వలన వారి శారీరక మరియు మానసిక అభివృద్ధి పాడు అవుతాయి”. వారు తరచుగా వారి కుటుంబాల నుండి వేరు చేయబడి అర్థవంతమైన విద్య మరియు శిక్షణ అవకాశాలను కోల్పోయి మెరుగైన భవిష్యత్ పొందలేక పోతారు.

నిజానికి ఎవరైతే 6- 14 సంవత్సరాల వయస్సు వర్గపు బాలలు పాఠశాలకు వెల్లటంలేదో వారందరు సంభావ్య బాల కార్మికులుగా భావించడం జరుగుతుంది. భారతదేశంలో బాల కార్మికులు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారు. పని చేస్తున్న పిల్లలు 90,87 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు మరియు 9.13 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు.

బాల కార్మికుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు

పిల్లలు ప్రమాదకరమైన మరియు అనారోగ్య పరిస్థితులలో తరచుగా చాలా గంటలు పనిచేయటం వలన శాశ్వత శారీరక మరియు మానసిక హాని కలుగుతుంది. వారికి కింది జబ్బులు రావచ్చు.

 • ఉబ్బసం, క్షయ లాంటి శ్వాస సంబంధిత సమస్యలు
 • సాధారణ బలహీనత, పెరుగుదల సన్నగించటం, ఒళ్ళు నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు
 • కంటి చూపు సన్నగించటం మరియు ఇతర కంటి సమస్యలు: నీరుకారటం, చికాకు మరియు కళ్ళు ఎర్రబడటం
 • ఆకలి లేకపోనటం
 • ట్యూమర్స్ మరియు బర్న్స్
 • మగ్గాల పై పని ద్వారా వైకల్యం
 • పెరిగే కొద్ది ఆర్థరైటిస్ ప్రభావం
 • మానసిక వైకల్యాలు

చైల్డ్ లేబర్ (నిషేధం, నియంత్రణ) చట్టం, 1986 గమనించదగిన ఫీచర్స్

పద్నాలుగు సంవత్సరాలు పూర్తి కాని ఏ వ్యక్తి అయినా పనిచేయటాన్ని ఈ చట్టం, షెడ్యూల్ భాగము A Bలో చేర్చిన విధంగా, నిషేధిస్తుంది.

నిషేధిత వృత్తులు లేదా ప్రక్రియలలో షెడ్యుల్ మార్పులు నిర్ణయించే ఒక విధానాన్ని సూచిస్తుంది.

పిల్లలు పని చేయటం నిషేధించబడని వాటిలోని పని పరిస్థితులను నియంత్రిస్తుంది.

ఈ చట్టం ద్వారా పిల్లలను పనిలో పెట్టుకున్నవారికి పెద్దమొత్తంలో పెనాల్టీలు వేయటం మరియు చట్టం విభాగం 14 యొక్క నిబంధనల ఉల్లంఘన చేసినవారికి ఒక సంవత్సరం (కనీస మూడు నెలలు) వరకు జైలు శిక్ష లేదా/తో జరిమానా రూ. 20.000 / - (కనీస పది వేల) లేదా రెండింటినీ వెస్తారు. చిల్డ్రన్ విభాగం 3 నిబంధనల ద్వారా నిశేధించబడని వాటిలో వ్యవహరించవలసినని కింద ఇవ్వబడింది.

 • పిల్లలు ఒక రోజు అరగంట విరామం కలుపుకొని ఆరు గంటల కంటే ఎక్కువ పని చెయకూడదు.
 • ఏ పిల్లలు సాయంత్రం 7 నుంచి ఉదయం 8 గంటల మధ్య పని చేయకూడదు.
 • పిల్లలకు ఓవర్ టైం పని అనుమతి ఉండకూడదు.
 • ప్రతి పిల్లలు వారంలో ఒక రోజు సెలవు పొందాలి.
 • బాలల ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఇన్స్పెక్టరుకు తెలియజేసే బాధ్యత యజమానికి ఉంది. యజమాని దీనికోసం రిజిస్టరును నిర్వహించటం తప్పనిసరి.

ప్రసూతి ప్రయోజనం

 • ప్రతి మహిళలు ప్రసూతి ప్రయోజనం చెల్లింపును పొందుతుంది.
 • ప్రసూతి ప్రయోజనం అంటే మాతృత్వం సమయంలో మహిళలు రాని సమయంలో యజమాని ద్వారా చెల్లించవలసిన వేతనాలు అని అర్థం.
 • స్త్రీలకు వైద్య బోనస్ కూడా ఉంటుంది.
 • గర్భస్రావం లేదా వైద్యానికి సంబంధించిన గర్భస్రావం లేదా అండాశయము నుండి గర్భాశయమునకు పోవు నాళము ఆపరేషన్ అప్పుడు వేతనాలు స్త్రీల హక్కు.
 • కర్మాగారం, గని, తోటల, దుకాణాలు, ప్రభుత్వం సంస్థలు, పరిశ్రమ, మొదలైనవాటిలో ఈ ప్రయోజనాలు ఉంటాయి. గర్భం సమయంలో, తర్వాత మరియు మాతృత్వ ప్రారంభ నెలలలో, పనిచేస్తున్న ప్రతి మహిళలకు ఇవి వర్తిస్తాయి.
 • డెలివరీ ముందు పూర్తి జీతంతో 6 వారాల సెలవు మరియు డెలివరీ తరువాత పూర్తి జీతంతో 6 వారాల సెలవు ఇవ్వలి.
 • యజమాని వైద్య సౌకర్యాలు కలిగి లేకపోతె , అప్పుడు అతను Rs.250 / వైద్య బోనస్ ఇవ్వాలి .
 • యజమాని మహిళ గర్భం చివరి పని దినాల నెలలో ఏ భారీ పని చేయించకూడదు.
 • ఒక మహిళకు గర్భస్రావం అయితే, అప్పుడు గర్భస్రావం తరువాత ఆమెకు 6 వారాల పూర్తి జీతంతో సెలవు పొందే హక్కు ఉంది.
 • గర్భం, డెలివరీ, లేదా గర్భస్రావం కారణంగా లేదా ఒక ప్రీమచ్చూర్ పిల్లల కలిగినప్పుడు అనారోగ్యం వచ్చినట్లయితే, ఆమె ఒక నెల ఆర్జిత సెలవులు పెట్టవచ్చు. మహిళా ఉద్యోగికి కొంత సమయం ఆమె శిశువుకు తినిపించడానికి రోజుకు రెండుసార్లు సాధారణ విరామాలు, పిల్లలకు 15 నెలల వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి.
 • ప్రసూతి ప్రయోజనాలు పిల్లలు మరణించినా లేదా ముందు పుట్టిన కూడా ఇస్తారు

కనీస వేతన చట్టం

కనీస వేతనాల చట్టం 1948:
 • ఒక కార్మికుడు కనీస వేతన చట్టం ద్వారా పెర్కొన్న జీతం పొందాలి. కనీస వేతనం పని మరియు రకాన్ని బట్టి ప్రభుత్వం ద్వారా పరిష్కరించబడింది.
 • ఒక మహిళ పురుషునితో సమానమైన పనికి ఒకే రకమైన వేతనం పొందాలి.
 • వేతనాలు రోజుకు లేదా గంటకు లేదా నెలకు నిర్దేశించవచ్చు.
 • వేతనాలు నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయంలో వేతనాలు పాక్షికంగా వెరేవిధంగా చెల్లించవచ్చు.
 • చట్టం ద్వారా చెసిన మినహాయింపులు కాక వేరే ఏవిధమైన మినహాయింపులను వేతనాలలో చేయకూడదు.
 • పని గంటల ఒకే రకంగా ఉంటాయి. యజమాని రోజుకు 9 గంటల కంటే ఎక్కువ పని చేయమని కార్మికులను అడగకూడదు.
 • అదనపు పని కోసం, యజమాని రెండింతల వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్యాక్టరీస్ లో మహిళలకు సౌకర్యాలు

 • కర్మాగారాల్లో పని చేసే మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు చట్టం అందిస్తుంది.
 • ప్రత్యేక మరుగుదొడ్లు అరిడ్ వాష్ రూములు
 • 30 మంది మహిళలా కార్మికుల కంటే ఎక్కువ పని చేస్తున్న ఒక ఫ్యాక్టరీ పిల్లలకు ఒక సిటింగ్ కల్పించవలసి ఉంటుంది.
 • మహిళలు సూచించిన బరువు కంటే ఎక్కువగా ఎత్తడానికి వీలులేదు.
 • మహిళలను కదిలే యంత్రాలను శుభ్రం చేయమనిగాని లేదా నూనె వేయమనికాని అడగరాదు.
 • పని గంటలు వారానికి 48 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
 • మహిళలకు వారంలో ఒక రోజు సెలవును ఇవ్వాలి.
 • మహిళలు ఆపకుండా 5 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు.
 • ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మహిళలకు పని గంటలు ఉంటాయి.

సమాన పనికి సమాన వేతనం

 • మీరు చేసే పని నైపుణ్యం, ప్రయత్నం మరియు బాధ్యతను కలిగి ఉంటే - అదే వేతన పరిస్థితులలో పనిచేసే వ్యక్తికి ఇచ్చే జీతానికి మీరు అర్హులు.
 • ఏదైనా యజమాని వివక్ష చూపినట్లైతే లేబర్ ఆఫీసర్/ఇన్స్పెక్టర్లు/కార్మిక సంఘాలు/ NGOలకు తేలియ చేయాలి

ఆధారము: నేషనల్  కమిషన్  ఫర్  విమెన్

3.08474576271
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు