హోమ్ / సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం / పైలట్ కన్వర్జెన్స్ ప్రాజెక్టు – పూర్ణ శక్తి కేంద్ర
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పైలట్ కన్వర్జెన్స్ ప్రాజెక్టు – పూర్ణ శక్తి కేంద్ర

జాతీయ మహిళా సాధికారత మిషన్ ముఖ్యమైన అంశాలలో అతి ముఖ్యమైన అంశము ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ మంత్రీత్వశాఖల పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటాయి. వాటిని ఒకే చోటకు చేర్చటం.

పథకం గురించి

జాతీయ మహిళా సాధికారత మిషన్ ముఖ్యమైన అంశాలలో అతి ముఖ్యమైన అంశము ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ మంత్రీత్వశాఖల పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటాయి. వాటిని ఒకే చోటకు చేర్చటం. మహిళల కోసం రూపోందించి, అమలు చేస్తున్న వివధ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళలు లబ్ధి పొందాలంటే వారికి ఆ కార్యక్రమాల పట్ల అవగాహన కల్గి ఉండాలి మరియు వాటిని డిమాండ్ చేసే విధంగా మహిళలు చైతన్యవంతులై ఉండాలి. అటువంటి వాతావరణం కల్పిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది.

ఈ పైలట్ కన్వర్జెన్సు ప్రాజెక్టు రూపకల్పన ఉద్థేశ్యం ఏమిటంటే ఈ పథకాలు మరియు కార్యక్రమాలు అట్టడుగు స్థాయికి చేర్చడానికి అవసరమైన కన్వర్జెన్స్ మరియు ఫెసిలిటేషన్ కేంద్రాలను (సమన్వయ కేంద్రాలు ) జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరియు గ్రామ లేదా పంచాయతీ స్థాయిలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఈ కన్వర్జెన్స్ మరియు ఫెసిలిటేషన్ కేంద్రాలు మహిళలకు అందించే సేవల డిమాండు మరియు సప్లై లో ఉన్న అంతరాలను పూరించడానికి దోహద పడతాయి. అవి ఎలాగంటే వాస్తవిక డిమాండ్ అంచనా వేయడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పట్ల మహిళలకు చైతన్యం కల్పించడం,  వివిధ పథకాలు, కార్యక్రమాల పట్ల పెరుగుతున్న డిమాండును గుర్తించడం, వాటిని సేవలు అందించే వారికి అనుసంధానం చేయడం జరుగుతుంది.

ప్రభుత్వం, పంచాయితీ రాజ్ సంస్థలు, ప్రజా సేవా సంస్థలు మధ్య భాగస్వామ్యం జరిగి కలిసి పనిచేసే వాతావరణ ఏర్పడాలి. దీని వలన  క్షేత్ర స్థాయిలో  సమాచార వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి సహాయ పడుతుంది. ముఖ్యంగా క్రిటికల్ మైండ్ సెట్ మార్చడానికి, న్యాయ హక్కులు, వసతులు పై అవగాహన కల్పించడానకి ఉపయోగపడుతుంది.

ఉద్ధేశ్యాలు

ప్రస్తుతం సేవల పంపిణీ యంత్రాంగం లో ఉన్న అంతరాలను విశ్లేషించడానికి మరియు సరియైన సూచనలు ఇవ్వడానికి ముఖ్యమైన కీలక వ్యక్తులను ఇందులో భాగస్వాములను చేయడానికి, కార్యచరణ ప్రణాళిక చేయడానికి, వారితో సమన్వయం చేయడానికి ఈ పూర్ణ శక్తి కేంద్రాల అవసరం ఉంది. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలు ద్వారా వివిధ పథకాలు, కార్యక్రమాలు, విధానాలు కలసి కట్టుగా పనిచేయడానికి ఇది దోహద పడుతుంది. క్షేత్రస్థాయిలో  మహిళ కేంద్ర బిందువుగా కార్యక్రమాలు అమలుకు అవసరమైన వ్యూహాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ పైలట్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ పథక లక్ష్యం ఏమిటంటే వివిధ శాఖల మధ్య  పధకాలు మరియు సేవలు కలిసి కట్టుగా వాటిని అన్ని శాఖల మధ్య సమన్వయంతో అవి ఎవరికోసమైతే రూపోందించబడ్డాయో వారికి అందేటట్టు చూడడం.

పధక కాలం

ప్రతి పూర్ణ శక్తి కేంద్ర పథకం కార్యాచరణ 1 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది వాటి పనితీరు, స్వరూపం ఆశించిన విధంగా సాధించన ప్రగతి మీద ఆధారపడి ఉంటుంది.

లక్ష్యం

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు కు సంబంధించిన మహిళా లబ్ధిదారులు

పథకంలో ముఖ్య భాగాలు

జిల్లా, తాలుకా లేదా మండల, వార్డు, గ్రామ స్థాయిలలో కన్వర్జన్స్ ఫోరమ్ మరియు  ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని పథకం యోచిస్తుంది. ఈ పథకం కింద పౌరులు ప్రభుత్వం నుండి వివిధ కార్యక్రమాల ద్వారా లభ్దిని పొందడానికి ఈ కేంద్రాలు మధ్యవర్తిగా వ్యవహరిస్తాయి.  ఈ కన్వర్జన్స్ ఫోరమ్ మరియు  ఫెసిలిటేషన్ సెంటర్స్ లో వివిధ శాఖల నుండి ప్రభుత్వ అధికారులు (జాతీయ మహిళా సాధికారతా మిషన్ లో భాగస్వాములైన ప్రభుత్వ శాఖలు), ప్రజా సంస్థలు, పంచాయితీ రాజ్ సంస్థల ప్రతినిధులుతో కలిపి గ్రామ, మండల మరియు జిల్లా స్థాయిలో కన్వర్జన్స్ ఫోరమ్ మరియు  ఫెసిలిటేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తారు.

వివిధ స్థాయిలలో కన్వర్జెన్సు సాధించడానికి అవసరమైన కన్వర్జెన్సు స్వరూపాలు

జిల్లా స్థాయిలో జిల్లా కన్వర్జెన్సు మరియు ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు. ఇది మండల, గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలను సమన్వయ పరిచి, పర్యవేక్షిస్తుంది.

మండల స్థాయిలో మండల కన్వర్జెన్సు మరియు ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు. ఇది ప్రభుత్వ పథకాల సమాచారం, కార్యక్రమలు, సేవలు మొ.. సమాచారం అందించే సింగల్ విండో సమాచార కేంద్రంగా పనిచేస్తుంది.

గ్రామ పంచాయితీ స్థాయిలో గ్రామ కన్వర్జన్స్ మరియు ఫెసిలిటేషన్ సెంటర్ పూర్ణశక్తి కేంద్రం (పి.యస్.కె) ఏర్పాటు చేస్తారు. ఇది మహిళా సేవా కేంద్రంగా పనిచేస్తుంది. అందరూ కలవడానికి ఒకవేదికగా పనిచేస్తుంది. మహిళల యొక్క సామర్థ్యాలను మరియు సాధ్యాలను అన్వేషించడానికి , వారు సమాజానికి అందిస్తున్న సహాయము, వారి యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ హక్కులపై పోరాడడానికి, వివిధ పథకాలు అందిపుచ్చుకోవడానికి అవరమైన చేయూత నివ్వడానికి మరియు మహిళా బాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు నిర్ణయం చేయడంలో మహిళల పాత్ర పెంపోందించడంలో ఈ కేంద్రాలు సహాయ పడతాయి.

గ్రామ స్థాయిలో , గ్రామస్థాయి కన్వర్జెన్సు ఫోరం  అంటే గ్రామ సమన్వయ కమిటి ని ఏర్పాటు చేస్తారు. ఇందులో గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బంది, మహిళా సర్పంచ్ మొదలగు వారు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటి, పూర్ణ శక్తి కేంద్రం సహాయ సహకారంతో బేస్ లైన్ సర్వే నిర్వహించడం, వివిధ కార్యక్రమాల ను లబ్ధిదారులతో మ్యాపింగు చేయడం, గ్రామంలోని మహిళా వివరాల సేకరణ, వారిని ఏఏ పథకంలో, ఏఏ సేవలలో మ్యాచింగు అవుతారో వాటి వివరాలతో నివేధిక తయారు చేయాలి.

ఫెసిలిటేషన్ సెంటర్ల పాత్రలు– బాధ్యతలు

ఈ పైలట్ ప్రాజెక్టు రూపకల్పనలో ఈ కింది అంశాలు ఉంటాయి

ముఖ్యంగా పంచాయితీ రాజ్ సంస్థలు ప్రధాన భూమిక పోషిస్తాయి.

వివిధ స్థాయిలలో ప్రభుత్వంతో, ప్రజా సంస్థలతో, పంచాయితీ రాజ్ సంస్థలతో సత్సంబంధాలు నెలకొల్పాలి

క్షేత్ర స్థాయిలో కన్వర్జన్సు మరియు జెండర్ (స్త్రీ, పురుషుల సమానత్వం)  ఈక్విటీ పై చైతన్య కార్యక్రమాల సదస్సులు నిర్వహిస్తారు. దీనివలన మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకుని, వారు తమ కార్యక్రమాలను అందిపుచ్చుకునే విధంగా మహిళలు డిమాండ్ చేయగలుగుతారు

జెండర్ (స్త్రీ, పురుషుల సమానత్వం) గురించి ఈ కేంద్రాలు కేంద్ర బిందువుగా మారతాయి. ఇవే అన్ని ప్రభుత్వ శాఖలను కలిపే సమన్వయ వేధికలవుతాయి.

అన్ని రంగాలలో అమలు జరుపుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలుకు సంబందించిన లబ్ధి దారులను గుర్తించడం జరుగుతుంది, వారు ఏఏ పథకాలు నుండి లబ్ధి పొందవచ్చో మ్యాపింగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అణగారిన, బలహీనవర్గాల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

అన్ని ప్రభుత్వ శాఖల పథకాలు, కార్యక్రమాలకు కొలమానబద్దకంగా లక్ష్యాలను పెట్టడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా స్త్రీ, పురుషుల సమానత్వం మరియు శాఖల మధ్య సమన్వయం అన్ని రంగాలలో, అన్ని ప్రభుత్వ పథకాలలో, సేవలలో ఉండేటట్టు చూడడం జరుగుతుంది.

క్షేత్ర స్థాయి సిబ్బంది అయిన ఆశా కార్యకర్త, అంగన్ వాడీ కార్యకర్త, ఉపాధ్యాయులు మొదలగు వారితో సత్సంబంధాలు, సమన్వయం పెంపోందిస్తూ ఉంటారు.

క్షేత్రస్థాయిలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు, మహిళా సమాఖ్యలు, మహిళా సంఘాలు మరియు ఇతర వేధికలు మధ్య సత్సంబంధాలు, సమన్వయం పెంపొందించడం జరుగుతుంది.

ప్రభుత్వ పథకాలు, సేవలు ఒకే చోట అందించే విధంగా ఉమ్మడి వేధిక సృష్టించబడుతుంది

పథకాల లభ్థిదారులకు సంబంధించి ఒకే రకమైన డేటా బ్యాంకు సృష్టించబడుతుంది. వివిధ సేవలు అందించే విధంగా సింగల్ విండో వ్యవస్థను సృష్టించడం జరుగుతుంది.

కీలక సంస్థలు, వ్యక్తులకు జెండర్ ( స్త్రీ, పురుషుల సమానత్వం) పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

క్షేత్ర స్థాయిలో సరికొత్త, వినూత్న, ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయానికి అవసరమైన సంస్థాగత స్వరూపాలకు సంబంధించి వివరణాత్మకంగా కింద వివరించడం జరిగింది.

జిల్లా ప్రభుత్వ శాఖల సమన్వయ కేంద్రము (డిస్ట్రిక్టు కన్వర్జన్స్ మరియు ఫెసిలిటేషన్ సెంటర్)

మహిళలసాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల, కార్యక్రమాలు, సేవలు సమాచారం అందించే సింగిల్ విండో కేంద్రముగా ఈ  జిల్లా సమన్వయ కేంద్రము పనిచేస్తుంది.  జిల్లా సమన్వయ కేంద్రములో నియమించబడిన సమాచారం కేంద్ర సిబ్బంది పౌరులకు సమాచారం అందిస్తారు. వీరు ముఖ్యంగా మహిళలకు ప్రాథాన్యత ఇస్తారు. ఈ కేంద్రం మహిళలు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేటట్టుగా అంటే దరఖాస్తులు నింపడం, ధరఖాస్తు కు అవసరమైన మిగతా డాక్యుమెంట్లను పరిశీలించడం, దరఖాస్తులను సమర్పించడంలో మహిళలకు సహాయ పడుతుంది.

జిల్లా సమన్వయ కేంద్రము మండల లేదా తాలూకా లేదా గ్రామ స్థాయిలో ఉన్న మహిళా కేంద్రాలతో కలసి స్థానిక స్థితిగతులును దృష్టిలో తీసుకున్న తరువాత, మహిళా సాధికారత అవరోధానికి కారణమైన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ కారణాలను విశ్లేషణ చేస్తుంది. మహిళా సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేయబడిన వివిధ చట్టాలు స్థితిగతులను ఈ కేంద్రము సమీక్షిస్తుంది. ఈ జిల్లా సమన్వయ కేంద్రము మహిళా సమస్యలను డిప్యూటీ కమీషన్ లేదా సి.ఇ.వో., జిల్లా పరిషత్, చట్ట అమలు సంస్థలు, పాక్షిక ప్రభుత్వ సంస్థలు, మహిళా కమీషన్  అద్యక్షత వహిస్తున్నవేధికలో ఈ మహిళా సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. జిల్లా వనరుల కేంద్రము పౌరసంస్థలు, పరిజ్ఞాన యోచనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, విద్య, పరిశోధన సంస్థలు వంటి సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను ఈ కేంద్రము ఉపయోగించుకుంటుంది మరియు విస్తృత వేధికలలో మహిళాసమస్యలను చర్చించి సుదీర్ఘ ప్రభావాన్ని సృష్టించగలుగుతుంది. ఇది రాష్ట్ర వనరుల కేంద్రం (స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్) కు కుడి భుజం లా పనిచేస్తూ రాష్ట్ర వనరుల కేంద్రం యొక్క లక్ష్యాలను జిల్లాలో అమలు చేయడానికి దోహద పడుతుంది.

ఈ జిల్లా సమన్వయ కేంద్రము జిల్లా కలెక్టరు కార్యాలయం లేదా సి.ఇ.వో. జిల్లా పంచాయిత్ కార్యాలయంలో ఉంటుంది. ఈ కేంద్ర సేవలను మహిళలు సులభంగా అందుకునేటట్టు సౌకర్యం కల్పించబడుతుంది. అదే విధంగా వివిధ ప్రభుత్వ శాఖలలు కూడా సమన్వయం చేయడానికి సులభంగా ఉంటుంది.

జిల్లా వనరులు కేంద్రము యొక్క బాధ్యతలను ఈ కింద వివరించడం జరిగింది

అన్ని ప్రభుత్వ శాఖల పథకాలు, కార్యక్రమాలు, సేవలు మొదలగు సమాచార బ్యాంకును లేదా సమాచార రిపాజిటరీ సృష్టించడం జరుగుతుంది (పథకాల వివరాలు, లబ్థిదారుల అర్హతలు, కావలసిన డాక్యుమెంట్లు, దరఖాస్తు ప్రకియకు పట్టే సమయం, పథక ప్రయోజనాలు, సేవలు మహిళలకు అందేటట్టు సహాయపడడం, దరఖాస్తు యొక్క ప్రస్తుత పరిస్తితిని ట్రాకింగు చేయడం చేస్తుంది. ఈ కేంద్రంలో ఇచ్చే సమాచారం లభ్థిదారులకు సంబంధించినదై ఉంటుంది మరియు తాజా సమాచారం కల్గి ఉంటుంది.

సమాచార సహాయ కేంద్రానికి వచ్చిన మహిళలకు వివిధ పథకాలు, కార్యక్రమాలు, సేవలు మరియు న్యాయ హక్కులు సమాచారం అందించడం జరుగుతుంది. ( ఈ సమాచార కేంద్రములో అర్హత గల సిబ్బందిని నియమించడం జరుగుతుంది)

జిల్లా సమన్వయ కేంద్రమునకు వచ్చిన మహిళలకు ఈ కేంద్రము వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు  దరఖాస్తు పెట్టుకోవడానికి సహాయ పడుతుంది. ఎక్కడైతే గ్రామ సమన్వయ కేంద్రము పనిచేస్తుందో అక్కడి నుండి ఎవరైన మహిళలు ఆ గ్రామం నుండి వచ్చినట్లయితే వారి ప్రారంభ నిర్ధారణ చేసి, వారి అప్లికేషన్లు పరిశీలన చేసి, బేస్ లైన్ డేటా లో ఉన్న డేటా బేస్ లో వారి పేర్లను మ్యాచింగు చేసిన తరువాత, వారి దరఖాస్తు పూర్తి చేయడానికి ఈ కేంద్రము సహాయ పడుతుంది. గ్రామ సమన్వయ కేంద్రము లేని గ్రామం నుండి ఎవరైన మహిళలు వస్తే, డేటా బేస్  మ్యాచింగు కాని ఇతర సేవలను వారికి అందించడం జరుగుతుంది.

మహిళలు దరఖాస్తు చేసుకున్న తరువాత, ఈ కేంద్రము ఇతర ప్రభుత్వ శాఖలతో ఈ దరఖాస్తు గురించి పాలో ఆఫ్ చేస్తుంది మరియు పర్యవేక్షణ చేస్తుంది. జిల్లా కలెక్టరు, వివిథ ప్రభుత్వ శాఖాధిపతులకు ప్రతినెలా ప్రతి దరఖాస్తు యొక్క పరిస్థితిని తెలియజేయడం జరుగుతుంది. దరఖాస్తులో ఏమైన తప్పులు ఉన్నా, అతి క్రమణలు ఉన్నా వాటికి సరిదిద్దడానికి సమన్వయం చేస్తుంది. పౌరులకు వివాద పరిష్కాల కోసం సహాయ పడుతుంది.

వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలు, కార్యక్రమాలకు దరఖాస్తు చేస్తున్న పౌరులు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, వివిధ కేసులను డాక్యుమెంట్ చేయడం మరియు జిల్లా కలెక్టరు కార్యాలయం లేదా పంచాయతీ రాజ్ సంస్థల కార్యాలయానికి లేదా వివిధ వేధికలలో ఈ సమస్యల కేసులను ఈ కేంద్రము నివేధిస్తుంది.

కనీసం నెలకొకసారి జిల్లా సమన్వయ వేధిక ( డిస్ట్రిక్టు కన్వర్జన్సు ఫోరం) సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండాలి. ఇందులో పరస్పర ప్రభుత్వ శాఖల సమన్వయం కొరవడి వివిధ స్థాయిలలో సమస్యలు తలెత్తినట్లయితే ఈ సమావేశంలో శాఖల మధ్య సమన్వయం గురించి చర్చించాలి. ఈ జిల్లా సమన్వయ వేధికలో మహిళా సాధికారతకు అవరోధం కల్పిస్తున్న సామాజికి, ఆర్థిక, రాజకీయ కారణాలను కూడా ప్రధాన ఎజెండాగా పెట్టి వాటిపై చర్చ చేయాలి.

మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి, వాటిని వివిధ జిల్లా స్థాయి వేధికలలో చర్చించేటట్టు చేయాలి. ఉదాహరణకు జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశాలలో మహిళలకు పొదుపు మరియు ఋణాలకు సంబంధించిన వివిధ సమస్యలను చర్చించడం వంటివి చేస్తూ ఉండాలి.

జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కు సంబందించి సమగ్ర ప్రణాళిక తయారు చేస్తారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, ప్రాధమిక గణాంకాలు (బేస్ లైన్ సర్వే), సెకండరీ డేటా విశ్లేషణ  చేసి, దానిని ఆధారంగా ప్రణాళికను చేయాలి.  ప్రణాళికలో పథక లక్ష్యాలకు ఆధారంగా సాధించే ఫలితాలను, స్థానిక పరిస్థితులను బట్టి కాల చట్రాన్ని జతపరచాలి.

గ్రామ పంచాయితీలో గ్రామ సమన్వయ కేంద్రము, మండల స్థాయిలో మండల సమన్వయ కేంద్రాలకు పైలట్ పథకం యొక్క ప్రణాళిక మరియు పథక అమలు చేయుటలో సహాయ పడడం చేయాలి.

గ్రామ సమన్వయ కేంద్రం ద్వారా గ్రామంలోని పౌరులకు సంబంధించిన గణాంకాల డేటాబేస్ ను అభివృద్ది పరచి, వాటిని నిర్వహించే బాథ్యత తీసుకోవాలి. ఇందులో బేస్ లైన్ సర్వే ఫారంలు రూపోందిచడం, మండల సమన్వయ కేంద్రం, గ్రామ సమన్వయ కేంద్ర సిబ్బందికి శిక్షణలు ఇవ్వడం చేయాలి. సర్వే కోసం ప్రణాళిక చేసి, సర్వే పూర్తి చేయాలి. సర్వే పర్యవేక్షణ చేయాలి. సర్వే డేటాను దృవీకరించాలి. డిజిటల్ ఫార్మట్ లో డేటాను సృష్టించాలి. డేటా బేస్ ను క్రమంగా ఆప్ డేట్ చేస్తూ, తప్పులను సరిదిద్దుతూ ఉండాలి.

జన్ సూన్వాయిస్ (పబ్లిక్ హియరింగు) వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందులో జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గోనేటట్టు చూడాలి.

జాతీయ మహిళా సాధికారత మిషన్ యొక్క శిక్షణ, సామర్థ్య నిర్మాణ వ్యూహాన్ని అమలు చేయాలి. ఇందులో మండల మరియు గ్రామ సమన్వయ కేంద్రాలలో పనిచేసే సిబ్బందికి శిక్షణ అవసరాల విశ్లేషణ చేయడం, బయట శిక్షణా సంస్థలతో శిక్షణలు ఇప్పించడం, వారికి శిక్షణలు నిర్వహించడం చేస్తూ ఉండాలి.

జాతీయ మహిళా సాధికారత మిషన్ యొక్క సమాచార, విద్య, భావ ప్రసార (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) మరియు ప్రవర్తనా మార్పు కమ్యూనికేషన్ (బి.సి.సి.) వ్యూహాలను అమలు చేస్తూ ఉండాలి.

సమర్థవంతంగా ప్రభుత్వ శాఖల సమన్వయ ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో జరుగడానికి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో సమీక్షా సమావేశాలు క్రమం తప్పకుండా చూడాలి.

పైలట్ ప్రాజెక్టు ప్రగతి నివేధికలను క్రమం తప్పకుండా రాష్ట్ర మహిళా వనరుల కేంద్రంనకు లేదా జాతీయ మహిళా సాధికారత మిషన్ కు ప్రత్యేక ఫార్మట్ లో నివేధించాలి.

రాష్ట్ర మహిళా వనరుల కేంద్రం ఏదైనా కార్యక్రమాన్ని కేటాయిస్తే దానిని నిర్వర్తించాలి.

మండల సమన్వయ కేందము (మండల కన్వర్జన్సు మరియు ఫెసిలిటేషన్ సెంటర్)

  • ఎక్కడయితే గ్రామ సమన్వయ కేంద్రాలు ఎంపిక చేశారో లేదా, ఎక్కడయితే 10 గ్రామ పంచాయితీలలో గ్రామ సమన్వయ కేంద్రాలు ఎంపిక చేశారో ఆ మండలంలో మండల సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.  ఈ మండల సమన్వయ కేంద్రం ప్రభుత్వ శాఖలు లేదా మండల పరిషత్ ఉన్న బిల్డింగు కార్యాలయాలలోనే ఏర్పాటు చేయాలి. ఈ మండల సమన్వయ కేంద్రం ఆ మండలంలో ఉన్న గ్రామ సమన్వయ కేంద్రాలకు జాతీయ మహిళా సాధికారత మిషన్ కార్యక్రమాలు అమలు చేయడానికి సహాయపడుతుంది.
  • ఈ మండల సమన్వయ కేంద్రము  యొక్క ప్రధాన బాధ్యతలను ఈ కింద వివరించడం జరిగింది
  • గ్రామ సమన్వయ కేంద్రము యొక్క కార్యక్రమాలకు  సహాయ పడడం, వాటిని పర్యవేక్షించడం చేస్తుంది. ఇంకా గ్రామ సమన్వయ కేంద్ర సిబ్బందికి అవసరమైన శిక్షణలు నిర్వహించడం, బేస్ లైన్ సర్వే నిర్వహించండం, సర్వే డేటాను ధృవీకరించడం మరియు పౌరుల సమర్పించిన ధరఖాస్తు ఫార్మట్ లను ఆయా ప్రభుత్వ శాఖలకు అందచేసి, ఆయా పథకాలు లబ్థి దారులకు అందేటట్టు చేయడం ఈ కేంద్రం చేస్తుంది.
  • సర్వే నుండి వచ్చిన బేస్ లైన్ డేటాను పరిశీలించి, ధృవీకరించడం చేయాలి. డేటాను డిజిటల్ ఫార్మట్లోకి మార్చడానికి జిల్లా సమన్వయ కేంద్రానికి పంపించే ముందు డేటా యొక్క ప్రామాణీకతను తనిఖీ చేయాలి.
  • గ్రామ సమన్వయ కేంద్రాలకు సంబంధించిన అన్నిగ్రామాల డేటా వివరాలను అందించాలి. అదే విధంగా మహిళా స్కోరు కార్డులు కూడా అందించాలి. గ్రామ సమన్వయ కేంద్రాలు నిర్వహణ చేస్తున్న మహిళా స్కోరు కార్డుల డేటా బేస్ ను మండల సమన్వయ కేంద్రం పర్యవేక్షిస్తూ ఉండాలి.
  • మండల స్థాయిలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారుతో  సమన్వయం చేస్తూ ఉండాలి. ఉదాహరణకు మండల పరిషత్ అభివృద్ది అధికారితో సమన్వయం కల్గిఉండి మహిళలు పెట్టుకున్న వివిధ ఆర్జీలు, ధరఖాస్తులను వారికి సమర్పించి, తద్వారా ఆయా ప్రభుత్వ పథకాలు, సేవలు లబ్థిదారులకు చేరేటట్టు కృషి చేయాలి.
  • పంచాయితీ రాజ్ సంస్థలు, గ్రామస్థాయి సంస్థలైన అంగన్ వాడీ వంటి సంస్థల నిర్వహణలో మహిళలు భాగస్వాములై పాల్గోనేటట్టు చూడాలి. ముఖ్యంగా గ్రామ సభ సమావేశాలు, కమీటీ (అంగన్ వాడీ కమీటీలలో తల్లీతండ్రుల ప్రాతినీద్యం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సహచరుల ప్రాతినీద్యం) లలో మహిళలు పాల్గోనేటట్టు చూడాలి.
  • మండల స్థాయి సమన్వయ వేధికల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేటట్టు చూడాలి. అందులో ముఖ్యమైన సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు పై చర్చ జరిగేటట్టు చూడాలి.
  • గ్రామ పంచాయితీ స్థాయిలో క్రమం తప్పకుండా ఆశా, అంగన్ వాడీ కార్యకర్త మొదలగు క్షేత్రస్థాయి సిబ్బంది సమావేశాలు జరిగేటట్టు చూడాలి.
  • ప్రభుత్వ కార్యక్రమాల లబ్థి కోసం లబ్ధి పొందాలనుకుంటున్న వారి పేర్లను ప్రభుత్వం సేకరిస్తూ ఉంటుంది.  అందుకోసం ఏదైనా గుర్తింపు కార్డు అవసరం. ఇలాంటి సందర్భాలలో మహిళలు డాక్యుమెంట్లు తయారు చేసుకునేటప్పుడు వారికి సహాయపడుతూ ఉండాలి (ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగంలో బి.పి.యల్ సర్వే, ఆధార్ కార్డు (యు.ఐ.డి.), మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వంటి గుర్తింపు కార్డులు వాడుతున్నారు.).
  • క్షేత్రస్థాయిలో సమన్వయ కార్యక్రమాలు అమలు జరుగడానికి అవసరమమైన పర్యవేక్షణ కోసం క్రమం తప్పకుండా మండల మరియు గ్రామ స్థాయీలలో సమావేశాలు జరిగేటట్టు చూడాలి.
  • క్రమం తప్పకుండా నెలవారీ ప్రగతి నివేధికలను జిల్లా సమన్వయ కేంద్రానికి నివేధిస్తూ ఉండాలి.
  • ఏదైనా కార్యక్రమము రాష్ట్ర మహిళా వనరుల కేంద్రము మరియు జిల్లా సమన్వయ కేంద్రము నిర్వహించమని కోరితే వాటిని నిర్వర్తించడం చేయాలి.

గ్రామ సమన్వయ కేంద్రము (గ్రామ కన్వర్జన్సు మరియు ఫెసిలిటేషన్ సెంటర్)

  • పథక గ్రామాలలో మహిళలు ప్రధమంగా సంప్రదించే కేంద్రబిందువే ఈ గ్రామ సమన్వయ కేంద్రము. ఈ కేంద్రము వివిధ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని, మహిళలకోసం చేసిన వివిధ చట్టాల సమాచారాన్ని అందిస్తుంది మరియు గ్రామంలో ఉన్న మహిళల సమస్యలకు పరిష్కార మార్గాల కోసం వివిధ వేధికలలో వాటి పై చర్చ చేస్తుంది. ఈ కేంద్రము మహిళల యొక్క విద్య, ఆరోగ్యం, పౌష్టికాహార అవసరాలు, వృత్తిపరమైన పరిస్థితులు, నైపుణ్య స్థాయి, న్యాయహక్కులు మొదలగు అంశాలపై మహిళలు చర్చించడానికి  ఈ వేధిక అవకాశం కల్పిస్తుంది.
  • గ్రామ పంచాయితీ కార్యాలయాలలోలేదా అంగన్ వాడీ కేంద్రాలలో ఈ గ్రామ సమన్వయ కేంద్రము కార్యాలయం పెట్టడతారు. తద్వారా ప్రజలు ఈ కేంద్రాలను సులభంగా సందర్శన చేయగల్గుతారు.
  • ఈ గ్రామ సమన్వయ కేంద్రము ముఖ్య బాధ్యతలను ఈ కింద వివరించడం జరిగింది
  • గ్రామంలో కుటుంబాల యొక్క సామాజిక ఆర్థిక వివరాలను సేకరించడానికి, మహాత్మా గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం మరియు బి.పి.యల్ కు సంబంధించిన డేటాతో సరిపోల్చడానికి ఒక బేస్ లైన్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డేటా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ తాజా సమాచార కల్గి ఉంటుంది.
  • లక్ష్యంగా పెట్టుకున్న లబ్ధిదారులకు అవసరమైన ప్రభుత్వ పథకాలను గుర్తించడం చేయాలి. వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలను వాటి అర్హతలను బట్టి గ్రామంలో ఉన్న మహిళలను మ్యాచింగు చేయడం చేయాలి.
  • వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడం, వివిధ సేవల పట్ల డిమాండు కల్పించడం, మహిళలు వాటిని అందుకునేటట్టు సహాయచేయడం, ఆ పథకాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేటట్టు ప్రోత్సహించడం చేయాలి.
  • గ్రామ స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వం చేత అందించబడుతున్న సేవల యొక్క వనరుల మ్యాపింగు చేయడం, వాటి పట్ల మహిళలు అవగాహన కల్గేటట్టు చైతన్యవంతులను చేయడం చేయాలి.
  • క్రమం తప్పకుండా గ్రామ స్థాయి కమిటీలు సమావేశాలు నిర్వహించడం, క్షేత్ర స్థాయి సిబ్బందితో సత్సంబంధాలు, సమన్వయం కల్గి ఉంది, ఆ సమావేశాలు జరిగేటట్టు చూడడం చేయాలి.
  • మహిళల సామర్థ్యం పెంపొందే విధంగా వివిధ కార్యక్రమాలు అమలు చేయడం చేయాలి. మహిళా మండలిలు, స్వయం సహాయక సంఘాలు, మహిళా సమాఖ్యలు వంటివి తప్పనిసరిగా ప్రోత్సహించాలి.
  • సాధికారత సూచికలు, కుటుంబ అభివృద్ధి సూచికలు, సాముదాయకాభివృద్ధి సూచికలు, మహిళాభివృద్ధి సూచికలు వంటి పరికరాలను ఉపయోగించి లక్ష్యంగా ఎంచుకున్న వారిలో ప్రగతిని ట్రాక్ చేస్తూ ఉండాలి.
  • మార్పుకు ఆదర్శంగా ఉన్న మహిళలను స్థానిక గ్రామం నుండి గుర్తించి, వారికి అన్ని రంగాలలో వివిధ విషయాల పట్ల పరిజ్ఞానం పెంచుతూ, నైపుణ్యాలు వృద్ధి చేస్తూ, వారు అన్ని కార్యక్రమాలలో పాల్గోని, వారికే వారే స్వయంగా నిర్ణయాలు తీసుకునేటట్టుగా తయారు చేయడం మరియు వారిని తోటి మహిళలకు శిక్షణ ఇచ్చేటట్టుగా తీర్చిదిద్దాలి. అటువంటి మహిళలకు గుర్తించి, ప్రోత్సహించే వేధికలను సృషించాలి.
  • గ్రామ మహిళలు సముదాయక పర్యవేక్షణ, సామాజిక తనిఖీ మరియు స్థానిక పర్యవరణ తనిఖీ  వంటివి నిర్వహించేటట్టు చూడాలి.
  • క్షేత్రస్థాయిలో సమన్వయ కార్యక్రమాలు అమలు జరుగడానికి అవసరమమైన పర్యవేక్షణ కోసం క్రమం తప్పకుండా గ్రామ స్థాయీలలో సమావేశాలు జరిగేటట్టు చూడాలి.
  • గ్రామ పంచాయితీలలో మరియు గ్రామ సభలలో మహిళలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు చర్చించే విధంగా చేయడం, మహిళలు తమ గళాన్ని గట్టిగా వినిపించేటట్టు మహిళలను తయారు చేయాలి.
  • క్రమం  తప్పకుండా మండల సమన్వయ కేంద్రానికి నెలవారీ ప్రగతి నివేదికను సమర్పించడం చేయాలి.
  • ఏదైనా కార్యక్రమము రాష్ట్ర మహిళా వనరుల కేంద్రము, మండల మరియు జిల్లా సమన్వయ కేంద్రాలు నిర్వహించమని కోరితే వాటిని నిర్వర్తించడం చేయాలి

 

 

ఆధారము: డా. నూనె శ్రీనివాసరావు గారు

3.0
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు